E-Paper
Advertisement

మిస్సయిన స్పేస్ షిప్ తీసుకొచ్చే దెయ్యం… నరకం నుంచి డైరెక్ట్ అటాక్

మిస్సయిన స్పేస్ షిప్ తీసుకొచ్చే దెయ్యం… నరకం నుంచి డైరెక్ట్ అటాక్
Advertisement

Sci-Fi Horror Movie : అంతరిక్షంలో కనిపించకుండా పోయిన ఒక స్పేస్ షిప్ అకస్మాత్తుగా మళ్లీ సిగ్నల్ పంపితే ఏమవుతుంది? ఏళ్ల తరబడి ఎలాంటి సమాచారం లేకుండా మాయమైన ఓ నౌక ఒక్కసారిగా తిరిగి కనిపిస్తే నెక్ట్స్ ఏం జరుగుతుంది? ఇలాంటి భయానక పరిస్థితులతో ముందుకు సాగే సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమా ఈవెంట్ హారిజన్‌ (Event Horizon). అంతరిక్షంలోని ఒంటరితనం, మనిషి మనసులో దాగి ఉన్న భయాలను కలిపి చూపించిన హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ సాగే ఈ సినిమా చాలామందికి ఫేవరట్.

ఎక్కడ చూడచ్చంటే?

1997లో విడుదలైన ఈ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ హారర్ చిత్రానికి పాల్ డబ్ల్యూ ఎస్ ఆండర్సన్ దర్శకత్వం వహించారు. లారెన్స్ ఫిష్‌బర్న్, సామ్ నీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. విడుదల సమయంలో ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా, తర్వాత కాలంలో కల్ట్ హారర్ చిత్రంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా స్పేస్ నేపథ్యంతో భయాన్ని చూపించిన విధానం ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా పలు డిజిటల్ వేదికల్లో రెంట్‌కి అందుబాటులో ఉంది. ప్రైమ్‌ వీడియో, యాపిల్‌ టీవీతో పాటు యూట్యూబ్‌లోనూ స్ట్రీమ్‌ అవుతోంది.

కథేంటి?

Advertisement

భవిష్యత్తులో మనుషులు అంతరిక్షంలో చాలా దూరం ప్రయాణించే స్థాయికి చేరుకుంటారు. ఆ సమయంలో ఈవెంట్ హారిజన్ అనే ఒక ప్రత్యేక స్పేస్ షిప్ తయారవుతుంది. దీన్ని కాంతి వేగాన్ని దాటి ప్రయాణించే టెక్నాలజీతో రూపొందించారు. కానీ మొదటి ప్రయాణంలోనే ఆ నౌక అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. ఏళ్ల తర్వాత ఆ స్పేస్ షిప్ నుంచి ఒక్కసారిగా సిగ్నల్ వస్తుంది. దీంతో ఒక రెస్క్యూ టీమ్ ఆ నౌకను వెతుక్కుంటూ వెళ్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత వారికి విచిత్రమైన ఘటనలు ఎదురవుతాయి. షిప్ మొత్తం ఖాళీగా కనిపించినా, అక్కడ ఏదో భయంకరమైన విషయం దాగి ఉందని అర్థమవుతుంది.

Also Read : లైఫ్ లో ఏదైనా సాధించాలంటే ఎంత కసిగా ఉండాలో చూపించే క్రేజీ సినిమా… పూనకాలు తెప్పించే క్లైమాక్స్

Advertisement

క్రమంగా ఆ నౌకలో జరిగిన అసలు విషయాలు బయటపడడం ప్రారంభమవుతుంది. షిప్ మరో ప్రపంచానికి వెళ్లి తిరిగి వచ్చిందని తెలుస్తుంది. ఇలా అక్కడికి వెళ్లిన వాళ్ల భయాలు, గత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. దీంతో టీమ్ సభ్యులు మానసికంగా కుంగిపోతుంటారు. కొంతమంది విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఇంకొందరు భయంతో తమపై తామే నియంత్రణ కోల్పోతారు. నౌకలో నుంచి బయటపడేందుకు ప్రయత్నించినా పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతాయి. చివరికి ఆ స్పేస్ షిప్ అసలు రహస్యం ఏంటి ? అది ఎందుకు ఇంత భయంకరంగా మారిందనే విషయం క్లైమాక్స్‌లో బయటపడుతుంది. స్పేస్ హారర్ జానర్‌లో ఇప్పటికీ స్పెషల్‌గా చెప్పుకునే సినిమాల్లో ఇది కచ్చితంగా ఉంటుంది.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×