E-Paper
Advertisement

Detective Thriller OTT : బాబోయ్… ట్విస్టులే ట్విస్టులు… మెంటలెక్కించే ఫీల్ గుడ్ బెంగాలీ డిటెక్టివ్ డ్రామా

Detective Thriller OTT : బాబోయ్… ట్విస్టులే ట్విస్టులు… మెంటలెక్కించే ఫీల్ గుడ్ బెంగాలీ డిటెక్టివ్ డ్రామా
Advertisement

Detective Thriller OTT : డిటెక్టివ్ థ్రిల్లర్ సినిమాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది జేమ్స్ బాండ్ మూవీస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ పై ఈ ఫ్రాంచైజీలో వచ్చిన సినిమాలు చూపించిన ఇంపాక్ట్ అలాంటిది మరి. అంతేనా ఇతర భాషల్లో ఇలాంటి సినిమాలు రావడానికి మేకర్స్ లో స్పూర్తిని కూడా నింపాయి. అయితే ఈరోజు మన మూవీ సజెషన్ తో ఈ జేమ్స్ బాండ్ కు ఎలాంటి సంబంధం లేదు. కానీ డిటెక్టివ్ థ్రిల్లర్ జానర్ కు మాత్రం సంబంధం ఉంది. మరి ఈ స్పై థ్రిల్లర్ కథేంటి ? ఆ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

2025లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన బెంగాలీ మిస్టరీ డిటెక్టివ్ థ్రిల్లర్ ‘జోటో కండో కోల్‌కతాటీ’ (Joto Kando Kolkatatei). అబీర్ ఛటర్జీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సత్యజిత్ రే క్లాసిక్ శైలిని సోషల్ మీడియా వంటి ఆధునిక అంశాలతో మిక్స్ చేసి అద్భుతంగా తెరకెక్కించారు. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 2025 సెప్టెంబర్ 26న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ దాదాపు 3 నెలల తర్వాత జీ5 (ZEE5)లో ప్రసారం అవుతోంది . ఇందులో కోల్‌కతా సాంస్కృతిక వస్త్రధారణ, చారిత్రక అనుభూతిని ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఇది రే డిటెక్టివ్ రచనలకు సినిమాటిక్ ప్రేమలేఖ అనే ప్రశంసలు విన్పించాయి క్రిటిక్స్ నుంచి.

Advertisement

కాగా అనిక్ దత్తా దర్శకత్వం వహించిన ‘జోటో కాండో కోల్‌కతాటీ’లో తోపేష్ మిత్ర (తోప్షే)గా అబిర్ ఛటర్జీ, సబాగా క్వాజీ నౌషాబా అహ్మద్, సుజీగా రోజా పరోమితా డే, అలోక్ రాయ్‌చౌదరిగా రిక్ ఛటర్జీ మెయిన్ రోల్స్ పోషించారు. ముసలివాడిగా దులాల్ లాహిరి, వృద్ధుడి భార్యగా మిథు చక్రవర్తి, వారి కోడలిగా అపరాజిత ఘోష్, అనింద్య పులక్ బెనర్జీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కన్పిస్తారు.

Read Also : 200 మందిని బలి తీసుకున్న సైకో… సైన్స్ పాఠాలు నేర్పిస్తానని… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

ఢాకాకు చెందిన సబా అనే అమ్మాయి చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఆమె తన తల్లిదండ్రుల పూర్వీకుల గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. అందులో భాగంగా కోల్‌కతాకు వస్తుంది. కానీ అప్పటికి ఆమె చేతిలో ఒకే ఒక్క పాత ఫోటో ఉంటుంది. అదే మార్గదర్శి అనుకుని ఆమె తన పూర్వీకులను, వారి మూలాలను వెతుక్కుంటూ వెళ్తుంది. ఈ క్రమంలోనే ఒక యంగ్ డిటెక్టివ్ ఆ అమ్మాయికి తారస పడతాడు. అతని పేరు టోపోస్మిత్రో. అతను ఫెలూడాకు పెద్ద అభిమాని. ఇక ఇద్దరూ కలిసి ఆ ఫోటోలోని చిన్న చిన్న డీటైల్స్ ను ఆధారాలుగా మలుచుకుని, కోల్‌కతాలోని ప్రసిద్ధ ప్రదేశాలు, కుర్సోంగ్, డార్జిలింగ్ గుండా ప్రయాణం కొనసాగిస్తారు. అయితే ఒక్కో ప్లేస్ ఒక్కో చిక్కుముడిని విప్పుతున్నట్టుగా ఉంటుంది. అయితే గతంలో లాగా టెలిగ్రామ్‌లు, కోడెడ్ లెటర్స్‌ కు కాకుండా స్నాప్‌షాట్‌లు, హ్యాష్‌ట్యాగ్‌లు, GPS కోఆర్డినేట్లు వంటివి వాడుతూనే, సత్యజిత్ రే డిటెక్టివ్ కథల శైలిలో సినిమా నడుస్తుంది. మరి ఇంతకీ ఆ అమ్మాయి ఏం తెలుసుకోవాలి అనుకుంది ? చివరికి ఆ ఇద్దరూ కనిపెట్టింది ఏంటి ? అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×