E-Paper
Advertisement

OTT Movie : పిల్లల్ని చంపి అమరుడయ్యే విలన్… పాప ఎంట్రీతో ఒక్కొక్కడికీ దబిడి దిబిడే… ఈ సైకలాజికల్ హారర్ మూవీ అదుర్స్

OTT Movie : పిల్లల్ని చంపి అమరుడయ్యే విలన్… పాప ఎంట్రీతో ఒక్కొక్కడికీ దబిడి దిబిడే… ఈ సైకలాజికల్ హారర్ మూవీ అదుర్స్
Advertisement

OTT Movie : సైకలాజికల్ థీమ్ తో వచ్చే సినిమాలు, డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. అంతే కాకుండా చిల్లింగ్ థ్రిల్ ని కూడా ఇస్తుంటాయి. సైకలాజికల్ హారర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఇది సాటర్న్ అవార్డ్స్‌లో బెస్ట్ హారర్ ఫిల్మ్ నామినేషన్ పొందింది. ఇవాన్ మక్‌గ్రెగర్ (డానీ) నటనకు ప్రశంసలు కూడా వచ్చాయి. ఇందులో డానీకి సూపర్ పవర్స్ ఉంటాయి. అతను తన లాంటి మరి కొంతమందిని రక్షించే ప్రయత్నంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

కథలోకి వెళ్తే 

చిన్నతనం నుంచే డానీకి అతీంద్రియ శక్తులు ఉంటాయి. దీంతో అతను భవిష్యత్తును చూడగలడు, ఆత్మలతో కూడా మాట్లాడగలడు. ఈ శక్తి వల్ల ఒక హోటల్‌లో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. వాటి నుండి డానీ బయటపడడానికి ప్రయత్నిస్తుంటాడు. ప్రస్తుతం డానీ తన శక్తులను అణచివేయడానికి మద్యానికి బానిస అవుతాడు. అతను తన జీవితాన్ని మామూలు స్థితికి తీసుకురావడానికి న్యూ హాంప్‌షైర్‌లోని ఒక చిన్న పట్టణంలో స్థిరపడతాడు. అక్కడ అతను ఒక హాస్పిస్‌లో ఉద్యోగం కూడా కుదుర్చుకుంటాడు.

Advertisement

డానీ తన శక్తులను ఉపయోగించి, మరణిస్తున్న రోగులకు ఓదార్పునిచ్చి, వారిని ప్రశాంతంగా మరణించడానికి సహాయం చేస్తాడు. ఈ కారణంగా అతనికి “డాక్టర్ స్లీప్” అనే మారు పేరు వస్తుంది. ఈ సమయంలో సినిమా మరో కథాంశాన్ని పరిచయం చేస్తుంది. రోజ్ ది హ్యాట్,  షైనింగ్ శక్తులు కలిగిన పిల్లలను వెతుకుతూ వారి “స్టీమ్”సేకరించి, దానిని తినడం ద్వారా దాదాపు అమరత్వాన్ని పొందుతుంది. ఈ స్టీమ్‌ను సేకరించడానికి, కొంతమంది పిల్లలను కిడ్నాప్ చేసి క్రూరంగా చంపుతుంటారు. ఎందుకంటే భయం, నొప్పితో స్టీమ్ మరింత శక్తివంతమవుతుంది.

ఈ సినిమాలో మరో కీలక పాత్ర అబ్రా స్టోన్ అనే టీనేజ్ అమ్మాయి. ఆమెకు అసాధారణమైన షైనింగ్ శక్తులు ఉన్నాయి. అవి డానీ కంటే కూడా శక్తివంతమైనవి. ఆమె రోజ్ ది హ్యాట్ క్రూరమైన చర్యలను ఆమె షైనింగ్ ద్వారా చూస్తుంది. రోజ్ ది హ్యాట్, అబ్రాను తదుపరి లక్ష్యంగా చేసుకుంటుంది. ఎందుకంటే ఆమె స్టీమ్ అసాధారణంగా శక్తివంతమైనది.

Advertisement

డానీ మొదట్లో తన గత గాయాల కారణంగా అబ్రాతో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడడు. కానీ ఆమె జీవితం ప్రమాదంలో ఉందని తెలిసిన తర్వాత, ఆమెను రక్షించడానికి ముందుకు వస్తాడు. అతను తన షైనింగ్ శక్తులను మళ్లీ వెనక్కి తెచ్చుకుంటాడు. అబ్రాతో కలిసి రోజ్ ది హ్యాట్ తో పోరాడటానికి సిద్ధపడతాడు. ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారు ? అనేది తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘డాక్టర్ స్లీప్’ (Doctor sleep) 2019లో విడుదలైన అమెరికన్ సైకలాజికల్ హారర్ చిత్రం. మైక్ ఫ్లానాగన్ దర్శకత్వం ఆధారంగా రూపొందింది. ఇందులో ఇవాన్ మక్‌గ్రెగర్ (డాన్ టొరెన్స్), రెబెక్కా ఫెర్గూసన్ (రోస్ ది హ్యాట్), కైలీగ్ కర్రాన్ (అబ్రా స్టోన్), క్లిఫ్ కర్టిస్ (బిల్లీ ఫ్రీమాన్), జోవన్ అడెపో (డాక్టర్ జాన్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 32 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDb లో 7.3/10 రేటింగ్ పొందింది. ఇది 2019 నవంబర్ 8న USలో విడుదలై, $72.3 మిలియన్ గ్రాస్ చేసింది. ప్రస్తుతం HBO మాక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : రిటైర్ అయిన ముసలోడితో అలాంటి పని… ఈ అమ్మాయి అరాచకాన్ని సింగిల్ గా చూడాల్సిందే మావా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×