E-Paper
Advertisement

Crime thriller OTT: కిల్లర్ రివేంజ్… ఒక్కో మర్డర్ ఊర మాస్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్

Crime thriller OTT: కిల్లర్ రివేంజ్… ఒక్కో మర్డర్ ఊర మాస్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్
Advertisement

Crime thriller OTT : ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూడాలనుకుంటే, ఇప్పుడు మనం చప్పుకోబోయే సినిమాను చూడవచ్చు. ఇది చాలా స్టైలిష్ గా కూడా ఉంటుంది. ఎక్కువ వయలెన్స్ లేకుండా టెన్షన్ బిల్డ్ చేస్తుంది. మొత్తానికి ఇది ఆస్కార్ వంటి ప్రధాన అవార్డులను గెలవకపోయినా, ఇది  2023లో వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఒక ప్రొఫెషనల్ కిల్లర్ తన ప్రియురాలిని ప్రమాదంలో పడేసిన వాళ్ళపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేదే ఈ సినిమా కథ. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎక్కడ చూడవచ్చు అంటే

ఈ అమెరికన్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది కిల్లర్’ (The Killer). డేవిడ్ ఫించర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, అదే పేరుతో ఉన్న ఫ్రెంచ్ గ్రాఫిక్ నావెల్ ఆధారంగా రూపొందింది. ఇందులో ప్రధాన పాత్రలో మైఖేల్ ఫాస్‌బెండర్ నటించగా, టిల్డా స్వింటన్, చార్లెస్ పార్నెల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సుమారు 1 గంట 58 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 6.7/10 రేటింగ్ ను పొందింది. 

స్టోరీ ఏమిటంటే

Advertisement

పారిస్‌లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్‌ను చంపడానికి, ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఐదు రోజులుగా ఒక బిల్డింగ్‌లో కాచుకుని ఉంటాడు. సరైన సమయం చూసి షూట్ చేసినప్పుడు, అనుకోకుండా ఆ బుల్లెట్ టార్గెట్‌కు తగలకుండా పక్కనే ఉన్న వేరే వ్యక్తికి తగులుతుంది. తన కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా ఒక పెద్ద పొరపాటు జరుగుతుంది. దీంతో కిల్లర్ వెంటనే అక్కడి నుండి తప్పించుకుంటాడు.  ఇక అతను తన ఇంటికి వెళ్లేసరికి, అతని ప్రియురాలు మాగ్డాలాపై ఎవరో దాడి చేసి చంపడానికి ప్రయత్నించారని తెలుస్తుంది.

తన మిషన్ ఫెయిల్ అయినందుకు, తనను చంపడానికి తన బాస్ హంతకులను పంపాడని అతనికి ఇప్పుడు అర్థమవుతుంది. దాంతో తన వాళ్లను తాకిన ప్రతి ఒక్కరినీ అంతం చేయాలని నిర్ణయించుకుంటాడు కిల్లర్ . అలా ఒక్కొక్కరిని వేటాడటం మొదలు పెడతాడు. చివరికి ఈ వేట ఎలా జరుగుతుంది ? కిల్లర్ రివేంజ్ పూర్తి అవుతుందా ? అనే విషయాలను, ఈ అమెరికన్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుడుకోండి.

Advertisement

Read Also :  దృశ్యం సినిమాను తలపించే తమిళ మూవీ… కూతురు లాంటి అమ్మాయితోనే ఆ పని… మతిపోగోట్టే సస్పెన్స్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×