// // Avatar 3 OTT Rights: డిస్నీ ప్లస్ చేతికి అవతార్ 3 స్ట్రీమింగ్ రైట్స్! -->
E-Paper
Advertisement

Avatar 3 OTT Rights: కళ్ళు చెదిరి ధరలకు అవతార్ 3 ఓటీటీ రైట్స్.. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే లాభాలు!

Avatar 3 OTT Rights: కళ్ళు చెదిరి ధరలకు అవతార్ 3 ఓటీటీ రైట్స్.. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే లాభాలు!
Advertisement

Avatar 3 OTT Rights: ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్(James Cameron)  దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవతార్ ఫ్రాంచైజీస్ ఎలాంటి ఆదరణ సొంతం చేసుకున్నాయో మనకు తెలిసినదే. ఇప్పటికే రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోగా తాజాగా అవతార్: ఫైర్ అండ్ యాష్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం పలు భాషలలో ఈ సినిమా ప్రదర్శితం అవుతూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇలా ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ, ప్రీ రిలీజ్ బిజినెస్ లకు సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి.

డిస్నీ ప్లస్ చేతికి డిజిటల్ హక్కులు..

ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్(Disney+) భారీ ధరలకు కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ ఏకంగా 2,750 నుంచి 2,900 కోట్ల రూపాయలకు కైవసం చేసుకున్నట్టు సమాచారం. అలాగే సాటిలైట్ హక్కులను కూడా డిస్నీ నెట్వర్క్ ఏకంగా 1350నుంచి 1,500 వందల కోట్ల రూపాయలకు దక్కించుకున్నారు. ఇక గ్లోబల్ రేంజ్ లో మ్యూజికల్ రైట్స్ కూడా 300 నుంచి 350 కోట్ల వరకు అమ్ముడుపోయినట్టు సమాచారం.. ఇలా ఈ సినిమా నాన్ థ్రియేటికల్ ద్వారా ఏకంగా 4400 నుంచి 4700 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకున్నట్టు తెలుస్తుంది.

నాన్ థియెట్రికల్ బిజినెస్ తోనే లాభాలు..

Advertisement

అవతార్ 3 సినిమా నాన్ థియెట్రికల్ బిజినెస్ ద్వారా ఈ సినిమా బడ్జెట్ మొత్తం వెనక్కి వచ్చేసిందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కనుక చూస్తే ఈ సినిమా లాభాల బాటలో పయనిస్తుందని చెప్పాలి. ఇలా నాన్ థియెట్రికల్ బిజినెస్ ద్వారా నిర్మాతలకు 1200 నుంచి 14 00కోట్ల రూపాయల లాభాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం సుమారు 400 మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 3300 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం. ఈ లెక్కన చూస్తే ఇప్పటికే అవతార్ 3 ద్వారా నిర్మాతలు మంచి లాభాలనే సొంతం చేసుకున్నారు.

విలన్ గా వరాంగ్..

ఇక అవతార్ ఫ్రాంచైజీస్ లో అవతార్ 2 2016వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు పది సంవత్సరాల తర్వాత జేమ్స్ కామెరూన్ అవతార్ 3 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అవతార్ మూడో భాగంలో ఫండోరా ప్రపంచానికి సరికొత్త విలన్ వరాంగ్ ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. సరికొత్త విజువల్ వండర్ తో జేమ్స్ కామెరున్ ఈ సినిమా ద్వారా మరో కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రసారమవుతుంది.

Advertisement

Also Read: Rowdy Janardhan: 20 రోజులకు 20 కోట్లు తమిళ హీరోలకు హైప్ ఇస్తున్న టాలీవుడ్!

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×