E-Paper
Advertisement

Tere Ishk Mein OTT : ధనుష్-కృతి సనన్ రొమాంటిక్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

Tere Ishk Mein OTT : ధనుష్-కృతి సనన్ రొమాంటిక్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?
Advertisement

Tere Ishk Mein OTT : ఇటీవల కాలంలో వచ్చిన రొమాంటిక్ సినిమాలన్నీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా హిందీలో ఈ జానర్లో వచ్చిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. అందులో ధనుష్ హీరోగా నటించిన “తేరే ఇష్క్ మే” (Tere Ishk Mein) మూవీ కూడా ఉంది. దీంతో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి ధనుష్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ గుడ్ న్యూస్ వచ్చేసింది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

గత సంవత్సరం విడుదలైన అనేక రొమాంటిక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. వీటిలో ‘సైయారా’, ‘ఏక్ దీవానే కి దీవానియాత్’, ‘తేరే ఇష్క్ మే’ ఉన్నాయి. ధనుష్, కృతి సనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘తేరే ఇష్క్ మే’ అయితే ఆడియన్స్ ను కన్నీళ్ళు పెట్టించింది. మనసుకు హత్తుకునే ఈ లవ్ స్టోరీని ఇకపై ప్రేక్షకులు ఇంట్లోనే ఉండి చూడవచ్చు. 2026 జనవరి 23 నుండి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

ఈ చిత్రంలో ధనుష్ ఫ్లైట్ లెఫ్టినెంట్ శంకర్ గురుక్కల్ గా, కృతి సనన్ ముక్తి బేనివాల్ పాత్రలో, ప్రకాష్ రాజ్ రాఘవ్ గురుక్కల్‌గా, తోట రాయ్ చౌదరి యశ్వంత్ బేనివాల్‌గా, ప్రియాంషు పైన్యులి వేద్‌గా, పరమవీర్ సింగ్ చీమా షేర్ జస్జిత్ సింగ్ పాత్రలో నటించారు. ‘రాంఝనా’ లాంటి హిట్ తర్వాత ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ” తేరే ఇష్క్ మే” 2025 నవంబర్ 28న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ భారతదేశంలో ఏకంగా 116.71 కోట్లు కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 161.96 కోట్లు కోట్ల కలెక్షన్స్ సాధించింది.

Read Also :  తెలివైన అమ్మాయిల్నే కిడ్నాప్ చేసే సైకో… ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ ఎంట్రీతో ఊహించని ట్విస్టులు

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

ఢిల్లీ యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ గా ఉంటాడు అక్కడ చదివే శంకర్ గురుక్కల్ (ధనుష్). అతనికి ముక్కు మీదే కోపం ఉంటుంది. ఇంకేముంది చదువు కన్నా ఎక్కువగా గొడవల్లోనే కన్పిస్తాడు. ఈ నేపథ్యంలోనే అదే కాలేజ్ కి ముక్తి భేనివాల్ (కృతి సనన్) అనే అమ్మాయి పీహెచ్‌డి థీసిస్ చేయడానికి అడుగు పెడుగుతుంది. కొన్ని ప్రయోగాల ద్వారా కోపంగా ఉండే ఒక మనిషిని మాములు మనిషిగా ఎలా మార్చొచ్చు అనే విషయం మీదే ఆ అమ్మాయి థీసిస్ చేస్తుంది. ఈ క్రమంలో శంకర్ గురించి తెలుసుకున్న ముక్తి తన థీసిస్ కి అతనే కరెక్ట్ అనుకుంటుంది. రాతల్లో కాకుండా చేతల్లో ఆ మనిషి కోపాన్ని తగ్గించి థీసిస్ పూర్తి చేయాలని అనుకుంటుంది.

అందులో భాగంగానే శంకర్ తో పరిచయం పెంచుకుంటుంది. ఆ స్నేహాన్ని శంకర్ నిజంగా లవ్ అనుకుంటాడు. అతను కూడా ఆ అమ్మాయిని ఇష్టపడతాడు. కానీ ముక్తి మాత్రం టైం పాస్ కి చేస్తూ అతన్ని తన థీసిస్ కోసం వాడుకుంటుంది. శంకర్ తో లైఫ్ లో ఎదిగాకే ప్రేమ, పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్తుంది. ఆమె తండ్రి కూడా అదే చెప్పడంతో శంకర్ సివిల్స్ చేయడానికి వెళ్ళిపోతాడు. మరి శంకర్ అనుకున్నది సాధించాడా ? చివరికి వీళ్ళ ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంది ? అన్నది తెరపై చూడాల్సిందే.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×