E-Paper
Advertisement

Ikkis On OTT : ఓటీటీలో ధర్మేంద్ర చివరి చిత్రం స్ట్రీమింగ్ షురూ… కానీ చిన్న ట్విస్ట్

Ikkis On OTT : ఓటీటీలో ధర్మేంద్ర చివరి చిత్రం స్ట్రీమింగ్ షురూ… కానీ చిన్న ట్విస్ట్
Advertisement

Ikkis On OTT : ఇటీవల కాలంలో థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్ అన్పించుకున్న ఓ వార్ డ్రామా తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టింది. హిందీ లెజెండరీ దివంగత నటుడు ధర్మేంద్ర నటించిన చివరి చిత్రం ఇదే కావడం విశేషం. మరి ఇంతకీ ఈ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

హిందీ యాక్షన్ డ్రామా చిత్రం ‘ఇక్కిస్’ (Ikkis) తాజాగా ఓటీటీలో అడుగు పెట్టింది. 2026 జనవరి 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో అగస్త్య నంద ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ప్రఖ్యాత దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. అగస్త్య నంద, సంయుక్త మీనన్, ధర్మేంద్ర, రాజ్ అర్జున్, సత్యదేవ్, ప్రకాశ్ రాజ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇది భారత సైనికుడి నిజ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ డెప్త్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి.

Advertisement

బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ రాబట్టిన ఈ మూవీ, తరువాత నెమ్మదించింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ లో చిన్న ట్విస్ట్ ఉంది. ఈ మూవీ అన్నీ సినిమాల మాదిరిగా ఫ్రీగా కాకుండా రెంట్ కి అందుబాటులో ఉంది. మూవీని ఓటీటీలో చూడాలంటే 349 రూపాయలు పే చేయాల్సిందే. రెండు వారాల తర్వాత సబ్‌స్క్రైబర్‌లకు ఫ్రీగా అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు. 135 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకు IMDbలో 7.8 రేటింగ్ ఉంది. ఈ హిందీ మూవీ ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

Read Also : 20 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్స్‌… వారం రోజులు అలాంటి డీల్… క్రేజీ రొమాంటిక్ కామెడీ

కథలోకి వెళ్తే…

Advertisement

ఆర్మీ మాజీ ఉద్యోగి బ్రిగేడియర్‌ ఎం.ఎల్‌. ఖేత్రపాల్‌ (ధర్మేంద్ర). పాకిస్థాన్‌లో ఉన్న తన మిత్రులను కలవాలి అనుకుని లాహోర్‌ కు వెళ్తాడు. అక్కడ ఆయన ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను ఆర్మీ మాజీ ఆఫీసర్‌ నిస్సార్‌ అహ్మద్‌ (జైదీప్‌ అహ్లావత్‌)కు అప్పగిస్తారు. అయితే ఆయన అక్కడికి వెళ్ళాక అనుకున్నట్టుగా ఇలా ఫ్రెండ్ ను కలిసి అలా వచ్చేయడు. ఎం.ఎల్‌. ఖేత్రపాల్ పాకిస్థాన్‌లో తన జ్ఞాపకాలను నెమరువేసుకోవాలని అనుకుని వివిధ ప్రదేశాలను చూడడానికి వేలెత్తాడు. అలాగే తన కొడుకు అరుణ్‌ ఖేత్రపాల్‌ చనిపోయిన ప్రదేశానికీ వెళ్తాడు.

1971లో ఇండో-పాక్‌ యుద్ధంలో 21 ఏళ్ల సెకండ్‌ లెఫ్టినెంట్‌ అరుణ్‌ ఖేత్రపాల్ (అగస్త్య నంద) చేసిన సాహసం ఏమిటి ? యుద్ధ భూమిలో అడుగు పెట్టిన తర్వాత అతడికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి ? తన ట్యాంకు మంటల్లో చిక్కుకున్నా, పాక్‌ నుంచి వస్తున్న యుద్ధ ట్యాంకులకు ఎందుకు ఎదురెళ్లాడు ? నిస్సార్‌ అహ్మద్‌ కు, అరుణ్‌ ఖేత్రపాల్‌ ఏమవుతాడు ? అన్నది తెలుసుకోవాలంటే సినిమాపై ఒక లుక్కేయండి. సినిమా యాక్షన్ సీక్వెన్స్‌లు, భావోద్వేగ సన్నివేశాలు, దేశభక్తి థీమ్‌లతో సాగుతుంది. క్లైమాక్స్ ఎమోషనల్‌గా, యాక్షన్‌తో నిండి ఉంటుంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×