E-Paper
Advertisement

చదరంగం లాంటి మైండ్ గేమ్‌తో మాఫియా ముఠానే ముప్పుతిప్పలు పెట్టిన మేధావి… ఐయండిబిలో అదిరిపోయే రేటింగ్

చదరంగం లాంటి మైండ్ గేమ్‌తో మాఫియా ముఠానే ముప్పుతిప్పలు పెట్టిన మేధావి… ఐయండిబిలో అదిరిపోయే రేటింగ్
Advertisement

Crime Thriller OTT : ఎక్కడ చూసినా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. కంటెంట్ కొంచెం కొత్తగా, ఆకట్టుకునేలా ఉంటే మాత్రం ఈ సినిమాలు కాసుల వర్షం కూడా కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఒక హాలీవుడ్ సినిమా గురించి చెప్పుకోవాల్సిందే. దీనికి ఐయండిబిలో 7.2 రేటింగ్ కూడా ఉంది. సినిమా మొత్తం ఒకే ఒక టైలర్ షాపులో జరుగుతుంది. కెమెరా ఎక్కడా బయట ప్రపంచాన్ని చూపించదు. కేవలం పాత్రల నటన, డైలాగులతోనే సినిమాను ఉత్కంఠభరితంగా నడిపించారు. అయితే ఈ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి కూడా. ఈ సినిమా అదిరిపోయే గ్యాంగ్ వార్, ఊహించని క్లైమాక్స్ తో ఆడియన్స్ కి కావాల్సినంత థ్రిల్ ఇస్తుంది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

2022లో వచ్చిన ఈ అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ది అవుట్‌ఫిట్’ (The Outfit). ఈ సినిమాకు గ్రాహం మూర్ దర్శకత్వం వహించారు. ఈయన గతంలో ‘ది ఇమిటేషన్ గేమ్’ (The Imitation Game) సినిమాకు ఆస్కార్ అవార్డు అందుకున్న గొప్ప రైటర్. ఇది ఆయన డైరెక్ట్ చేసిన మొదటి సినిమా కావడం విశేషం. ఇక మార్క్ రైలాన్స్ ఇందులో లియోనార్డ్ అనే టైలర్ పాత్రను పోషించారు. ఈ సినిమాలో ఆయన టైలర్ పాత్ర కోసం నిజంగానే లండన్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. అంటే కోటు ఎలా కట్ చేయాలి, కుట్టాలి అనేది ఆయన స్వయంగా నేర్చుకుని సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం Netflix, Amazon Prime Video లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ అంతా చికాగోలో ఉన్న ఒక పాత కాలపు టైలర్ షాప్ లో జరుగుతుంది. ఈ షాపు ఓనర్ పేరు లియోనార్డ్. ఇతను ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతాడు. చాలా సాఫ్ట్ మనిషి, కానీ ఇతని దగ్గరికి వచ్చే కస్టమర్లు మాత్రం మామూలోళ్లు కాదు, సిటీలో ఉన్న పెద్ద పెద్ద రౌడీ గ్యాంగ్‌లు. వాళ్లకి ఖరీదైన సూట్లు కుట్టడమే ఇతని పని. వాళ్ళు కొట్టు వెనకాల ఒక డబ్బా పెట్టుకుని, అందులో సీక్రెట్ గా ఉత్తరాలు మార్చుకుంటూ ఉంటారు. ఇదంతా తెలిసినా లియోనార్డ్ తన పని తను చేసుకుంటూ సైలెంట్‌గా ఉంటాడు.

అసలు గొడవ ఒక రాత్రి మొదలవుతుంది. గ్యాంగ్ లీడర్ కొడుకు రిచీ, ఇంకో రౌడీ లాలీ కలిసి ఒక బాక్సుతో కొట్టులోకి వస్తారు. రిచీకి కడుపులో తూటా తగిలి ఉంటుంది. వాళ్ళు తెచ్చిన బాక్సులో ఒక రికార్డింగ్ టేప్ ఉంటుంది, అందులో వాళ్ల గ్యాంగ్‌లో ఉన్న కోవర్ట్ ఎవరో తెలుస్తుందని వాళ్ళ నమ్మకం. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు లియోనార్డ్ కొట్టులో దాక్కుంటారు. చావబోతున్న రిచీకి లియోనార్డ్ సూది, దారం ఉపయోగించి కుట్లు వేసి బతికిస్తాడు. కానీ అప్పుడే వాళ్ల మధ్యన అనుమానాలు మొదలవుతాయి.

Advertisement

రాత్రి గడిచేకొద్దీ షాపులోకి గ్యాంగ్ బాస్, ఇతర రౌడీలు కూడా వస్తారు. ఒకరిని ఒకరు చంపుకోవడానికి సిద్ధమవుతారు. అయితే ఆ అమాయకపు టైలర్ అనుకున్న లియోనార్డ్ మామూలోడు కాదని అప్పుడు తెలుస్తుంది. తన తెలివితేటలతో ఆ రెండు గ్యాంగ్‌ల మధ్య చిచ్చు పెట్టి, ఒకరి మీద ఒకరికి అనుమానం కలిగేలా చేసి వాళ్లని వాళ్లే చంపుకునేలా చేస్తాడు. ఈ క్లైమాక్స్ కూడా చాలా క్రేజీ గా ఉంటుంది. అసలు లియోనార్డ్ ఎవరు ? అతని గతం ఏమిటి ? ఎందుకు ఈ గ్యాంగ్ లను అంతం చేయాలని అనుకున్నాడు. అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ప్రశాంత జీవితాన్ని తలకిందులు చేసిన హత్య… ప్రతి ఎపిసోడ్ లో ఒక కొత్త మలుపు… ఊహకు అందని క్లైమాక్స్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×