E-Paper
Advertisement

డ్రగ్ మాఫియాతో పెట్టుకునే లేడీ పోలీస్… ముగింపు వరకు ఊపిరి బిగబట్టించేలా సాగే మిస్టరీ

డ్రగ్ మాఫియాతో పెట్టుకునే లేడీ పోలీస్… ముగింపు వరకు ఊపిరి బిగబట్టించేలా సాగే మిస్టరీ
Advertisement

Crime Thriller Series on OTT : ఓటీటీలో ఒక హాలీవుడ్ అండర్‌కవర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కేక పెట్టిస్తోంది. ఇది మామూలు స్టోరీ కాదు వెన్నులో వణుకు పుట్టించే కథ. మనసుకు హత్తుకుంటూనే బుర్రకు కూడా పని పెట్టిస్తుంది ఈ సిరీస్. గత ఏడాది టాప్ ట్రెండింగ్ లో నిలిచిన సిరీస్ ఇది. ఇప్పటికీ ఓటీటీలో తెగ చూస్తున్నారు దీనిని. ఒక ట్రైనీ పోలీస్ అధికారిణి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆమె అతిపెద్ద డ్రగ్ డీలర్ ను పట్టుకోవడానికి ఒక అండర్‌కవర్ ఏజెంట్‌గా వెళ్తుంది. ఈ క్రమంలో స్టోరీ ఊహించని మలుపులు చివరిదాకా తిరుగుతుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ డేనిష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘ది అసెట్’ (The Asset). ఈ సిరీస్ ఒరిజినల్ పేరు ‘Legenden’ (లెజెండెన్). ఇది డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ నగరంతో పాటు వియత్నాం, రొమేనియా, లండన్ వంటి దేశాల్లో షూటింగ్ జరుపుకుంది. ఇందులో మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇది 2025, అక్టోబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో రిలీజ్ అయిన వారం రోజుల్లోనే, ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లో నంబర్ వన్ స్థానంలో నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం మొదటి వారంలోనే దాదాపు 11.3 మిలియన్ల వ్యూస్ సంపాదించి, యూరప్ నుండి వచ్చిన టాప్ క్రైమ్ డ్రామాల్లో ఒకటిగా నిలిచింది. దీని సక్సెస్‌ను చూసి నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే సీజన్ 2ని కూడా ఖరారు చేసింది. దీని షూటింగ్ 2026లో మొదలుపెట్టి, 2027 నాటికి కొత్త ఎపిసోడ్లను రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సిరీస్ లో క్లారా డెస్సౌ (టీ లిండ్), మరియా కోర్డ్సెన్ (యాష్లే), అఫ్షిన్ ఫిరూజీ (మిరాన్) ప్రధాన పాత్రల్లో నటించారు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

టీ లిండ్ అనే ఒక అమ్మాయి పోలీస్ ట్రైనింగ్‌ కి వస్తుంది. అయితే ఆమె సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదని, డిపార్ట్‌మెంట్‌ నుంచి పంపించేద్దాం అనుకుంటారు. కానీ ఆఖరి ఛాన్స్‌గా ఆమెకి ఒక డేంజర్ ఆపరేషన్ ఇస్తారు. సిటీలో పెద్ద డ్రగ్ డాన్ అయిన మిరాన్ ను పట్టుకోవడానికి ఈమెను అండర్‌కవర్ ఏజెంట్‌గా పంపిస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా ఒక రిచ్ జ్యువెలరీ బిజినెస్ చేసే అమ్మాయిలా బిల్డప్ ఇచ్చి, ఆ గ్యాంగ్‌లోకి వీళ్లేలా ప్లాన్ చేస్తారు. ఇప్పుడు టీ లిండ్ ఎలాగోలా కష్టపడి ఆ డ్రగ్ డాన్ గర్ల్‌ఫ్రెండ్ యాష్లేతో ఫ్రెండ్ షిప్ చేస్తుంది. ఇద్దరూ బాగా క్లోజ్ అయిపోతారు కూడా. ఇప్పుడు ఆ డాన్ చేసే దందాలన్నీ ఎలా జరుగుతాయో లోపలి నుంచి ఉండి కనిపెడుతూ, ఎప్పటికప్పుడు పోలీసులకు చెప్తూ ఉంటుంది.

అయితే అదే టైంలో ఆ గ్యాంగ్ ఎంత క్రూరంగా ఉంటుందో చూసి టీ లిండ్ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కథ ముదురుతున్న కొద్దీ టీ లిండ్‌కి ఒక తిరకాసు ఎదురవుతుంది. తన ఫ్రెండ్ యాష్లేకి, ఆమె చిన్న కూతురికి ఆ డ్రగ్ డాన్ వల్ల ప్రాణాపాయం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు తన డ్యూటీ చేసి ఆ గ్యాంగ్‌ను పట్టించాలా? లేక తనని నమ్మిన ఫ్రెండ్‌ను కాపాడాలా? అనే డైలమాలో ఆమె పడిపోతుంది. రిస్క్ చేసి వాళ్లను కాపాడబోతే తన పోలీస్ ఆపరేషన్ మొత్తం అడ్డం తిరుగుతుంది. ఈ గందరగోళం మధ్య ఆ పోలీస్ పిల్ల ఎలా నెగ్గుకొచ్చిందనేదే సిరీస్ క్లైమాక్స్.

Advertisement

Read Also : కుర్రాడితో ప్రేమలో పడే స్కూల్ హెడ్‌ మిస్ట్రెస్… ఆకట్టుకునే రొమాంటిక్ కామెడీ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×