E-Paper
Advertisement

Devara OTT : “దేవర” ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

Devara OTT : “దేవర” ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
Advertisement

Devara OTT : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’ (Devara) ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘దేవర’ మూవీ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతోంది అనే వివరాలు బయటకు వచ్చాయి.

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ హీరోయిన్ గా నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దేవర’ (Devara). ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 500 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే థియేటర్లలో సినిమాను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు, ఎన్టీఆర్ అభిమానులు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. దీంతో ‘దేవర’ ఓటిటి రిలీజ్ పై రోజురోజుకు ఆసక్తి పెరుగుతుంది. ‘దేవర’ మూవీ ఓటిటి రైట్స్ ను అన్ని భాషల్లోనూ ఒకే దిగ్గజ ఓటిటి సంస్థ సొంతం చేసుకోవడం విశేషం. ‘దేవర’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది.

Advertisement

అయితే ఈ సినిమా నవంబర్లోనే ఓటీటీలో స్ట్రీమ్ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ  సినిమా (Devara)ను నవంబర్ 8 నుంచి నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఈ విషయంపై నిర్మాణ సంస్థ గాని, లేదా ఓటీటీ సంస్థ గాని ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ మరికొన్ని రోజుల్లోనే దీనిపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాబోతోందని టాక్ నడుస్తోంది. మరి ‘దేవర’ ఓటిటిలోకి ఎప్పుడు అడుగు పెడుతుందో చూడాలి.

కాగా ‘దేవర’ (Devara) సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ ముందు నెగెటివిటీని మూతగట్టుకున్నా, కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో థియేటర్లో దూసుకెళ్లింది. అలాగే పోటీకి పెద్ద సినిమలేవీ లేకపోవడం, దసరా పండగ వంటి అంశాలు ‘దేవర’కు కలిసొచ్చాయి.

Advertisement

ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలకపాత్రలో నటించగా, నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై హరికృష్ణ కె, సుధాకర్ మిక్కిలినేని సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇదిలా ఉండగా ‘దేవర’ (Devara) కలెక్షన్స్ విషయంలో స్వయంగా డిస్ట్రిబ్యూటర్ కలెక్షన్స్ ఫేక్ అని ప్రకటించడం చర్చకు దారి తీసింది. అయితే మరోవైపు నిర్మాత నాగ వంశీ ‘దేవర’ ను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీగా ఉన్నారు అంటూ కామెంట్ చేశారు. ఏదేమైనా ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని థియేటర్లలోకి వచ్చిన ఎన్టీఆర్ ‘దేవర’ (Devara) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఆయన అభిమానులకు సంతోషాన్ని కలిగించింది అనేది మాత్రం వాస్తవం.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×