E-Paper
Advertisement

Dystopian Sci-Fi Film OTT : భూమికి దూరంగా రిచ్ పీపుల్… చావుబతుకుల మధ్య అల్లాడే పేద జనం… ఫ్యూచర్ ను కళ్ళకు కట్టే సై-ఫై మూవీ

Dystopian Sci-Fi Film OTT : భూమికి దూరంగా రిచ్ పీపుల్… చావుబతుకుల మధ్య అల్లాడే పేద జనం… ఫ్యూచర్ ను కళ్ళకు కట్టే సై-ఫై మూవీ
Advertisement

Dystopian Sci-Fi Film OTT : ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది ఊహకందని విషయం. అయినప్పటికీ ప్రతీ ఒక్కరూ ఆ భవిష్యత్తు కోసమే ఆశగా పరుగులు తీస్తూ ఉంటారు. కానీ ఆ భవిష్యత్తు డబ్బు లేదనే కారణంతో అంధకారం అయితే, అలాంటి పరిస్థితిలో ప్రాణాల కోసం పోరాటం చేయాల్సి వస్తే… దానికి సమాధానమే ఈరోజు మనం మూవీ సజెషన్ లో చెప్పుకునే మూవీ. మరి ఈ మూవీని ఎక్కడ చూడవచ్చు ? దాని కథ ఏంటి ? అన్న విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో

2013లో విడుదలైన డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ “ఎలీసియం” (Elysium). District 9 తర్వాత డైరెక్టర్ నీల్ బ్లామ్‌క్యాంప్ (Neill Blomkamp) తెరకెక్కించిన చిత్రం ఇది. మ్యాట్ డేమన్, జోడీ ఫాస్టర్, షార్ల్టో కాప్లీ, ఆలిస్ బ్రాగా, డియెగో లూనా, వాగ్నర్ మౌరా, విలియం ఫిచ్ట్నర్ తదితరులు ఇందులో నటించారు. 109 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ సై-ఫై, యాక్షన్ డ్రామాకు IMDbలో రేటింగ్ 6.6 ఉంది. కానీ ఈ మూవీ బిగ్గెస్ట్ హాలీవుడ్ హిట్స్ లో ఒకటి. 115 మిలియన్ బడ్జెట్ పెడితే, 286 మిలియన్ పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : ఓటీటీలోకి వచ్చేసిన సెన్సేషనల్ కోర్టు రూమ్ డ్రామా ‘హక్’… అస్సలు మిస్ అవ్వొద్దు భయ్యా

కథలోకి వెళ్తే…

2154 సంవత్సరంలో స్టోరీ నడుస్తుంది. భూమి ఓవర్‌పాపులేషన్, పొల్యూషన్, డిసీజెస్ వల్ల పూర్తిగా నాశనం అవుతుంది. పేదవాళ్లు మాత్రమే భూమిపై కొన్ని ప్రాంతాల్లో గత్యంతరం లేక బతుకుతున్నారు. కానీ ధనవంతులు మాత్రం ఈ పరిస్థితుల నుంచి సేఫ్ గా ఉంటారు. భూమిని వదిలేసి “ఎలీసియం” అనే భారీ స్పేస్ స్టేషన్‌ లో లగ్జరీ జీవితం గడుపుతారు. అక్కడ అడ్వాన్స్‌డ్ మెడికల్ టెక్నాలజీ (మెడ్-బేస్)తో ఏ డిసీజ్ అయినా సెకన్లలో క్యూర్ చేసే టెక్నాలజీ ఉంటుంది. ఎలీసియం సిటిజన్స్ అంటే డబ్బున్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళాలి. అందుకే ఈ రూల్ ను కఠినంగా ఫాలో అవ్వడానికి భూమి నుంచి ఇమ్మిగ్రేషన్‌ ను కంట్రోల్ లోకి తీసుకుంటారు.

Advertisement

ఈ నేపథ్యంలోనే అనాథ మ్యాక్స్ డా కోస్టా తన చిన్నప్పటి నుంచి ఎలీసియంకు వెళ్లాలని కలలు కంటాడు. అతనికి ఫ్రేయ్ (ఆలిస్ బ్రాగా) అనే చిన్ననాటి ఫ్రెండ్ ఇప్పుడు నర్సుగా పని చేస్తుంది. ఆమె కూతురు క్యాన్సర్ తో బాధపడుతుంది. ఈ క్రమంలో మ్యాక్స్ ఫ్యాక్టరీలో జరిగిన ఓ యాక్సిడెంట్‌ కారణంగా రేడియేషన్ ఎక్స్‌పోజ్ అవుతాడు. 5 రోజుల్లో ట్రీట్మెంట్ అందకపోతే చస్తాడు. కానీ భూమిపై అసలు ఆ ట్రీట్‌మెంట్ ఉండదు. తన ప్రాణాలు కాపాడుకోవాలంటే ఎలీసియం చేరుకోక తప్పదు. అందుకే స్మగ్లర్ స్పైడర్ (వాగ్నర్ మౌరా) సాయం తీసుకుంటాడు. మరి హీరో ఎలీసియంకు వెళ్లాడా ? ఎలా వెళ్ళాడు ? డబ్బులు లేని హీరో ట్రీట్మెంట్ ఎలా తీసుకున్నాడు ? క్లైమాక్స్ లో ఏం జరిగింది ? అన్నది మూవీలో చూడాల్సిందే.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×