E-Paper
Advertisement

మాఫియాను పట్టుకోవడానికి ఎరగా మారే లేడీ కానిస్టేబుల్… అన్నీ అవే సీన్లు

మాఫియాను పట్టుకోవడానికి ఎరగా మారే లేడీ కానిస్టేబుల్… అన్నీ అవే సీన్లు
Advertisement

Crime thriller web series: మాఫియాను పట్టుకోవాలనేది పోలీసుల పని. అయితే పోలీస్ ఆఫీసర్లు అలాంటి వాళ్ళను పట్టుకోవడానికి ఎలా పరుగులు పెడతారో చాలా సినిమాలలో చూశాము మనం. కానీ ఒక లేడీ కానిస్టేబుల్ ను ఎరగా వేస్తే ఎలా ఉంటుంది ? ఆ అమ్మాయి ఏం చేయడానికి వెళ్ళి ఏం చేసింది ? అన్నది తెలియాలంటే She Hindi crime drama సిరీస్ ను చూడాల్సిందే. మరి ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ ముంబై నగరంలో స్టార్ట్ అవుతుంది. భూమికా పర్ధేసి అలియాస్ భూమి ఒక లేడీ కానిస్టేబుల్‌ గా పోలీస్ డిపార్ట్‌మెంట్‌ లో పని చేస్తుంటుంది. ఇంట్లో భర్త నుండి విడాకులు తీసుకుంటుంది. క్యాన్సర్‌ తో బాధపడుతున్న తల్లి ఉంటుంది ఆమెకు. తిరుగబడే మెంటాలిటీ ఉన్న చెల్లెలి బాధ్యతలు కూడా ఆమెపైనే ఉంటాయి. ఇలాంటి ఎన్నో ఇబ్బందుల మధ్య భూమి తన జీవితాన్ని కంటిన్యూ చేస్తుంది. ఇక ఈ అమ్మాయిని అంతగా కాన్ఫిడెన్స్ ఉండదు. పైగా పిరికి అమ్మాయి. సమాజం, కుటుంబం ఆమెను ఎప్పుడూ ఆమెను తక్కువ చేసి చూస్తారు.

Advertisement

ముంబైలో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నడుపుతున్న ఒక పెద్ద అండర్‌వరల్డ్ మాఫియా ముఠాను పట్టుకోవడానికి యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్ ఒక డేంజరస్ ప్లాన్ వేస్తుంది. ఆ ముఠాలోని కీలక సభ్యుడైన సస్యను ట్రాప్ చేయడానికి ఒక మహిళా కానిస్టేబుల్ అవసరమవుతుంది. ఎవరూ ఊహించని విధంగా భూమిని సెలెక్ట్ చేస్తారు. ఆమె కానిస్టేబుల్ అన్న విషయాన్ని దాచి, ముంబై వీధుల్లో వేశ్యగా నటిస్తూ సస్యకు దగ్గరవుతుంది. ఈ అండర్‌కవర్ ఆపరేషన్ ఆమె జీవితాన్ని మార్చేస్తుంది.

భూమి తన శరీరాన్ని, ఆకర్షణను, తెలివితేటలను ఒక ఆయుధంగా మార్చుకుంటుంది. సస్యతో ఏర్పడిన సన్నిహిత బంధం ఆమెలో ఒక కొత్త శక్తిని రేకెత్తిస్తుంది. నెమ్మదిగా నేర ప్రపంచంలోకి దిగుతుంది. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటుంది. కానీ ఆ ప్రమాదాలు ఆమెలోని స్త్రీ శక్తిని మరింత పవర్ ఫుల్ గా చేస్తాయి.

Advertisement

సీజన్ 1లో భూమి కేవలం పోలీసులకు సహాయం చేసే ఒక ‘పావు’లా ఉంటుంది. కానీ సీజన్ 2లో ఆమె పాత్ర పూర్తిగా మారిపోతుంది. డ్రగ్స్ నెట్‌వర్క్‌లోని కీలక సభ్యులను దాటుకుని, అంతర్జాతీయ డ్రగ్ లార్డ్ ‘నాయక్’ వరకు చేరుకుంటుంది. తనకిచ్చిన ఆపరేషన్ ను పూర్తి చేయడం కాకుండా, తన స్టైల్ లో ఆ నెట్‌వర్క్‌ను కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మరి అలాంటి టైమ్ లో పోలీసులు ఏం చేశారు ? హీరోయిన్ చివరకు ఎలా మారింది ? ఫైనల్ గా క్లైమాక్స్ లో జరిగింది ఏంటి ? అన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కేయండి.

తెలుగులోనూ స్ట్రీమింగ్

ఒక నార్మల్ కానిస్టేబుల్ గ్యాంగ్ స్టర్ గా ఎలా మారిపోతుందో చూపించే సిరీస్ ‘షీ’. ఇంతియాజ్ అలీ కథ అందించిన ఈ హిందీ క్రైమ్-డ్రామా వెబ్ సిరీస్ లో అదితి పోహంకర్ ప్రధాన పాత్ర నటించింది. ఈ సిరీస్ ప్రస్తుతం Netflixలో తెలుగు డబ్బింగ్‌తో సహా హిందీ, ఇతర భాషల్లో అందుబాటులో ఉంది. 2 సీజన్లు, 14 ఎపిసోడ్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Read Also: 40 రోజులు నలుగురు పిల్లలు మిస్సింగ్… అమెజాన్ అడవుల్లో అదిరిపోయే అడ్వెంచర్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×