E-Paper
Advertisement

నలుగురు అబ్బాయిలతో ఒకేసారి… కామెడీతో పాటు యూత్ కనెక్టయ్యే కొరియన్ సిరీస్

నలుగురు అబ్బాయిలతో ఒకేసారి… కామెడీతో పాటు యూత్ కనెక్టయ్యే కొరియన్ సిరీస్
Advertisement

Korean Romantic Drama: ప్రతీ ఒక్కరి జీవితంలో బాల్యం ఎంత బాగుంటుందో కదా. ఏ చీకూచింతా లేకుండా ప్రశాంతంగా బతికేది చిన్నప్పుడే. అందుకే ఏ బాధ వచ్చినా ప్రతీ ఒక్కరూ అదే తలచుకుంటారు. అలాగే టీనేజ్ కూడా. ఆ వయసులో ఉడుకు రక్తంతో చేసే అల్లరి చిలిపి పనులు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఇక కాలేజ్ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడే లైఫ్ స్టోరిలే కాదు లవ్ స్టోరీలు కూడా స్టార్ట్ అవుతాయి. అలాంటి ఒక అందమైన కొరియన్ ప్రేమ కథ ‘క్రషాలజీ 101’ (Crushology 101) ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో ఉందా ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ పేరు బాన్ హీ-జిన్. అందరూ ‘బని’ అని పిలిచే ఈ అమ్మాయి శిల్పకళా విద్యార్థిని. ఎయిన్ యూనివర్సిటీలో చదువుతున్న ఆ అమ్మాయి చాలా టాలెంటెడ్. కానీ ప్రేమలో ఆమెకు ఒక భయంకరమైన చేదు అనుభవం ఉంది. గతంలో ఒక అబ్బాయిని మనస్పూర్తిగా ప్రేమించి, ఘోరంగా మోసపోతుంది. ఆ గాయం నుంచి బయటపడలేక బని ఒక వింత నిర్ణయం తీసుకుంటుంది. ఇకపై కేవలం అందగాళ్లు, హ్యాండ్‌సమ్ అబ్బాయిలనే ప్రేమిస్తాను. మనసు చూసి మోసపోవడం వద్దు అనుకుంటుంది.

Advertisement

కానీ కాలేజీ జీవితం ఆమె ఆలోచనలకు ఆపొజిట్స్ గా మారిపోతుంది. యూనివర్సిటీలోకి అనుకోకుండా నలుగురు అందమైన సీనియర్ అబ్బాయిలు అడుగు పెడతారు. వీరందరూ విభిన్న వ్యక్తిత్వాలు, బ్యాక్‌గ్రౌండ్స్ కలిగి ఉంటారు. అయితే బనిని ఆకట్టుకోవడానికి తమ స్టైల్ లో ప్రయత్నిస్తారు. ఇక్కడే కథ సరదాగా, కామెడీగా, ఎమోషనల్‌గా టర్న్ అవుతుంది.

ఆ నలుగురు అబ్బాయిలలో హ్వాంగ్ జే-యూల్ విజువల్ డిజైన్ స్టూడెంట్. కూల్ ఆర్టిస్టిక్ స్వభావం కలిగిన వ్యక్తి. చా జి-వాన్ మాత్రం రిచ్ కిడ్, చాబోల్ వారసుడు. ఆత్మవిశ్వాసం, లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్న అతను బనిని ఆకర్షించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేస్తాడు. జో ఆ-రాంగ్ వంటి మిగిలిన అబ్బాయిలు కూడా బని హృదయాన్ని గెలవడానికి గట్టిగా ట్రై చేస్తారు. బని తన శపథం చేసినట్టే అందగాళ్లనే సెలెక్ట్ చేస్కోవాలని ప్రయత్నిస్తుంది. కానీ నెమ్మదిగా వాళ్ళ మనస్తత్వాలు, స్నేహం, సపోర్ట్ చూసి ఆమె గందరగోళంలో పడుతుంది. అందమే కాదు మనసు కూడా ముఖ్యమని ఆమె గ్రహిస్తుంది. మరి బని జీవితం ఎలాంటి టర్న్ తీసుకుంది ? ఆ నలుగురిలో ఎవరిని బాయ్ ఫ్రెండ్ గా సెలెక్ట్ చేసుకుంది ? అనేది తెలియాలంటే సిరీస్ పై ఒక లుక్కేయాల్సిందే.

తెలుగు స్ట్రీమింగ్ ?

Advertisement

ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కొరియన్ సిరీస్ 2025లో వచ్చింది. ఈ సిరీస్ ప్రస్తుతం Amazon Prime Video, Rakuten Vikiలో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు. తెలుగు డబ్బింగ్ లేదు కాబట్టి కొరియన్ ఆడియోతోనే వీక్షించాలి. మొత్తం 12 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ ఫన్నీగా, ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చేలా ఉంటుంది.

Read Also: ఒకే ఒక్క టాబ్లెట్ తో కంట్రోల్ తప్పే అమ్మాయిలు… కట్ చేస్తే చెమటలు పట్టించే థ్రిల్లింగ్ ట్విస్ట్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×