E-Paper
Advertisement

OTT Movie : చేయని నేరానికి జైలుకు… అంతుపట్టని మిస్టరీ… ఈ కొరియన్ థ్రిల్లర్ చూస్తే బాక్సులు బద్ధలే

OTT Movie : చేయని నేరానికి జైలుకు… అంతుపట్టని మిస్టరీ… ఈ కొరియన్ థ్రిల్లర్ చూస్తే  బాక్సులు బద్ధలే
Advertisement

OTT Movie : కొరియా బాక్సాఫీస్‌లో సూపర్ హిట్ అయిన ఒక మూవీ ఆడియన్స్ నుంచి, ముఖ్యంగా యూత్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా వచ్చి దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ ట్రెండ్ సెట్ చేసింది. ఆన్‌లైన్ గేమ్‌లో లెజెండరీ అయిన ఒక అబ్బాయి చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. అతన్ని ఒక మర్డర్ కేసులో ఎవరో ప్లాన్ చేసి ఇరికిస్తారు. ఆ తరువాత యాక్షన్ సీన్స్ తుపాకీలా పేలుతుంటాయి. ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఈ సినిమాను ఆపే సమస్యే ఉండదు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్

ఈ సౌత్ కొరియా యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఫ్యాబ్రికేటెడ్ సిటీ’. 2017లో విడుదలైన ఈ సినిమా పార్క్ క్వాంగ్-హ్యోన్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో జీ సుంగ్-క్యూ (క్వాన్ యూ) ప్రధాన పాత్రలో నటించాడు. ఐయండిబిలో 7.5/10 రేటింగ్ ఉన్న ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

క్వాన్ యూ అనే అబ్బాయి రోజంతా ఇంట్లోనే ఉండి వీడియో గేమ్స్ ఆడుతుంటాడు. బయటికి వచ్చాడంటే ఇంటర్నెట్ కేఫ్ కి మాత్రమే వెళ్తాడు. గేమ్‌లో అతను టీమ్ లీడర్, ఎవడూ ఓడించలేనంత లెజెండ్. ఒక రోజు రాత్రి ఇంటర్నెట్ కేఫ్ లో ఒంటరిగా గేమ్ ఆడుతుంటే ఒక అమ్మాయి వచ్చి తన ఫోన్ ఛార్జ్ చేయమంటుంది. ఆ తర్వాత అతనికి ఏమీ గుర్తు లేదు. మరుసటి రోజు ఉదయం క్వాన్ యూని పోలీసులు జైలుకి తీసుకెళ్తారు. అతనిపై హత్య, అఘాయిత్యం నేరాలు నమోదవుతాయి. ఆ రాత్రి వచ్చిన అమ్మాయి DNA ఎవిడెన్స్, CCTV ఫుటేజ్ అన్నీ అతనికి వ్యతిరేకంగానే ఉంటాయి. అతని అమ్మ కూడా షాక్‌లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంది. జైల్లో ఉండగా క్వాన్ యూ తన గేమర్ ఫ్రెండ్స్‌కి సీక్రెట్ మెసేజ్ పంపిస్తాడు.

Read Also : నెట్ ఫ్లిక్స్ ని షేక్ చేస్తున్న ‘స్క్విడ్ గేమ్’ లాంటి బ్లడీ డెత్ గేమ్… ఈ సిరీస్ ను ఇంకా చూడలేదా ?

Advertisement

వాళ్లు కలిసి క్వాన్ యూని బయటికి తీసుకొస్తారు. ఇక అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఎవరో పెద్ద రిచ్ గ్యాంగ్ క్వాన్ యూ లైఫ్‌ని పూర్తిగా ఎడిట్ చేసి, ఫేక్ ఎవిడెన్స్ ప్లాంట్ చేశారు. ఇది ఒక్క క్వాన్ యూ కేసు కాదు… దేశంలోనే చాలా మంది అమాయకుల్ని ఇలానే ట్రాప్ చేసి జైల్లో పడేస్తున్నారు. దీని వెనుక ఒక గ్యాంగ్ ఉన్నట్లు తెలుసుకుంటారు. క్వాన్ యూ, అతని గేమర్ టీమ్ ఇప్పుడు ఆ భయంకరమైన గ్యాంగ్ తో ఫైట్ చేస్తారు. చివరికి క్వాన్ యూని ఈ కేసులో ఎందుకు ఇరికించారు ? దీని వెనుక ఎవరు ఉన్నారు ? క్వాన్ యూ ఈ కేసు నుంచి బయట పడతాడా ? అనే విషయాలను, ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×