E-Paper
Advertisement

Family Drama OTT: పల్లెటూరి అందాలను ప్రేమించే పదకొండేళ్ల పిల్లాడు… ఐయండిబిలో 7.8 రేటింగ్…ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా

Family Drama OTT: పల్లెటూరి అందాలను ప్రేమించే పదకొండేళ్ల పిల్లాడు… ఐయండిబిలో 7.8 రేటింగ్…ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా
Advertisement

Family Drama OTT : ఒక అద్భుతమైన సినిమా చూడాలనుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాను హ్యాపీగా చూసేయొచ్చు. ముఖ్యంగా పిల్లలతో ఈ సినిమాను చూస్తే చాలా బాగుంటుంది. 11 ఏళ్ల పిల్లాడి ఎమోషన్స్, పల్లెటూరి వాతావరణంతో ఈ సినిమా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన చిత్రం ఇది. మరాఠీ నుంచి వచ్చిన ఈ సినిమాకి, నేషనల్ అవార్డు కూడా లభించడం విశేషం. అంతేకాకుండా ఐయండిబిలో 7.8 టాప్ రేటింగ్ ను కూడా ఈ సినిమా పొందింది.

ఎక్కడ చూడొచ్చు?

ఈ మరాఠీ డ్రామా మూవీ పేరు ‘కిల్లా’ (Killa). అవినాష్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్చిత్ దేవధర్, అమృతా సుభాష్, పార్థ్ బాలేరావ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 26 జూన్ 2015న విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మార్చి 2015లో జరిగిన 62వ జాతీయ చలనచిత్ర అవార్డులలో, ఈ చిత్రం మరాఠీలో ఉత్తమ చలనచిత్రంగా అవార్డును గెలుచుకుంది. అలాగే 64వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మకమైన ‘క్రిస్టల్ బేర్’ అవార్డును గెలుచుకుంది. ఇది ప్రస్తుతం ZEE5, Amazon Prime Video లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

చిన్మయి అనే 11 ఏళ్ల పిల్లాడి తండ్రి చనిపోయాక, వాళ్ల అమ్మకు కొంకణ్ ఏరియాలో వేరే ఊరికి ట్రాన్స్‌ఫర్ అవుద్ది. దీంతో చిన్మయి తన పాత స్నేహితులను వదిలేసి, ఆ కొత్త ఊరికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ వాతావరణం, ఆ కొత్త స్కూలు అన్నీ వాడికి అస్సలు నచ్చవు. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి, ఒంటరిగా ఫీల్ అవుతుంటాడు. మెల్లమెల్లగా ఆ స్కూల్లో కొందరు కుర్రాళ్లు వాడికి దోస్తులవుతారు. ముఖ్యంగా బండ్య అనే అల్లరి పిల్లాడు, వాడిని తన గ్రూపులో చేర్చుకుంటాడు. వాళ్లంతా కలిసి పాత కోటలు తిరగడం, సైకిళ్లు తొక్కడం, వర్షంలో తడవడం చేస్తూ ఉంటే.. చిన్మయి మెల్లగా తన బాధను మర్చిపోతాడు. ఆ కొత్త ఊరి మనుషులతో, అక్కడి ప్రకృతితో వాడికి ఒక తెలియని అనుబంధం ఏర్పడుతుంది. చిన్న పిల్లాడిగా ఆ ఊరికి వచ్చిన చిన్మయికి, జీవితం అంటే ఏంటో, మనుషులు ఎలా ఉంటారో అర్థం చేసుకుని ఒక మెచ్యూరిటీ వస్తుంది. మొత్తానికి మనసుని మెలిపెట్టే ఒక స్వచ్ఛమైన చిన్ననాటి కథ ఇది.

Read Also : తండ్రిని జైలుకు పంపే కూతురు… భర్త కోసం భార్య ఎదురుచూపులు… ఏడిపించే ఎమోషన్స్ కూడా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×