E-Paper
Advertisement

Ikkis on OTT : ఓటీటీలోకి ధర్మేంద్ర చివరి చిత్రం… ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే ?

Ikkis on OTT : ఓటీటీలోకి ధర్మేంద్ర చివరి చిత్రం… ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే ?
Advertisement

Ikkis on OTT : థియేటర్లలో అయినా లేదా ఓటీటీలో చూసినా కొన్ని కథలు మనపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అవి మిమ్మల్ని గర్వంగా భావించేలా చేస్తాయి. కన్నీళ్లు కూడా తెప్పిస్తాయి. హార్ట్ టచింగ్ ఫీల్ ఇస్తాయి. అలాంటి కథే ఒకటి థియేటర్లలో సందడి చేస్తోంది. స్టార్టింగ్ నుంచి నుండి ఎండింగ్ వరకు… ఈ చిత్రంలో మనసును కదిలించే అనేక సన్నివేశాలు ఉన్నాయి. యుద్ధాలు ఎందుకు జరుగుతాయో ఈ సినిమాలో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అలాగే ఇప్పటికే మూవీని థియేటర్లలో చూసిన వారు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి సినిమా పేరేంటి ? స్ట్రీమింగ్ ఎప్పుడు ? అనేది తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

శ్రీరామ్ రాఘవన్ వార్ డ్రామా “ఇక్కిస్” (Ikkis) థియేటర్లలోకి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. మొదట డిసెంబర్‌లో విడుదల కావాల్సి ఉండగా, ఈ చిత్రాన్ని 2026 జనవరి 1కి వాయిదా వేశారు. థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి అప్పుడే చర్చ మొదలైంది. అయితే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి ఓ షాకింగ్ ట్విస్ట్ ఉండబోతోందని సమాచారం.

Advertisement

బాలీవుడ్ అయినా, సౌత్ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన తర్వాత, టీవీలో ప్రదర్శించబడే ముందు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతాయి. కొన్ని సినిమాలు ఒక నెలలోపు ఓటీటీలో ప్రసారం అవుతాయి. మరికొన్ని అలా విడుదల అవ్వడానికి నెలల టైమ్ పడుతుంది. అలాంటి చిత్రాలలో “ఇక్కిస్” ఒకటి. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాలా కాలంగా వార్తల్లో ఉంది. ఎందుకంటే బాలీవుడ్ ప్రముఖ దివంగత నటుడు ధర్మేంద్ర చివరి చిత్రం ఇదే. అలాగే అమితాబ్ బచ్చన్ మనవడు, అగస్త్య నంద, అక్షయ్ కుమార్ మేనకోడలు సిమర్ భాటియా అరంగేట్రం కూడా ఈ మూవీతోనే.

ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ విషయానికొస్తే చాలా టైమ్ పట్టేలా ఉంది. జనవరి లేదా ఫిబ్రవరిలో కాకుండా ఈ సినిమా మార్చిలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల కావచ్చు. సమాచారం ప్రకారం ‘ఇక్కిస్’ సినిమా మొదట అద్దెకు, తరువాత ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో విడుదల అవుతుంది. ఈ ఏడాది మార్చి 12న అద్దెకు అందుబాటులో ఉంటుంది. ఇక ప్రస్తుతం రణవీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. “ఇక్కిస్” మూవీ బాక్స్ ఆఫీసు దగ్గర తగ్గేదె లే అంటూ దూసుకెళ్తోంది. అగస్త్య నంద చిత్రం మొదటి రోజే 7 కోట్లకు పైగా వసూలు చేసింది.

Advertisement

Read Also :  సైలెంట్ గా ఓటీటీలోకి ఆది పినిశెట్టి రివేంజ్ డ్రామా… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

స్టోరీలోకి వెళ్తే…

1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో తన ప్రాణాలను త్యాగం చేసిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ ధైర్యం, స్ఫూర్తి గురించిన కథ ఇది. “ఇక్కిస్” కథ రెండు వేర్వేరు కాలాల్లో సాగుతుంది. ఈ చిత్రం డిసెంబర్ 1971లో బసంతార్ యుద్ధభూమికి మనల్ని తీసుకెళుతుంది. అక్కడ 21 ఏళ్ల అరుణ్ ఖేత్రపాల్ తన యూనిట్‌ తో పాటు శత్రువును ఎదుర్కొంటాడు. ఒక యువ అధికారిలోని ఆందోళన, ఆలోచనలు, బాధ్యత భారం వంటి అంశాలను చూపిస్తుంది.

ఈ సినిమా రెండవ భాగం 2001లో జరుగుతుంది. ఇక్కడ కథ ఎమోషనల్ గా ఉంటుంది. యుద్ధానికి దూరంగా ఉన్నప్పటికీ తన కొడుకు జ్ఞాపకాలతో వెంటాడే బ్రిగేడియర్ ఎం.ఎల్. ఖేత్రపాల్ పాత్రను ధర్మేంద్ర పోషిస్తాడు. జైదీప్ అహ్లావత్ పోషించిన బ్రిగేడియర్ ఖ్వాజా మొహమ్మద్ నాసిర్‌ తో అతని సన్నివేశాలు ఎఫెక్టివ్ గా ఉంటాయి. ఈ చిత్రం యుద్ధభూమిలో చేసే పోరాటం కంటే యుద్ధం తర్వాత మిగిలిన నిశ్శబ్దం, బాధను హైలెట్ చేస్తుంది. ఇలా చెప్పుకోవడం కన్నా చూస్తేనే బాగుంటుంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×