E-Paper
Advertisement

కూతురి హత్యపై వ్యవస్థను ప్రశ్నించిన ఓ ఒంటరి తల్లి… ఐయండిబిలో 8.1రేటింగ్

కూతురి హత్యపై వ్యవస్థను ప్రశ్నించిన ఓ ఒంటరి తల్లి… ఐయండిబిలో 8.1రేటింగ్
Advertisement

Crime Thriller OTT : థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఒక హాలీవుడ్ రివెంజ్ డ్రామా ఆసక్తికరమైన కథనంతో ఆకట్టుకుంటోంది. కూతురు చనిపోయిన బాధలో ఉన్న ఒక తల్లి, పోలీసుల మీద కసిగా చేసే పోరాటమే ఈ కథ. ఇది మామూలు సెంటిమెంట్ సినిమా కాదు, ఇందులో పాత్రలు నోటికొచ్చినట్టు తిట్టుకుంటూ, అవసరమైతే బాంబులు కూడా వేసుకునేంత రఫ్ గా ఉంటాయి. ఎవరు హీరోనో ఎవరు విలనో అర్థం కానంత గందరగోళంగా, చాలా గ్రిప్పింగ్‌గా సాగే సినిమా ఇది. ఐయండిబిలో 8.1 రేటింగ్ ఉన్న ఈ సినిమా ఆస్కార్ ను కూడా గెలిచింది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘త్రీ బిల్‌బోర్డ్స్ అవుట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సౌరీ’ (Three Billboards Outside Ebbing, Missouri). 2017లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా హీరోయిన్ ఫ్రాన్సిస్ మెక్‌డోర్మాండ్ తన నటనతో అందరినీ కట్టిపడేసి ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్నారు. అలాగే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సామ్ రాక్‌వెల్ కూడా ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ గెలుచుకున్నారు. మొత్తంగా ఈ సినిమా 7 ఆస్కార్ నామినేషన్లను దక్కించుకోవడమే కాకుండా, గోల్డెన్ గ్లోబ్, బాఫ్టా వంటి ప్రతిష్టాత్మక అవార్డులను కూడా కొల్లగొట్టింది. మార్టిన్ మెక్‌డొనాల్డ్ ఈ చిత్రాన్ని చాలా ఎమోషనల్ గా తెరకెక్కించారు. ఇది జియో హాట్ స్టార్, ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

అమెరికాలో ఉండే మిస్సౌరీలోని ఒక చిన్న ఊరిలో మిల్డ్రెడ్ అనే మహిళ ఉంటుంది. ఆమె కూతురు ఏడు నెలల క్రితం దారుణంగా హత్యకు గురవుతుంది. కానీ పోలీసులు గాలికి వదిలేశారని, అసలు నిందితుడిని పట్టుకోవడంలో ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని మిల్డ్రెడ్ తెగ ఫీలవుతుంది. దీంతో ఒకరోజు ఊరి చివర ఎవరూ పట్టించుకోని మూడు పాత బిల్‌బోర్డ్‌లను అద్దెకు తీసుకుంటుంది. వాటి మీద కొన్ని అక్షరాలు రాయించి నిరసన తెలుపుతుంది. ఈ బోర్డులు చూసి పోలీస్ చీఫ్ విలౌబీకి, ఆఫీసర్ డిక్సన్‌కు చిర్రెత్తుకొస్తుంది. ఊరి ప్రజలు కూడా మిల్డ్రెడ్‌ని తప్పుబడతారు. ఎందుకంటే విలౌబీకి క్యాన్సర్ ఉందని, ఆయన మంచివాడని అందరూ నమ్ముతారు.

కానీ మిల్డ్రెడ్ మాత్రం వెనక్కి తగ్గదు. నా కూతురు చనిపోయిన బాధ ముందు, నీ క్యాన్సర్ పెద్ద విషయం కాదని ముక్కుసూటిగా చెబుతుంది. విలౌబీ మర్యాదగా చెప్పినా వినదు, పైగా తనను అడ్డుకోవాలని చూసిన డిక్సన్ లాంటి వాళ్ళకి చుక్కలు చూపిస్తుంది. ఈ క్రమంలో ఆమె పోలీస్ స్టేషన్‌ మీద పెట్రోల్ బాంబు వేయడం వంటి సీన్లు మాస్ రేంజ్‌లో ఉంటాయి. కథలో ట్విస్ట్ ఏంటంటే.. చీఫ్ విలౌబీ అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంటాడు. ఆయన చనిపోతూ మిల్డ్రెడ్‌కు, డిక్సన్‌కు విడివిడిగా ఉత్తరాలు రాసి వెళ్తాడు. దీంతో కథ మరింత ఇంటెన్స్ గా మారుతుంది అసలు ఆ ఉత్తరాలలో ఏముంది ? కిల్లర్ ఎవరు ? పోలీసులు పట్టుకుంటారా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. .

Advertisement

Read Also : స్క్రీన్ ముందు నుంచి కదలనీకుండా చేసే నెట్ ఫ్లిక్స్ సిరీస్ లు… వీటిలో ఒక్కటి చూసినా బుర్ర కరాబ్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×