// // Family Drama Series OTT : రియల్ లైఫ్ కపుల్స్ రీల్ లైఫ్ లో ... -->
E-Paper
Advertisement

Family Drama Series OTT : రియల్ లైఫ్ కపుల్స్ రీల్ లైఫ్ లో… ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టనున్న మరాఠీ సిరీస్… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి

Family Drama Series OTT : రియల్ లైఫ్ కపుల్స్ రీల్ లైఫ్ లో… ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టనున్న మరాఠీ సిరీస్… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి
Advertisement

Family Drama Series OTT : ఓటీటీలోకి ఫ్యామిలీ ఆడియన్స్ ను పలకరించబోతోంది ఒక మరాఠీ సిరీస్. ఈ కథ కూడా చాలా ఇంట్రెస్టింగా, చూడచక్కగా ఉంటుంది. ఇది పెళ్లై పదేళ్లు పూర్తయిన ఒక జంట కథ. జీవితంలో అన్నీఉన్నా కొత్తదనం కోసం ఈ జంట ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నంలో సాగే కథ మన చుట్టుపక్కల ఇళ్ళల్లో ఉన్నట్లు, మన కుటుంబంలో జరుగుతున్నట్లు అనిపిస్తుంటుంది. ఇందులో ప్రధాన పాత్రల్లో ఒక రియల్ లైఫ్ కపుల్స్ నటిస్తుండటం విశేషం.

జీ5 (ZEE5) ఓటీటీలో స్ట్రీమింగ్

ఈ మరాఠీ ఫ్యామిలీ సిరీస్ పేరు ‘హే కాయ్ నవీన్’ (Hey Kay Navin). క్లాసిక్ హిట్ సినిమా ‘మురంబా’ తీసిన వరుణ్ నార్వేకర్ ఈ సిరీస్‌ని డైరెక్ట్ చేశారు. ఆయన కుటుంబ కథలను సహజంగా చూపించడంలో దిట్ట. ఇక మరాఠీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ రియల్ లైఫ్ కపుల్ ప్రియా బాపట్, ఉమేష్ కామత్ ఇందులో నటిస్తున్నారు. వీరిద్దరూ గతంలో చేసిన ‘ఆణి కాయ్ హవ’ సిరీస్ పెద్ద హిట్ అయింది. అందుకే ఇప్పుడు దీనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో శుభాంగి గోఖలే, ఉదయ్ టికేకర్, సుయోగ్‌ గోర్హే, రాజశ్రీ భావే కీలక పాత్రల్లో నటించారు. దీనిని ప్రతమేష్ రనడే నిర్మించిన ఈ సిరీస్ 2026 మార్చి 27 నుంచి, జీ5 (ZEE5) ఓటీటీలో మరాఠీ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇది పెళ్లి అయిపోయి, పదేళ్ల లైఫ్‌లో అన్నీ సెట్ అయిపోయిన ఒక మొగుడు పెళ్లాల కథ. రమ, ఆదిత్య అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. మంచి ఉద్యోగాలు, సొంత ఇల్లు, సుఖమైన కాపురం.. ఇలా బయట నుంచి చూస్తే అంతా సరిగ్గానే అన్నట్టు ఉంటుంది. కానీ జీవితం ఒకేలా సాగుతుంటే బోరింగ్ గా ఫీల్ అవుతుంది రమ. సరిగ్గా అప్పుడే రమ తనకంటూ ఒక కొత్త గుర్తింపు కోసం చీరల బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. ఈ కొత్త ప్రయాణంలో వాళ్ల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు, ప్రేమలు, నవ్వులే ఈ సిరీస్. పదేళ్ల పెళ్లి తర్వాత కూడా కొత్తగా ఏం చేయొచ్చు, ఒకరికొకరు ఎలా తోడుండాలి అనే విషయాన్ని చాలా న్యాచురల్ గా, మన పక్కింటి వాళ్ల కథలాగా చూపించబోతున్నారు ఇందులో. ఎప్పుడూ రొటీన్ గా సాగే కాపురంలో మళ్లీ ఉత్సాహాన్ని ఎలా నింపుకున్నారో తెలుసుకోవడమే ఈ ‘హే కాయ్ నవీన్’ అసలు ముచ్చట.

Read Also :  మొగుడికి విడాకులు… వాడుకునే బాయ్ ఫ్రెండ్… కట్ చేస్తే మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×