E-Paper
Advertisement

OTT Movie : స్పేస్ క్రాఫ్ట్ పేలుడు… దాని ఒక్కో ముక్కతో భూమిపై ఒక్కో వినాశనం… మైండ్ బెండయ్యే సై-ఫై థ్రిల్లర్

OTT Movie : స్పేస్ క్రాఫ్ట్ పేలుడు… దాని ఒక్కో ముక్కతో భూమిపై ఒక్కో వినాశనం… మైండ్ బెండయ్యే సై-ఫై థ్రిల్లర్
Advertisement

OTT Movie : సైన్స్ ఫిక్షన్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తున్నప్పుడు, మరో ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలలో వచ్చే విజువల్ ఎఫ్ఫెక్ట్స్ కి ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ఒక స్పేస్ నౌక నుంచి వచ్చే శఖలాలు భూమిపై అల్లకల్లోలం సృష్టిస్తాయి. ఈ సిరీస్ లో ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ చాలానే ఉన్నాయి. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

Advertisement

ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ టెలివిజన్ సిరీస్ పేరు ‘డెబ్రిస్’ (Debris). ఈ సిరీస్ NBCలో 2021మార్చి 1 నుంచి ప్రీమియర్ అయింది. J.H. వైమన్ దీనిని సృష్టించారు. యూనివర్సల్ టెలివిజన్, లెజెండరీ టెలివిజన్ దీనిని నిర్మించాయి. ఈ సిరీస్‌లో జోనాథన్ టక్కర్ (బ్రయాన్ బెనెవెంటి), రియాన్ స్టీల్ (ఫినోలా జోన్స్), నార్బర్ట్ లియో బట్జ్ (క్రెయిగ్ మాడాక్స్), స్క్రూబియస్ పిప్ (ఆన్సన్ ఆష్) ప్రధాన పాత్రలలో నటించారు. ఇది ఒక గ్రిప్పింగ్ సై-ఫై థ్రిల్లర్, ఇది గతంలో వచ్చిన ‘ది X-ఫైల్స్’, ‘ఫ్రింజ్’ వంటి సిరీస్‌లతో పోల్చబడింది. IMDB లో ఈ సిరీస్ కి ఈ సిరీస్ కి 7.7/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

గత ఆరు నెలలుగా ఒక స్పేస్ నౌక శకలాలు, భూమిపై చాలా ప్రాంతాలలో పడుతుంటాయి. ఈ శకలాలు సాధారణ మానవులపై పడుతూ, వాళ్ళ ప్రాణాలకు ముప్పు తెస్తుంటాయి. ఈ శకలాలు వింత శక్తులు కలిగి ఉన్నాయి. ఇవి ఎవరైనా టెలిపోర్ట్ చేయగలవు, క్లోన్ అవ్వగలవు. ఈ శిథిలాలను సేకరించడానికి, వాటి రహస్యాలను వెలికితీసేందుకు ఒక అంతర్జాతీయ టాస్క్ ఫోర్స్ టీం ను నియమిస్తారు. ఈ టీం లో బ్రయాన్ బెనెవెంటి అనే  CIA ఏజెంట్, ఫినోలా జోన్స్ MI6 తో కలసి పని చేస్తాడు. వీళ్లిద్దరూ భిన్న వ్యక్తిత్వాలు కలిగి ఉన్నప్పటికీ, ఈ మిషన్ ల్ కలిసి పనిచేస్తారు. బ్రయాన్, ఫినోలా కలిసి ఈ శిథిలాలను వెతుకుతూ, వాటి వల్ల జరిగే వింత సంఘటనలను పరిష్కరిస్తారు. చివరికి వీళ్ళ పరిశోధనలో ఎలాంటి రహస్యాలు తెలుస్తాయి ? ఆ శకలాలు ఎక్కడి నుంచి పడుతుంటాయి ? గ్రహాంతర వాసులతో సంబంధం ఉంటుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సైన్స్ ఫిక్షన్ టెలివిజన్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

Read Also : రెండున్నర నెలల తరువాత ఓటీటీలోకి రవితేజ మేనల్లుడి సినిమా… ఐఎండీబీలో 9.5 రేటింగ్ ఉన్న తెలుగు లవ్ స్టోరీ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×