E-Paper
Advertisement

OTT Movie : గెస్ట్ హౌస్‌లో అమ్మాయిలు అబ్బాయిల ఆట… ఒంటరిగా చూడకూడని హర్రర్ థ్రిల్లర్

OTT Movie : గెస్ట్ హౌస్‌లో అమ్మాయిలు అబ్బాయిల ఆట… ఒంటరిగా చూడకూడని హర్రర్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : హీరోల వారసులు సినిమాలలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది సక్సెస్ అయితే, మరికొంత మంది తట్టా,బుట్టా సర్దుకుంటారు. సీనియర్ నటుడు శరత్ బాబు కొడుకు ఆయుష్ తేజస్ నటించిన హర్రర్ థ్రిల్లర్ సినిమా, థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రెండేళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమా, ఈ ఏడాది ఓటీటీలో అందుబాటులో కి వచ్చింది. ఈ కథ ఆరుగురు స్నేహితులు గెస్ట్ హౌస్‌లో పార్టీ చేస్తూ, ఒక డేంజర్ గేమ్ ఆడుతారు. అయితే గేమ్ లో ఎవరైతే ఓడిపోతే, వాళ్ళు చనిపోతుంటారు. ఈ చిల్లింగ్ థ్రిల్ సినిమా ఏ ఒత్తిడిలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘దక్ష’ (Daksha) 2023లో వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా. వివేకానంద విక్రంత్ దర్శకత్వంలో ఆయుష్ తేజస్, షోభన్ బోగరాజు, ఆయుష్ తేజస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదల అయింది. ప్రస్తుతం IMDbలో 8.3/10 రేటింగ్ ని పొందింది. ప్రస్తుతం ఈ సినిమా హంగామా, యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే

Advertisement

ఆరుగురు స్నేహితులు ఒక గెస్ట్ హౌస్‌లో పార్టీ చేసుకోవడానికి వెళ్తారు. వాళ్లు సంతోషంగా మద్యం తాగుతూ, చాసర్ అనే గేమ్ ఆడతారు. ఈ గేమ్ రూల్స్ ప్రకారం, ఎవరైనా గేమ్‌లో ఓడిపోతే, వాళ్లకు ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుందని అనుకుంటారు. మొదట అంతా ఫన్నీగా సాగుతుంది. కానీ తెల్లవారుజామున లేచి చూస్తే, వీళ్ళల్లో ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు. ఇది చూసి స్నేహితులు అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ గేమ్‌లో ఓడిపోయినవాడు చనిపోతాడని వీళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్లంతా భయంతో కిల్లర్ ఎవరని సందేహంలో ఉంటారు. వీళ్ళంతా బయటికి వెళ్లలేక ఆ గెస్ట్ హౌస్‌లోనే చిక్కుకుంటారు.

Read Also : డివోర్స్‌డ్ సేల్స్ మ్యాన్‌కు దిమ్మతిరిగే ట్విస్ట్… జైల్లో భార్య ప్రియుడితో… క్లైమాక్స్ హైలెట్

వాళ్లు ఒకరినొకరు అనుమానిస్తూ, గేమ్ కొనసాగించడానికి ట్రై చేస్తారు. కానీ ప్రతి గేమ్ తర్వాత మరొకరు చనిపోతుంటాడు. వీళ్ళంతా ఒకరిని చూసి మరొకరు భయపడుతూ పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ గేమ్ వాళ్లను బయటికి వెళ్లనివ్వదు. కథ భయంకరంగా, సస్పెన్స్‌తో సాగుతుంది. క్లైమాక్స్ ఊహియించని ట్విస్ట్లు ఇస్తుంది. వీళ్ళు ఆ గేమ్ నుంచి బయటపడతారా ? ఆ గేమ్ కి బలవుతారా ? వీళ్ళను చంపుతుంది ఎవరు ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
Advertisement

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×