E-Paper
Advertisement

OTT Movie : గ్రామానికి శాపం… ఐఏఎస్ ఆఫీసర్‌కు చెమటలు పట్టించే దెయ్యాలు… గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడండి

OTT Movie : గ్రామానికి శాపం… ఐఏఎస్ ఆఫీసర్‌కు చెమటలు పట్టించే దెయ్యాలు… గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడండి
Advertisement

OTT Movie : హారర్ జానర్ లో వస్తున్న వెబ్ సిరీస్ లు ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంటున్నాయి. మేకర్స్ ఆడియన్స్ ని భయపెట్టాడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. కొత్త కథలను స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ ని ఒక వీకెండ్‌లో లైట్లు పూర్తిగా ఆఫ్ చేసి చూస్తే భయం గ్యారంటీగా పుడుతుంది. ఇది రాజస్థాన్‌లోని ఒక గ్రామంలో పురాతన శిల కింద బంధించబడిన “రాకాన్” అనే భయంకర రాక్షసుడు మళ్లీ బయటకు వస్తే ఏం జరుగుతుంది? అన్న ప్రశ్నతో మొదలయ్యే ఒక భయంకరమైన హారర్ సిరీస్. ఈ సిరీస్ హారర్ ఫ్యాన్స్‌ మిస్ చేయకూడని థ్రిల్లర్. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే

జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్

‘దహన్: రాకాన్ కా రహస్య’ (Dahan raakan ka rahasya) విక్రంత్ పవార్, జై శర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ సిరీస్ లో టిస్కా చోప్రా లీడ్ రోల్‌లో నటించారు. 9 ఎపిసోడ్లతో ఈ సిరీస్ 2022సెప్టెంబర్ 16న జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఐయండిబిలో 7.1/10 రేటింగ్ ని పొందింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

అవని శర్మ అనే ఒక నిజాయితీ గల ఐఏఎస్ అధికారి శిలాస్‌ పూర్ కు బదిలీ అవుతారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఆమె మైనింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తుంది. అయితే ఆ గ్రామంలో ఒక పెద్ద శిల కింద 400 ఏళ్ల క్రితం ఓ మాంత్రికుడు తన కొడుకైన “రాకాన్” అనే రాక్షసుడ్ని బంధించాడని స్థానికుల నమ్మకం. ఇప్పుడు ఓ మైనింగ్ కంపెనీ ఆ శిల కిందే తవ్వకాలు ప్రారంభించడంతో గ్రామంలో వరుస మరణాలు, పాసెషన్స్, వింత శబ్దాలు, రక్తం కక్కే సంఘటనలు మొదలవుతాయి. దీంతో అక్కడ వాతావారణం ఒక్క సారిగా మారిపోతుంది.

Read Also : అమ్మాయిల శవాలను తవ్వి తీసి ఆ పాడు పని… ఒళ్ళు జలదరించే సీన్లు… ఒంటరిగా చూస్తే ఫసక్

Advertisement

అవని మొదట్లో దీన్ని కేవలం మూఢనమ్మకంగా భావిస్తుంది. కానీ క్రమంగా ఆమెకే రాకాన్ భయంకర శక్తి అనుభవంలోకి వస్తుంది. అవని సైంటిఫిక్ మైండ్‌తో ఈ మిస్టరీని ఛాలెంజ్ చేస్తూ ముందుకు సాగుతుంది.ఆఖరి మూడు ఎపిసోడ్లలో కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది. రాకాన్ నిజంగానే ఉన్నాడా? లేక ఇదంతా భారీ కుట్రనా? అన్న ప్రశ్నలు ఒక్కసారిగా షాక్ ఇస్తాయి. ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఏదో రహస్యం దాచుకుని ఉండటం, రాత్రిపూట జరిగే రిచ్యువల్స్, రక్తం మాంసం కోసం రాక్షసుడు వేటాడటం, ఈ ఎలిమెంట్స్ అన్నీ కలిసి ఒక ఇంటెన్స్ క్లైమాక్స్‌ని ఇస్తాయి.

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×