// //  OTT Movie : ఈ రాణిగారి వేషాలు మామూలుగా లేవుగా ... -->
E-Paper
Advertisement

 OTT Movie : ఈ రాణిగారి వేషాలు మామూలుగా లేవుగా … అందం కోసం అమ్మాయిల రక్తాన్ని తాగి …

 OTT Movie : ఈ రాణిగారి వేషాలు మామూలుగా లేవుగా … అందం కోసం అమ్మాయిల రక్తాన్ని తాగి …
Advertisement

OTT Movie :  ఓటీటీలో ఎన్నో రకాల కథలతో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో హారర్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో అందంగా ఉండడం కోసం ఒక రాణి అమ్మాయిల రక్తాన్ని తాగుతూ ఉంటుంది. ఆ రాణి వలలో రాజీవంశానికి చెందిన మరొక అమ్మాయి చిక్కుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

Advertisement

ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఎలిజబెత్ బాతోరి మిర్రర్ మిర్రర్’ (Elizabeth bathory : mirror mirror). 2018 లో వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి అలైస్ ట్రాటన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) ఫ్లెక్స్ (plex) లలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

ఎలిజబెత్ ఒక కోటలో రాణిగా ఉంటుంది. ఆమె ఉండే కోటలో ఎవరైనా పని చేయాలనుకుంటే వాళ్ళను అదృష్టవంతులుగా భావిస్తారు. ఆమె దగ్గర పని చేయడానికి హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ కూడా ఒక రాజ కుటుంబానికి చెందినదే అయినా, ఆమె ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేకపోవడంతో పనిచేయడానికి వస్తుంది. ఎలిజిబెత్ తనని బాగా రిసీవ్ చేసుకుంటుంది. ఆమె తనకు ఇస్తున్న మర్యాదకి హీరోయిన్ ఫిదా అవుతుంది. అక్కడే పని చేసే మాయ అనే అమ్మాయి ఎలిజబెత్ కి మేకప్ వేస్తూ ఉంటుంది. ఒక రోజు మేకప్ కాస్ట్యూమ్ అయిపోవడంతో మాయ పై కోప్పడుతుంది. ఆ తర్వాత మాయ తన చేతిని కోసుకొని, రక్తాన్ని ఆమె మొహానికి అప్లై చేస్తుంది. అప్పుడు రాణి శాంతిస్తుంది. వాస్తవానికి రాణి, రాజు ఒకప్పుడు చాలా బాగుండేవాళ్ళు. రాజుకి అనారోగ్యం కారణంగా చనిపోతాడు. ఆ తర్వాత రాణి కి కూడా ఒక వింత జబ్బు ఆవహిస్తుంది. దాని కారణంగా ఆమె ఉన్నఫలంగా వృద్ధురాలు అయిపోతుంది. అయితే అమ్మాయిల రక్తాన్ని పూస్తే మరింత అందంగా తయారవుతుంది. దీనికి విరుగుడు అమ్మాయిల  రక్తమే అని తెలుసుకుని, చాలామంది రక్తాన్ని సేకరిస్తూ ఉంటుంది.

అమ్మాయిలను ఎంత హింసించి రక్తం సేకరిస్తే, ఆ రక్తం వల్ల ఎలిజబెత్ అంత అందంగా తయారవుతుంది. ఇప్పుడు హీరోయిన్ ని కూడా టార్చర్ చేసి రక్తాన్ని సేకరించాలనుకుంటుంది. అయితే హీరోయిన్ మనస్తత్వం అమాయకంగా ఉండటంతో, తనని ఎలాగైనా కాపాడాలనుకుంటుంది మాయ. తనకి ఇక్కడ జరుగురున్న విషయాలు చెప్పి పారిపొమ్మని సలహా ఇస్తుంది. అయితే హీరోయిన్ పారిపోతూ ఎలిజబెత్ కి చిక్కుతుంది. చివరికి మాయ హీరోయిన్ ని కాపాడుతుందా? ఇంకెంతమంది రాణికి బలవుతారు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), ఫ్లెక్స్ (plex) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఎలిజబెత్ బాతోరి మిర్రర్ మిర్రర్’ (Elizabeth bathory : mirror mirror) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×