E-Paper
Advertisement

Crime Thriller Series : డ్రమ్‌లో డెడ్ బాడీ… ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ క్రైమ్ థ్రిల్లర్

Crime Thriller Series : డ్రమ్‌లో డెడ్ బాడీ… ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller Series : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో టైటిల్ విన్నర్ అయిన నిఖిల్ మాలియక్కల్ ఇప్పుడు ఓటీటీ రంగంలో బిగ్ సర్ప్రైజ్ ఇస్తున్నాడు. అతను హీరోగా నటించిన కొత్త వెబ్ సిరీస్ పేరు ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ (Vikram On Duty). ఇది పూర్తి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్. ఇటీవల రిలీజ్ అయిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిఖిల్ ఈ సిరీస్‌లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో పనిచేసే డిఫరెంట్ స్టైల్ పోలీస్ అధికారి విక్రమ్ వాసు పాత్రలో కనిపిస్తున్నాడు.

ప్రోమోలో అదిరిపోయిన డైలాగ్స్

ప్రోమోలో నిఖిల్ లుక్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ స్టైల్ అన్నీ అదిరిపోయేలా ఉన్నాయి. ఒకవైపు సీరియస్‌గా కేసు గురించి మాట్లాడుతుంటే, మరోవైపు ఆటో డ్రైవర్‌తో బేరసారి చేస్తూ సైటెర్లు వేస్తున్నాడు. డ్రమ్‌లో బాడీ పెట్టారేంటీ, స్ట్రెచర్ రాలేదా? అని అడిగే సీన్, ‘సెల్యూట్ అయినా బుల్లెట్ అయినా అవసరం ఉన్నప్పుడే’ అనే డైలాగ్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ సిరీస్‌లో ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో క్రైమ్‌ను చూపిస్తారు. చిన్న చిన్న ఆధారాలతో విక్రమ్ ఎలా కేసులను సాల్వ్ చేస్తాడో చూడాల్సి ఉంటుంది. అషు రెడ్డి కీలక పాత్రలో నటిస్తోంది.

జియో హాట్‌స్టార్‌లో

Advertisement

ఈ సిరీస్‌ను జియో హాట్‌స్టార్‌ (jio hotstar)లో 2026 మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. OTTplay ప్రీమియం ద్వారా కూడా చూడవచ్చు. బిగ్ బాస్ తర్వాత నిఖిల్ మొదటిసారి ఇంత సీరియస్ పోలీస్ అవతారంలో కనిపిస్తున్నాడు. ప్రోమో చూస్తే యాక్షన్, సస్పెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ టాప్ క్లాస్‌గా ఉన్నాయి. బిగ్ బాస్ ఫ్యాన్స్‌కు ఇది బిగ్ ట్రీట్. నిఖిల్ ఈ సిరీస్ గురించి మాట్లాడుతూ .. ఇది నాకు చాలా కొత్త అనుభవం. విక్రమ్ వాసు పాత్రలో నేను చాలా ఎంజాయ్ చేశాను. ఒక్కో కేసు ఒక్కో రకంగా ఉంటుంది. ప్రేక్షకులు ఎప్పుడూ ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయి అని చెప్పాడు. మార్చి 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో అన్ని ఎపిసోడ్‌లు ఒకేసారి అందుబాటులో ఉంటాయి.

Read Also : మ్యూజిక్ రాపర్ అవ్వాలనుకునే పిజ్జా బాయ్… మాట్లాడే బాతుతో కష్టాలు… ప్రతి ఎపిసోడ్ సరదాగా

Advertisement

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×