E-Paper
Advertisement

అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ముగింపు వరకు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు

అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ముగింపు వరకు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు
Advertisement

Crime Thriller Series OTT : క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు ఇప్పుడు ఏ భాషలో చూసినా ట్రెండింగ్ లో ఉంటున్నాయి. సరికొత్త ట్విస్ట్లు, మలుపులతో ఇవి హోరెత్తిపోతున్నాయి. ఈ క్రమంలో ఒక థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో టాప్ లేపింది. మామూలు సినిమాల్లాగా హీరో ఫైట్లు చేయడం, హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవడం లాంటివి ఇందులో ఉండవు. ఇది న్యూయార్క్ నగరంలో ఒక యువకుడి జీవితం ఎలా తలకిందులైందో చూపించే ఒక థ్రిల్లర్. దర్యాప్తు పేరుతో పోలీసులు, కోర్టులు ఒక మనిషిని ఎలా పిప్పి చేస్తాయి అనేది చాలా సీరియస్‌గా, డార్క్ టోన్‌లో చూపిస్తారు. చూస్తున్నంత సేపు మనం కూడా ఆ జైల్లో ఉన్నామా అన్నంత భయం, టెన్షన్ కలుగుతాయి. మీరు సీరియస్ క్రైమ్ డ్రామాలు, ఇన్వెస్టిగేషన్ కథలను ఇష్టపడే వారైతే ఇది ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్. దీనికి ఐయండిబిలో 8.4 రేటింగ్ ఉందంటే స్టోరీలో ఎంత దమ్ము ఉందో తెలుసుకోవచ్చు.

జియో హాట్ స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్

2016లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘ది నైట్ ఆఫ్’ (The Night Of). ఇందులో రిజ్ అహ్మద్, జాన్ టర్టురో, బిల్ క్యాంప్, మైఖేల్ కెన్నెత్ విలియమ్స్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ కథ అసలు 2008లో వచ్చిన బ్రిటిష్ సిరీస్ ‘క్రిమినల్ జస్టిస్’ ఆధారంగా తయారైంది. నిజానికి ఇందులో లాయర్ పాత్రను ‘ది సోప్రానోస్’ ఫేమ్ జేమ్స్ గాండాల్ఫినీ చేయాలి, కానీ ఆయన అకస్మాత్తుగా చనిపోవడంతో ఆ ప్లేస్‌లోకి జాన్ టర్టురో వచ్చారు. అలాగే హీరో రిజ్ అహ్మద్ తన పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. అమాయకపు కుర్రాడిలా కనిపించడానికి బరువు తగ్గి, ఆ తర్వాత జైలు సీన్ల కోసం కండలు పెంచి తన బాడీని పూర్తిగా మార్చుకున్నాడు. ఈ సిరీస్ కేవలం కథతోనే కాకుండా టెక్నికల్ మార్కులతోనూ అదరగొట్టింది. ఇది మొత్తం 5 ఎమ్మీ అవార్డులను గెలుచుకుంది, ముఖ్యంగా రిజ్ అహ్మద్ ఈ అవార్డు అందుకున్న మొదటి ఆసియా/ముస్లిం నటుడిగా చరిత్ర సృష్టించాడు. 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ని ప్రస్తుతం JioHotstarలో చూడవచ్చు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

నాజ్ అనే ఒక కాలేజీ కుర్రాడు నైట్ పార్టీకి వెళ్దామని వాళ్ళ నాన్న ట్యాక్సీ వేసుకుని బయలుదేరుతాడు. దారిలో ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే, ఆమెతో కలిసి సరదాగా ఎంజాయ్ చేసి ఫుల్లుగా తాగి పడుకుంటాడు. తీరా తెల్లారి లేచి చూసేసరికి ఆ అమ్మాయి రక్తపు మడుగులో చచ్చిపోయి ఉంటుంది. భయపడిపోయి అక్కడి నుంచి పారిపోదామని చూసినా, దరిద్రం కొద్దీ పోలీసులకు అడ్డంగా బుక్కైపోతాడు నాజ్. ఇక పోలీసులు నాజ్ మీద కేసు వేసి జైల్లో పడేస్తారు. ఆ జైలు నరకం కంటే దారుణంగా ఉంటుంది. అక్కడ బతకడం కోసం నాజ్ మెల్లమెల్లగా ఒక మొండి గ్యాంగ్‌స్టర్‌లా తయారవ్వాల్సి వస్తుంది.

మరోవైపు బయట వాళ్ళ అమ్మానాన్నలు, వీడిని కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతుంటారు. ఆ సమయంలోనే ఒక పెద్ద లాయర్ నాజ్ కేసును తీసుకుంటాడు. కోర్టులో వాదోపవాదాలు నడుస్తున్నప్పుడు, ఆ అమ్మాయిని చంపింది అసలు నాజ్ కాదని, వేరే వాళ్ళే అని మెల్లగా నిజాలు బయటకు వస్తుంటాయి. కానీ ఈ గొడవ అంతా అయ్యేసరికి నాజ్ ఒకప్పటిలా ఉండడు. జైలు జీవితం అతన్ని పూర్తిగా మార్చేస్తుంది. చివరకు కేసు నుంచి నాజ్ బయటపడ్డాడా ? అసలు ఆ రాత్రి ఏం జరిగింది ? అనేది ఎంతో సస్పెన్స్‌గా సాగుతుంది.

Advertisement

Read Also : సైకో కిల్లర్ చేతిలో చిక్కుకున్న సైకాలజిస్ట్… 60 నిమిషాల డెడ్లైన్ తో అల్లకల్లోలం

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×