E-Paper
Advertisement

Netflix Best Web Series : మొగుడు పెళ్ళాల దొంగాట… ఆ పని కోసం పక్కచూపులు… బాబోయ్ ఏం సీన్లు సామీ ?

Netflix Best Web Series : మొగుడు పెళ్ళాల దొంగాట… ఆ పని కోసం పక్కచూపులు… బాబోయ్ ఏం సీన్లు సామీ ?
Advertisement

Netflix Best Web Series : వివాహంలో నమ్మకం, కోరిక, మోసం మధ్య సన్నని గీత ఎలా ఉంటుందో ఒక బో*ల్డ్ సిరీస్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. ఎమోషనల్ డ్రామాతో నడిచే ఈ సిరీస్ లో బోల్డ్ సీన్స్ కూడా ఎక్కువే. కొంతమంది పార్టనర్ తో కల్సి చేయాల్సిన పనులను పక్కనోళ్ళతో చేస్తుంటారు. అలాంటి వాళ్ళు చూడాల్సిన సిరీస్ ఇది. ఈ కథ ఒక వివాహ జంట పొందు కోసం పక్క చూపులు చూడటంతో మొదలవుతుంది. వీళ్ళ లైఫ్ చివరికి ఏమవుతుందనేదే ఈ కథ. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

ఈ ఇటాలియన్ రొమాంటిక్ డ్రామా మినీ సిరీస్ పేరు ‘డివోషన్: ఎ స్టోరీ ఆఫ్ లవ్ అండ్ డిజైర్’ (Devotion, a Story of Love and Desire). ఇది మార్కో మిస్సిరోలి నవల ఆధారంగా రూపొందింది. 6 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ 2022 ఫిబ్రవరి 14న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇందులో మిచెలే రియోండినో (కార్లో), లుక్రేజియా గుయిడోన్ (మార్గెరిటా) మెయిన్ రోల్స్ లో నటించారు. ఐయండిబిలో ఇది 6.4/10 రేటింగ్ పొందింది.

Advertisement

Read Also : భార్యకి విడాకులిచ్చి బిడ్డను దత్తత తీసుకునే ఓ తండ్రి కథ… ఓటీటీలో దుమ్మురేపుతున్న సిరీస్

స్టోరీ ఏమిటంటే

కార్లో, మార్గెరిటా అనే దంపతులు మిలాన్‌ సిటీలో సంతోషంగా జీవిస్తుంటారు. కార్లో యూనివర్సిటీలో ప్రొఫసర్ గా పనిచేస్తాడు. మార్గెరిటా రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా ఉంటుంది. వాళ్ల జీవితం బయటి నుంచి చూస్తే పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. రొమాంటిక్ లైఫ్ అంత సవ్యంగా ఉండదు. ఏదో కోల్పోయిన ఫీలింగ్ లో ఇద్దరూ ఉంటారు. ఈ సమయంలో కార్లో తన క్లాసులో చేరిన యంగ్ స్టూడెంట్ సోఫియాతో ఎమోషనల్‌గా దగ్గరవుతాడు. మొదట అది ఇంటెలెక్చువల్ అట్రాక్షన్‌గా మొదలై, తర్వాత ఫిజికల్ డిజైర్‌గా మారుతుంది. అతను ఆమెతో అఫైర్ ప్రారంభిస్తాడు, కానీ భార్యను మోసం చేస్తున్నానని గిల్ట్ ఫీల్ అవుతాడు.

Advertisement

ఇదే సమయంలో మార్గెరిటాకి తన ఫిజియోథెరపిస్ట్ ఆండ్రియాతో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. ఆమెకు భర్త ఇవ్వలేని ఆత్మీయత, శ్రద్ధ ఆండ్రియా ఇస్తాడు. దీంతో మార్గెరిటా కూడా అతనితో అఫైర్‌లో పడుతుంది. ఇద్దరూ తమ భాగస్వాముల నుంచి దాచి ఈ సంబంధాలు కొనసాగిస్తారు. కానీ రహస్యాలు ఎప్పుడూ దాగవు అన్నట్లు, కార్లోకి మార్గెరిటా అఫైర్ గురించి సందేహం వస్తుంది, మార్గెరిటాకి కార్లో మారిన ప్రవర్తన అర్థమవుతుంది. వాళ్లిద్దరి మధ్య గొడవలు, చర్చలు జరుగుతాయి. చివరికి వాళ్లు తమ వివాహాన్ని కాపాడుకోవాలా లేక వదిలేయాలా అనే ప్రశ్న ముందు నిలబడతారు. ప్రేమ అంటే కేవలం శారీరక నమ్మకం మాత్రమే కాదు, డిజైర్ ఎప్పుడూ ఒకే వ్యక్తి మీదే ఉండాలని నియమం లేదు అనే ఆలోచనలతో సిరీస్ ముగుస్తుంది.

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×