E-Paper
Advertisement

Kaantha OTT release : ‘కాంత’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్… ఏ ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చంటే ?

Kaantha OTT release : ‘కాంత’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్… ఏ ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చంటే ?
Advertisement

Kaantha OTT release : దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘కాంత’. 1950 కాలం నాటి మద్రాస్‌లో ప్రముఖ నటుడు, అతని దర్శకుడు మధ్య జరిగే ఇగో క్లాష్‌ తో ఈ సినిమా రన్ అవుతుంది. మరి కొద్ది గంటల్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కి ముందే స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది. అయితే థియేట్రికల్ రన్ తర్వాతనే ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానుంది. స్ట్రీమింగ్ డేట్ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఇంతలోనే ఈ సినిమా వివాదాలలో కూడా నిలుస్తోంది. ఓ ప్రముఖ వ్యక్తి ఈ సినిమాపై కోర్టుకు వెళ్లారు. ఈ వివాదం ఏమిటి ? ఇది ఏ ఓటీటీలో రాబోతోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పేరు ‘కాంత’ (Kaantha). ఇది 2025 నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇది డిసెంబర్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది. దీనిని స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్‌లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి నిర్మించారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. లోకా చాప్టర్ 1: చంద్ర’ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దుల్కర్, ఇప్పుడు వచ్చే ఈ ‘కాంత’ సినిమాతో మరెన్ని రికార్డులు బద్ధలు కోడతాడో వేచి చూడాలి.

Advertisement

Read Also : 16 గంటలు పడుకునే వింత జబ్బు… బుర్రపాడు ట్విస్టులున్న కన్నడ థ్రిల్లర్

వివాదం ఏమిటంటే

ఈ కథ తమిళ సినీ దిగ్గజం ఎం.కె. త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా తెరకెక్కిందనే ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర బృందం ఇది కల్పిత కథ అని స్పష్టం చేసింది. అయినా కూడా ఈ సినిమాలో మా తాత గారిని తప్పుగా చూపించారని, ఎం.కె. త్యాగరాజన్ మనవడు కోర్టు మెట్లు ఎక్కాడు. తన తాత అప్పుల్లో చనిపోయినట్లు వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. కోర్టు కూడా వివరణ ఇవ్వాల్సిందిగా ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది. ఇక ఈ కథలో ఒక నటుడికి, తనను పరిచయం చేసిన దర్శకుడితో వివాదం మొదలవుతుంది. హీరో తన సొంత టాలెంట్ తోనే పైకి వచ్చానని చెప్పడంతో దర్శకుడి ఇగో హార్ట్ అవుతుంది. దర్శకుడు మాత్రం నేను డైరెక్ట్ చేయడం వల్లే నీకు ఇంత పేరు వచ్చిందని వాదనలు జరుగుతాయి. మధ్యలోవచ్చే మరిన్ని పాత్రలు కథని హైప్ కి తీసుకెళ్తాయి.

Advertisement

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×