// // Daksha OTT - ఓటీటీకి వచ్చేస్తోన్న మంచు లక్ష్మి మూవీ -->
E-Paper
Advertisement

Daksha OTT: ఓటీటీకి వచ్చేస్తోన్న మంచు లక్ష్మి మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే

Daksha OTT: ఓటీటీకి వచ్చేస్తోన్న మంచు లక్ష్మి మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే
Advertisement

Manchu Lakshmi Daksha OTT: ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదాలు గురించి తెలిసిందే. కొంతకాలంగా ఈ మంచు అన్నదమ్ములు విష్ణు, మనోజ్‌లకు పడటం లేదు. మరోవైపు మోహన్‌ బాబు యూనివర్సిటీ వివాదంలో పడింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నారంటూ యూనివర్సిటీని ఫైన్‌ పడింది. కొన్ని నెలలుగా మంచు ఫ్యామిలీ తరచూ ఏదోక వివాదంలో నిలుస్తుంది. ఇంత జరుగుతుంటే మంచు లక్ష్మి మాత్రం ఫ్యామిలీ గొడవల విషయంలో సైలెంట్‌గా ఉంటుంది. తనకే తెలియదు అన్నట్టు ముంబైలో వాలిపోయింది.

లాంగ్‌ గ్యాప్‌ తర్వాత

Advertisement

ఇలా మంచు ఫ్యామిలో రోజుకో కొత్త గొడవలు, ట్విస్టులు బయటకు వస్తున్న తరుణంగా మంచు లక్ష్మి నుంచి ఓ సినిమా వచ్చింది. తొలిసారి తన తండ్రి మంచు మోహన్‌ బాబుతో కలిసి ఆమె నటించిన చిత్రం దక్ష. ఉమెన్‌ సెంట్రిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 19న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ టైంలో మంచు లక్ష్మి పేరు, మూవీపేరు బాగా వినిపించింది. దీనికి కారణం ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయడం. అప్పుడే దక్ష మూవీ ఒకటి ఉందని, అది థియేటర్లలోకి వస్తున్నట్టు ప్రేక్షకులు తెలిసింది.

అమెజాన్‌లో స్ట్రీమింగ్

అయితే ఈ సినిమా ఎలా అయితే థియేటర్లలోకి వచ్చిందో అంతే వేగంగా వెళ్లిపోయింది. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కి రెడీ అయ్యింది. దీనిపై స్వయంగా మంచు లక్ష్మి ప్రకటన ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైం వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. రేపు శుక్రవారం ఈ సినిమా అమెజాన్‌లో విడుదల కాబోతుందని ప్రకటిస్తూ మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేసింది. బిగ్‌స్క్రీన్‌పై పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ఏ మేరక ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా మంచు లక్ష్మి పోలీసు ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రం మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌గా వచ్చిన సంగతి తెలిసిందే.

దక్ష కథేంటంటే

Advertisement

మంచు లక్ష్మి ఇందులో సీఐ దక్షగా నటించగా, మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్‌ ఓ వ్యక్తి అనుమానస్పదంగా చనిపోతాడు. ఈ కేసును సీఐ దక్ష ఇన్వెస్టిగేట్‌ చేస్తుంది. అదే సమయంలో అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ ప్రతినిథి హైదరాబాద్‌ వస్తాడు. అతడు కూడా హత్యకు గురవుతాడు. అయితే రెండు హత్యల్లో క్లూస్‌ ఒకలా ఉంటాయి. విచారణ ముందుకు వెళ్తున్న కొద్ది ఈకేలో అనుకోని ట్విస్టులు ఎదురవుతుంటాయి. దక్షిపై డాక్యుమెంటరీ తీయాలని చూస్తున్న జర్నలిస్ట్‌ సురేష్‌.. సైలెంట్‌గా ఆమెను ఫాలో అవుతాడు. ఈ క్రమంలో అతడికి నమశక్యం కానీ ఓ నిజం వెలుగు చూస్తుంది. ఇంతకీ ఆ రెండు హత్యలు చేసింది ఎవరు? ఈ హత్యల వెనుకుంది ఎవరు? ఇంతకి దక్షి, మిథిలా (చిత్రా శుక్లా)కు మధ్య సంబంధం ఏంటీ? తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×