E-Paper
Advertisement

Family Drama OTT : ఒక్క వీడియో.. జీవితాన్ని నాశనం చేస్తే? ‘రీల్స్’ గొర్రెల కళ్లు తెరిపించే మూవీ ఇది

Family Drama OTT : ఒక్క వీడియో.. జీవితాన్ని నాశనం చేస్తే? ‘రీల్స్’ గొర్రెల కళ్లు తెరిపించే మూవీ ఇది
Advertisement

Family Drama OTT : సోషల్ మీడియా ఇప్పుడు మనుషుల జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. ఫ్యామిలీతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు యువత. రీల్స్, లైక్ ల కోసం నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక మలయాళం ఫ్యామిలీ డ్రామా మూవీ వచ్చింది. ఈ చిత్రం సోషల్ మీడియా, జనరేషన్ గ్యాప్ వంటి అంశాలను ఆసక్తికరంగా చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

బింటో స్టీఫెన్ దర్శకత్వం వహించిన ఈ మలయాళ కామెడీ సినిమా పేరు ‘ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ’ (Prince and Family). ఇది మలయాళ నటుడు దిలీప్ (Dileep) కెరీర్‌లో 150వ సినిమాగా నిలిచింది. ఈ చిత్రాన్ని లిస్టిన్ స్టీఫెన్ మ్యాజిక్ ఫ్రేమ్స్ ద్వారా నిర్మించారు. ఇందులో దిలీప్, రాణియా రాణా, ధ్యాన్ శ్రీనివాసన్, సిద్దిక్, బిందు పణిక్కర్, జానీ ఆంటోనీ, మంజు పిళ్ళై, జోస్కుట్టి జాకబ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సనల్ దేవ్ సంగీతం అందించాడు. ఈ సినిమా 2025 మే 9న థియేటర్లలో విడుదలైంది. థియేటర్ రన్ తర్వాత, ఈ చిత్రం 2025 జూన్ 20 నుండి ZEE5 లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన ఆరవ మలయాళ చిత్రంగా నిలిచింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కేరళలోని ఒక గ్రామీణ ప్రాంతంలో ‘ప్రిన్స్ చక్కలకల్’ (దిలీప్) అనే వ్యక్తి ఉంటాడు. అతను బ్రైడల్ బొటిక్ నడుపుతుంటాడు. అతను తన ఉమ్మడి కుటుంబానికి ఏకైక ఆధారం. తన ఇద్దరు తమ్ముళ్ల పెళ్లిళ్లు కూడా చేస్తాడు. 30 ఏళ్ల పైబడినా అతను మాత్రం ఇంకా బ్రహ్మచారిగానే ఉండిపోతాడు. తనకంటూ ఒక ప్రత్యేక గదిని కూడా సిద్ధం చేసుకుని పెళ్లి కోసం ఎదురుచూస్తున్న ప్రిన్స్, చివరకు 24 ఏళ్ల చింజు రాణి (రానియా రానా) అనే యువతిని పెళ్లి చేసుకుంటాడు.

ఇక అసలు కథ అక్కడి నుంచి మొదలవుతుంది. చింజు ఒక చురుకైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె తన రోజువారీ జీవితాన్ని ఎప్పుడూ వ్లాగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. మొదట్లో ఇది సరదాగా అనిపించినా, ఆమె ప్రైవేట్ విషయాలను కూడా పబ్లిక్‌గా పెట్టడం వల్ల ప్రిన్స్‌కు, అతని కుటుంబానికి ఇబ్బందులు మొదలవుతాయి. అయితే ఇది కాస్త ఒక రోజు హద్దులు దాటుతుంది. చింజు ఒక ‘ప్రాంక్ వీడియో’ కోసం తాను గర్భవతినని అబద్ధం చెప్పడంతో ఆమె పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగి ఆమె కెరీర్, వైవాహిక జీవితం రెండూ ప్రమాదంలో పడతాయి. చివరికి ప్రిన్స్ ఎలా దీనిని సరిచేశాడనేది మిగిలిన కథ.

Advertisement

Read Also : ప్రపంచాన్ని చూసే కోణాన్ని మార్చేసే మూవీ… మైండ్ బెండింగ్ ఎక్స్పీరియన్స్… తెలుగులోనే స్ట్రీమింగ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×