E-Paper
Advertisement

మిడిల్ క్లాస్ లైఫ్ కళ్ళకు కట్టినట్లు.. తండ్రికొడుకుల సెంటిమెంట్ తో కట్టిపడేస్తున్న మలయాళ మూవీ

మిడిల్ క్లాస్ లైఫ్ కళ్ళకు కట్టినట్లు.. తండ్రికొడుకుల సెంటిమెంట్ తో కట్టిపడేస్తున్న మలయాళ మూవీ
Advertisement

Family Drama OTT : మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమ జయరాం అగ్ర నటులలో ఒకరిగా రానిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా ఉంటుంది. అందుకే ఆయన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చుతాయి. ఇప్పటి వరకు ఆయన దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు కూడా. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచితులే. ‘భాగమతి’, ‘అల వైకుంఠపురములో’, ‘ధమాకా’, ‘గుంటూరు కారం’, ఇటీవలే వచ్చిన ‘హాయ్ నాన్న’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. అయితే ఆయన తన సొంత కొడుకు కాళిదాస్ జయరాంతో కలిసి నటించిన మూవీ ఇప్పుడు ఓటీటీలో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.

 జీ 5 (ZEE5)లో స్ట్రీమింగ్ 

ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘ఆశకల్ ఆయిరం’ (Aashakal Aayiram). జి.ప్రజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో జయరాం, కాళిదాస్‌లతో పాటు ఇషాని కృష్ణ, ఆషా శరత్, ఆనంద్ మన్మధన్, దిలీప్ మీనన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై మూవీని నిర్మించారు. ఈ సినిమా 2026 ఏప్రిల్ 17 నుండి ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇది మలయాళంతో పాటు తమిళ భాషలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు. ఇందులో జయరామ్ గారి కామెడీ, తండ్రీకొడుకుల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి.

స్టోరీ ఏమిటంటే 

Advertisement

హరిహరన్ (జయరాం) ఒక మెడికల్ రిప్రజెంటేటివ్. పాపం మధ్యతరగతి తండ్రి కదా.. కొడుకు ఏదైనా మంచి ఉద్యోగంలో సెటిల్ అయితే చూడాలని ఆయన తాపత్రయం. కానీ కొడుకు అజీష్ (కాళిదాస్ జయరాం) ఏమో రివర్స్! రోజూ ఫోన్ పట్టుకుని రీల్స్ చేయడం, ఫేమస్ అయిపోవాలని తిరగడమే వాడి పని. పనికిమాలిన పనులు మానేసి ఏదైనా దారి చూసుకోరా అని తండ్రి తిడుతుంటే, నీకేం తెలుసు డాడీ.. ఇదే అసలైన లైఫ్ అని కొడుకు ఎదురు తిరుగుతుంటాడు. ఇలా తండ్రీకొడుకుల మధ్య రోజూ చిటపటలతో గొడవలు జరుగుతుంటాయి.
ఇలాంటి టైమ్‌లో వాళ్ళ ఊరికి ఒక పెద్ద సినిమా షూటింగ్ వస్తుంది. ఆ షూటింగ్‌లో ఎలాగైనా ఛాన్స్ కొట్టి హీరో అయిపోవాలని కొడుకు చేసే హడావుడి, దానివల్ల తండ్రికి వచ్చే తలనొప్పులు భలే గమ్మత్తుగా ఉంటాయి. అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం తగ్గిందా? ఆ తండ్రి తన కొడుకు కలని అర్థం చేసుకున్నాడా? కొడుకు తండ్రి బాటలో నడిచాడా ? అనేదే ఈ సినిమా. నవ్వుకుంటూనే కళ్ళు చెమ్మగిల్లేలా చేసే మంచి ఫ్యామిలీ డ్రామా ఇది.

Read Also : తండ్రి పిచ్చిలో తప్పుదారి పట్టే కూతురు… పిచ్చెక్కించే సీన్లు

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×