E-Paper
Advertisement

బాబోయ్ తేలు మనిషి… విజువల్ వండర్… మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ ఆంథాలజీ

బాబోయ్ తేలు మనిషి… విజువల్ వండర్… మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ ఆంథాలజీ
Advertisement

Science Fiction Thriller : ప్రపంచంలో చాలా సైన్స్ ఫిక్షన్ కథలు ఉంటాయి. కానీ కొన్ని కథలు చూస్తున్నప్పుడు ఒక విచిత్రమైన ఫీలింగ్ వస్తుంది. దర్శకుడు సినిమా తీశాడా? లేక తనకు వచ్చిన వింత కలలను కెమెరాలో బంధించాడా? ఎల్స్‌వేర్(ElseWhere) అచ్చం అలాంటి అనుభవం కలిగించే కథే. ఇందులో ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త ప్రపంచం. కొత్త ఆలోచన.

యూట్యూబ్ ఛానల్ లో

స్వతంత్రంగా రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ ఆంథాలజీ సిరీస్ ప్రస్తుతం పిపియా క్రియేటివ్ స్టూడియో యూట్యూబ్ ఛానల్ లో ఉచితంగా అందుబాటులో ఉంది. విజువల్స్ పరంగా చాలా ఎపిసోడ్లు ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ అభిమానులు వెతికే ఫ్రెష్ కాన్సెప్ట్స్ ఇందులో కనిపిస్తాయి.

Advertisement

ఎల్స్‌వేర్‌లో దర్శకుడు కథ చెప్పడానికి తొందరపడడు. ముందుగా ఒక ప్రశ్న విసురుతాడు. ఉదాహరణకు మనిషి శరీరం సగం తేలు, సగం మనిషిగా మారితే? జ్ఞాపకాలను డౌన్‌లోడ్ చేసి అమ్ముకునే ప్రపంచం వస్తే? భవిష్యత్తు నుంచి వచ్చిన సందేశం మీ జీవితాన్ని మార్చేస్తే? ఇలా ప్రతి ఎపిసోడ్ ఒక అసాధారణమైన ఆలోచనతో ప్రారంభమవుతుంది. కొన్ని కథలు ఫిలాసఫీకల్‌గా ఉంటాయి. కొన్ని పూర్తిగా మైండ్ బెండింగ్ అనుభవాన్ని ఇస్తాయి. మరికొన్ని ఎపిసోడ్లు చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా, ముగిసిన తర్వాత వాటి అర్థం నెమ్మదిగా మెదడులో తెరుచుకుంటుంది.

ఇక ప్రతి ఎపిసోడ్ వెనుక ఉన్న కాన్సెప్ట్ ప్రేక్షకుడిని కొత్త కోణంలో ఆలోచించేలా చేస్తుంది. అందుకే ఇది పాప్ కార్న్ ఎంటర్టైన్మెంట్ కంటే సైన్స్ ఫిక్షన్ ప్రయోగశాలలా అనిపిస్తుంది. ఇటు కొన్ని ఎపిసోడ్లు భారీ బడ్జెట్ హాలీవుడ్ సిరీస్ లా కనిపిస్తే, మరికొన్ని పూర్తిగా ఇండీ ఫిల్మ్ స్టైల్ లో ఉంటాయి. కానీ ఆ వైవిధ్యమే ఈ సిరీస్ కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఎల్స్‌వేర్ ను చూస్తున్నప్పుడు ఒక నియమం మాత్రం గుర్తుంచుకోవాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం దొరకదు. కొన్ని కథలు ముగిసిపోయాక కూడా మీ మెదడులో కొనసాగుతాయి. కొన్ని ఎపిసోడ్ల అర్థం కోసం మీరు మళ్లీ చూడాల్సి రావచ్చు. అందుకే ఇది సాధారణ సైన్స్ ఫిక్షన్‌లా కాకుండా ఇది ఊహాశక్తికి వేసిన ఓ సవాలుగా చెప్పవచ్చు. ఒక ఎపిసోడ్ లో తేలు మనిషి కనిపిస్తాడు. ఇంకో ఎపిసోడ్ లో కాలమే శత్రువవుతుంది. మరొకదాంట్లో మనిషి అనే భావనకే కొత్త అర్థం వస్తుంది.

Advertisement

Read Also : అమ్మాయిల ఇన్నర్ పార్ట్స్ తో కళాఖండాలు… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ ఉన్న సైకో థ్రిల్లర్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×