E-Paper
Advertisement

Emotional Drama OTT: అట్లాంటిక్ అలల సాక్షిగా విడిపోయే ప్రేమ జంట… 35 ఏళ్లకు కలిసినా చెరిగిపోని జ్ఞాపకాలు… ఇదొక అంతులేని ఆవేదన

Emotional Drama OTT: అట్లాంటిక్ అలల సాక్షిగా విడిపోయే ప్రేమ జంట… 35 ఏళ్లకు కలిసినా చెరిగిపోని జ్ఞాపకాలు… ఇదొక అంతులేని ఆవేదన
Advertisement

Emotional Drama OTT : కొన్ని సినిమాలు ఎమోషన్స్ తో గుండెను తడిమేస్తుంటాయి. ఎంతలా నార్మల్ గా ఉందామనుకున్నా ఉండలేం. ఓ చుక్క కన్నీటి బొట్టు అయినా, మనకు తెలీకుండానే బుగ్గల మీద జారి పడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. ఇందులో ఒక జంట సముద్ర ప్రయాణం తన కుమారుడిని కోల్పోతుంది. ఈ సంఘటన వాళ్ళను విడదీస్తుంది. సరిగ్గా 35 ఏళ్ల తరువాత వీళ్ళు మళ్ళీ కలుస్తారు . ఈ స్టోరీ 116 నిమిషాల నిడివి ఉంటుంది. అయితే ఎమోషన్స్ మాత్రం జీవితాంతం గుర్తు ఉంటాయి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ డచ్ ఎమోషనల్ డ్రామా మూవీ పేరు ‘సీ ఆఫ్ టైమ్’ (Sea of Time). ఇది అక్టోబర్ 2022లో థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు థాయూ బోర్మాన్స్ దర్శకత్వం వహించగా, దీని స్క్రిప్ట్‌ను మరీకే వాన్ డెర్ పోల్ రాశారు. ఈ చిత్రంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, ప్రధాన పాత్ర అయిన లూకాస్ యువకుడిగా ఉన్నప్పటి పాత్రను రీనౌట్ షోల్టెన్ వాన్ అస్చాట్ పోషించగా, అదే పాత్ర వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అతని రియల్ లైఫ్ తండ్రి గైస్ షోల్టెన్ వాన్ అస్చాట్ నటించారు. వీరిద్దరి నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు పొందింది. ముఖ్యంగా మిలానో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఏకంగా 10 అవార్డులను గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఇందులో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటీనటుల విభాగాల్లో అవార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ఇది Amazon Prime Video ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

లూకాస్, జోహన్నా అనే జంట ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటారు. వీళ్ళకు ముద్దు మాటలు చెప్పే కొడుకు కూడా ఉంటాడు. అడ్వెంచర్లు అంటే ఈ జంటకి చాలా ఇష్టం. అందుకే తమ చిన్నారి కొడుకుతో కలిసి సముద్ర ప్రయాణానికి బయలుదేరుతారు. కానీ అనుకోని ఒక ప్రమాదంలో వాళ్ళ కొడుకు సముద్రంలో పడిపోతాడు. ఆ బాధను వాళ్ళు తట్టుకోలేకపోతారు. ఆ పసివాడిని కాపాడుకోలేకపోయిన ఆవేదన వారిద్దరి మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది. ఒకరిని చూస్తే ఒకరికి ఆ చేదు జ్ఞాపకమే గుర్తొస్తుండటంతో, మనస్పర్థల వల్ల విడిపోయి వేర్వేరు దారుల్లో వెళ్ళిపోతారు.

దాదాపు 35 ఏళ్ల తర్వాత, ఈ జంట మళ్లీ కలుసుకుంటారు. ఇన్నేళ్లూ ఒకరికొకరు దూరంగా ఉన్నా, ఆ పాత జ్ఞాపకాలు మాత్రం వాళ్ళను వదిలిపెట్టవు. అప్పుడు జోహన్నా తన మనసులో దాచుకున్న ఒక ముఖ్యమైన నిజాన్ని లూకాస్‌కు చెబుతుంది. ఆ మాట విన్నాక లూకాస్ లో కన్నీళ్ళు వస్తాయి. తనని గట్టిగా హత్తుకుంటాడు. ఆ నిజం ఏమిటి ? వీళ్ళు మళ్ళీ పాత జీవితం మొదలు పెడతారా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ఆ మూడు శవాల్లో అసలైన దెయ్యం ఏది? ఓటీటీలో వచ్చేస్తున్న దెయ్యం సినిమా… కనురెప్ప వేయనివ్వని హారర్ కథ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×