E-Paper
Advertisement

OTT Movie : ఐఎండీబీలో 8.4 రేటింగ్… ఎట్టకేలకు ఓటీటీలో అడుగు పెట్టిన తెలుగు హర్రర్ థ్రిల్లర్

OTT Movie : ఐఎండీబీలో 8.4 రేటింగ్… ఎట్టకేలకు ఓటీటీలో అడుగు పెట్టిన తెలుగు హర్రర్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఒక గ్రిప్పింగ్ హారర్ థ్రిల్లర్, అతీంద్రియ ఎలిమెంట్స్‌తో వణుకు పుట్టిస్తోంది. ఈ సినిమాను చుస్తే రాత్రి పూట నిద్ర కూడా కరువవుతుంది. ఒక భయంకరమైన ఆట చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ గేమ్ ఆడిన వాళ్ళు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఈ సీన్స్ ప్రేక్షకులకు భయాన్ని కలిగిస్తాయి. థియేటర్లలో వచ్చిన రెండేళ్ల తరువాత, రీసెంట్ గా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ తెలుగు సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకివెళితే …

హంగామాలో స్ట్రీమింగ్

Advertisement

‘దక్ష’ (Daksha) 2023 ఆగస్టు 25న విడుదలైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా. ఇది వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో రూపొందింది. ఆయుష్ తేజస్, ఆయిరా అను, కోట నక్షత్ర, అలేఖ్య గడంబోయిన, రవి రెడ్డి, శోభన్ బొగరాజు, అఖిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం, ఒక గెస్ట్ హౌస్‌లో జరిగే ఒక భయంకరమైన ఆట చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై, 8.4/10 IMDb రేటింగ్‌తో మంచి ఆదరణ పొందింది. Hungama ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోర్లోకి వెళితే

Advertisement

వరుణ్, డేవిడ్, ఆయుష్, అలేఖ్య, నక్షత్ర అనే స్నేహితులు ఒక గెస్ట్ హౌస్‌లో పార్టీ చేసుకోవడానికి వెళతారు. అక్కడ వాళ్లు “చాసర్” అనే ఒక వింత ఆట ఆడతారు. ఈ ఆటలో ఓడిపోతే ఏదో ఒక టాస్క్ చేయాలనే రూల్స్ ఉంటాయి. కానీ ఆ రాత్రి ఆట అయిపోయాక, మరుసటి రోజు ఉదయం డేవిడ్ చనిపోయినట్లు కనిపిస్తాడు. ఈ సంఘటన అందరినీ షాక్‌లోకి నెట్టేస్తుంది. మొదట అందరూ దీన్ని సాధారణ మరణంగా భావిస్తారు. కానీ తర్వాత వరుణ్ ఒక భయంకరమైన విషయం కనిపెడతాడు. ఈ చాసర్ ఆటలో ఓడిపోయినవాళ్లు చనిపోతున్నారని తెలుస్తుంది. వరుణ్ ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పి హెచ్చరించడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాళ్లలో కొందరు అతని మాటలను నమ్మరు.

Read Also : ఐఎండీబీలో 9.8 రేటింగ్… డిఫరెంట్ స్టోరీ లైన్ తో దుమ్మురేపుతున్న కన్నడ థ్రిల్లర్… ఈ వీకెండ్ కు మూవీ సెట్టు

ఈ ఆట వెనుక ఒక చీకటి రహస్యం ఉందని, అది ఒక అతీంద్రియ శక్తితో ముడిపడి ఉందని తెలుస్తుంది. ఆ గెస్ట్ హౌస్‌లో ఆ ఆటకు సంబంధించిన కొన్ని ఆధారాలు దొరుకుతాయి, దాని ద్వారా వాళ్లు నిజమైన కిల్లర్ ఎవరో కనుక్కోవడానికి ట్రై చేస్తారు. ఆట ఆడినవాళ్లు ఒక్కొక్కరూ వింతగా చనిపోతుంటే, సస్పెన్స్, భయం పెరుగుతాయి. వరుణ్ మిగిలిన వాళ్లను కాపాడడానికి, ఆ ఆట రహస్యాన్ని ఛేదించడానికి ఒక రేస్‌లో పడతాడు. ఈ కథ ట్విస్ట్‌లు, జంప్ స్కేర్స్, హారర్ ఎలిమెంట్స్ తో నడుస్తుంది. చివరికి, ఆ ఆట వెనుక ఉన్న అతీంద్రియ శక్తి గురించి ఒక షాకింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. కానీ అందరూ బయటపడతారా ? లేదా ఆ దుష్ట శక్తికి బలవుతారా ? అనేది క్లైమాక్స్‌లో తెలుస్తుంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×