E-Paper
Advertisement

Crime Thriller Series OTT: పోలీస్ చేతిలో నలిగిపోయే మహిళ… ఒంట్లో వణుకు పుట్టించే రివేంజ్

Crime Thriller Series OTT: పోలీస్ చేతిలో నలిగిపోయే మహిళ… ఒంట్లో వణుకు పుట్టించే రివేంజ్
Advertisement

Crime Thriller Series OTT : ఇప్పుడు ఎక్కడ చూసినా థ్రిల్లర్ కంటెంట్ నే ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అయితే వీటిలో కూడా కొన్ని వెబ్ సిరీస్ లు ఘోరమైన రక్తపాతంతో నడుస్తున్నాయి. హింస కూడా ఎక్కువగా ఉండటంతో ఈ సిరీస్ లు పెద్దలకు మాత్రమే అన్నట్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక తెలుగు థ్రిల్లర్ సిరీస్, ఒళ్ళు జలదరించే కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ప్రతి ఎపిసోడ్ లో రక్తం ఏరులై పారుతుంది. మదనపల్లె నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్, ఒక తల్లి ఆమె ముగ్గురు పిల్లల చుట్టూ తిరుగుతుంది. ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్.

జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో స్ట్రీమింగ్

ఈ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘సైతాన్’ (Shaitan). ‘యాత్ర’, ‘ఆనందో బ్రహ్మ’ వంటి చిత్రాలను తెరకెక్కించిన మహి వి రాఘవ్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో 2023 జూన్ 15 నుంచి స్ట్రీమింగ్ లో ఉంది. ఇందులో రిషి (బాలి పాత్రలో), షెల్లీ కిషోర్ (సావిత్రి పాత్రలో), దేవయాని శర్మ (జయప్రద పాత్రలో), జాఫర్ సాదిక్ (గుమ్తి పాత్రలో), రవి కాలే (నాగిరెడ్డి పాత్రలో) నటించారు. ఇందులో మొత్తం 9 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇది అత్యంత హింసతో, బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ‘ఎ’ రేటెడ్ సిరీస్ కూడా.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మదనపల్లె దగ్గర ఒక ఊర్లో సావిత్రి అనే ఒక ఇల్లాలు ఉంటుంది. ఆమెకు మొగుడు లేకపోయినా, తన ముగ్గురు పిల్లల్ని (బాలి, గుమ్తి, జయప్రద) చాకడానికి పడరాని పాట్లు పడుతుంటుంది. కానీ ఆ ఊర్లో ఉండే ఒక కంత్రీ పోలీసోడు వీళ్ళని పీడిస్తూ ఉంటాడు. సావిత్రిని వాడుకుంటూ, కూతురు మీద కూడా కన్నేస్తాడు. వాడు పెట్టే నరకం చూడలేక, ఒకరోజు ఆ పోలీసోడిని సావిత్రి పెద్ద కొడుకు బాలి గొడ్డలితో నరికి పాతేస్తాడు. అక్కడి నుంచే వీళ్ళ అసలు వేట మొదలౌతుంది. పోలీసోడిని చంపేశాక బాలి అయితే వెనక్కి తగ్గడు. బతకాలంటే ఎదురు తిరగడమే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతాడు. వాడికి తోడుగా తమ్ముడు, చెల్లెలు కూడా తోడవుతారు. ఊర్లో ఉండే అరాచక శక్తులతో వీళ్లు యుద్ధం మొదలుపెడతారు.

దెబ్బకు దెబ్బ అన్నట్లు చంపుకుంటూ పోతుంటే, పోలీసులకి వీళ్లు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అయిపోతారు. ఆ క్రమంలోనే అడవిలో ఉండే నక్సలైట్లతో కలిసి గవర్నమెంట్ తోనే యుద్ధానికి దిగుతారు. కథ మొత్తం రక్తం ఏరులై పారుతుంది. బయటి ప్రపంచానికి వీళ్లు సైతాన్లలా కనిపిస్తారు కానీ, వాళ్ల దృష్టిలో అది కేవలం తమ ఫ్యామిలీని కాపాడుకోవడానికి చేసిన పోరాటం. ఎవరినీ నమ్మకుండా, ఎవడు ఎదురొచ్చినా నరుక్కుంటూ పోయే బాలి అండ్ గ్యాంగ్ ప్రయాణం ఎక్కడ ఆగిందో తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

Advertisement

Read Also : టీనేజ్ వయసులో ప్రేమ…10 ఏళ్ల తర్వాత షాకింగ్ ట్విస్టులు… లవర్స్ చూడాల్సిన స్టోరీ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×