E-Paper
Advertisement

Kantha OTT : ‘కాంత ‘ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

Kantha OTT : ‘కాంత ‘ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?
Advertisement

Kantha OTT : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమా తర్వాత నటించిన తాజా చిత్రం కాంత. భారీ అంచనాలతో ఇవాళ థియేటర్లలోకి ఈ సినిమా వచ్చేసింది. 1950 నాటి స్టోరీ తో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. దుల్కర్‌కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది.. దగ్గుపాటి రానా, దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.. నేడే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యింది.. స్టోరీ డిఫరెంట్ గా ఉండటంతో మూవీ యావరేజ్ టాక్ ను అందుకుందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ఈ మూవీ ఓటీటీ డీల్ గురించి ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. మరి ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ హక్కుల గురించి వివరాలు తెలుసుకుందాం..

‘కాంత’ ఓటీటీ పార్ట్నర్ లాక్..!

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమాలన్నీ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. గతంలో వచ్చిన లక్కీ భాస్కర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.. ఆ మూవీ తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. డిఫరెంట్ స్టోరీ తో సెల్వరాజ్ డైరెక్టర్ తో కాంత సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు దుల్కర్.. ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం థియేటర్లలో మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. థియేటర్‌లో రిలీజైన 4 వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కావాలనే ఒప్పందం మేరకు డీల్ సెట్ అయ్యింది.. డిసెంబర్ 2 వ వారంలో మూవీ స్ట్రీమింగ్ కు రాబోతుందని సమాచారం. త్వరలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకొనే అవకాశం కూడా ఉంది.

Advertisement

Also Read: పల్లవికి అడ్డంగా దొరికిన చక్రధర్.. రాజేశ్వరికి అనుమానం.. పల్లవి నెక్స్ట్ ప్లానేంటి..?

బడ్జెట్ & టార్గెట్ ఎంతంటే..? 

రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సినిమాలో నటించడం మాత్రమే కాదు. ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించారు. కాంత సినిమాకు దాదాపు 35 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. చెన్నై, తమిళనాడు, కేరళలోని పలు అందమైన లోకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. 1950 కాలం నాటి కథతో వచ్చిన ఈ మూవీని ఆ కాలంలో సినిమాలాగే తెరకెక్కించారు. ఇకపోతే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ భారీగానే పలికినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.. విడుదలకు ముందే ట్రైలర్ రిలీజ్ అయ్యాక వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.. సినిమా బిజినెస్ వివరాలు బయటకు రాలేదు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను 105 కోట్ల గ్రాస్ వసూళ్లుగా వాల్యూ కట్టారని తెలిసింది. ఇంత వసూల్ చేస్తేనే సినిమా లాభల్లోకి వెళుతుంది. లేదంటే నష్టాలు తప్పవని తెలుస్తుంది. చూద్దాం అంత రాబడుతుందో లేదో..

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×