E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా
Advertisement

OTT Movie : నిజ జీవిత నేరాల నుండి ప్రేరణ పొందిన కథలతో ఒక వెబ్ సిరీస్ రీసెంట్ గా ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ వెబ్ సిరీస్ తెలివితేటలతో ధైర్యంగా మోసాలు చేసే మహిళల కథలను చూపిస్తుంది. ప్రతి ఎపిసోడ్ సమాజంలోని నేరాలను ఆధారంగా చేసుకుని రూపొందింది. కొన్నిసార్లు డబ్బు కోసం, కొన్నిసార్లు ప్రతీకారం కోసం వాళ్ళు ఈ మోసాలు చేస్తుంటారు. అయితే దీని కోసం అందాన్ని ఎరగా వేస్తుంటారు. ఇందులో అందాలు కనువిందు చేస్తాయి. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లోనే ఉంటుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

హంగామా ఓటీటీలో

వైభవ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అంథాలజీ సిరీస్ పేరు “Dirty Scams’. ఇది 2025 అక్టోబర్ 30న సీజన్ 1, 15 ఎపిసోడ్‌లతో రిలీజ్ అయింది. ఇందులో పవిత్ర పునియా, ఇమ్రాన్ నజీర్ ఖాన్, పూజా బెనర్జీ, అక్షయ్ శెట్టి, సానియా ఖేరా, విశాల్ చౌదరి, జస్జోత్ భాసిన్, అలిషా పన్వార్, సాహిల్ ఉప్పల్, ఇషితా గంగూలీ, రషద్ రానా, దిపాంకనా దాస్, అంకిత్ రాజ్ వంటి నటీనటులు వివిధ ఎపిసోడ్‌లలో నటించారు. ఇది హంగామా ఓటీటీ ఒరిజనల్ సిరీస్.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సిరీస్ అంథాలజీ సిరీస్ ప్రతి ఎపిసోడ్‌లో ఒక మహిళా స్కామర్ కథ ఉంటుంది. మొదటి ఎపిసోడ్‌లో పవిత్ర పూనియా అనే మహిళ ఆమె పేద ఫ్యామిలీ నుంచి వస్తుంది. భర్త కూడా మోసం చేసి వదిలేసాడు. దీంతో ఆమె డబ్బుకోసం ఒక రిచ్ బిజినెస్‌మ్యాన్ ను టార్గెట్ చేస్తుంది. ఆమె ఒక ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ కు ప్లాన్ చేస్తుంది. “క్రిప్టో మైనింగ్” అని చెప్పి డబ్బు సంపాదించుకోవచ్చని మోసం చేస్తుంది. ఆమె తెలివిగా అతన్ని ట్రిక్ చేసి, 50 లక్షలు కాజేస్తుంది. కానీ మధ్యలో పోలీసు ఇన్వెస్టిగేషన్ జరిగినా ఆమె ధైర్యంగా ఎస్కేప్ అవుతుంది.

Read Also : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

రెండో ఎపిసోడ్‌లో పూజా బానర్జీ అనే మహిళ ఫేక్ మ్యారేజ్ స్కామ్ ప్లాన్ చేస్తుంది. ఒక రిచ్ పర్సన్ కి ప్రపోజ్ చేసి, వెడ్డింగ్ ప్లాన్ చేసి, రిచ్ అవ్వాలనుకుంటుంది. మధ్యలో ట్విస్ట్ వస్తుంది. అతను కూడా ఒక స్కామర్ అని తెలుస్తుంది. ఇద్దరూ కలిసి మరో టార్గెట్‌ను మోసం చేస్తారు. కానీ స్నేహా రివెంజ్ తీర్చుకోవడానికి అతన్ని మోసం చేసి 1 కోటి తీసుకుంటుంది. మూడో ఎపిసోడ్‌లో ఆలిషా పాన్వర్ ఆమె బ్యాంక్ ఫ్రాడ్‌లో పడి, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఫేక్ ఐడెంటిటీతో రియల్ ఎస్టేట్ మోసం చేస్తుంది. సిరీస్ చివరిలో అన్ని మహిళల కథలు కనెక్ట్ అవుతాయి. వాళ్లు ఒక సీక్రెట్ నెట్‌వర్క్‌లో ఇలా మోసాలు చేస్తూనే ఉంటారు.
Advertisement

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×