E-Paper
Advertisement

తండ్రి హత్యకు కొడుకు తీర్చుకున్న పగ… ఓటీటీలోకి ఇంటెన్సివ్ హిందీ క్రైమ్ డ్రామా

తండ్రి హత్యకు కొడుకు తీర్చుకున్న పగ… ఓటీటీలోకి ఇంటెన్సివ్ హిందీ క్రైమ్ డ్రామా
Advertisement

Crime Thriller Series OTT : కుల వివక్ష, అణచివేత, అధికార అహంకారం వంటివి ఓ మనిషిని ఎంత ప్రమాదకరమైన ప్రతీకార యంత్రంగా మార్చగలవో కళ్ళకు కట్టినట్టు చూపించిన సరికొత్త హిందీ వెబ్ సిరీస్ ‘సత్రంగి: బద్లే కా ఖేల్ (Satrangi: Badle Ka Khel)’. ఈ రివేంజ్ డ్రామాను చూశాక రక్తం ఉడికిపోద్ది ఎవ్వరికైనా. అన్యాయం జరిగితే ఇలాగే పగ తీర్చుకోవాలి అని అన్పించకమానదు. మరి ఈ సిరీస్ ని ఎక్కడ చుడొచ్చో తెలుసుకుందాం పదండి.

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

ఓటీటీ ప్రపంచంలో ఇప్పటికే ‘జామ్‌తారా’, ‘గ్రహణ్’ లాంటి కంటెంట్ బేస్డ్ సిరీస్‌లతో పాపులర్ అయ్యారు అన్షుమాన్ పుష్కర్. అయితే ఆయన ఈసారి భిన్నమైన పాత్రతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. జై బసంతు సింగ్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ‘సత్రంగి: బద్లే కా ఖేల్’. ఆయన దీన్ని రివేంజ్ డ్రామాగా మాత్రమే కాకుండా, సమాజంలో అట్టడుగు వర్గాలుగా మిగిలిపోయిన కళాకారుల బాధను కూడా ఈ సిరీస్ లో ఆవిష్కరించారు. ప్రస్తుతం ‘సత్రంగి: బద్లే కా ఖేల్’ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5 లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. మే 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సిరీస్‌ మొత్తం ఏడు ఎపిసోడ్‌లుగా సాగుతుంది. ఒక్కో ఎపిసోడ్ 35 నుంచి 40 నిమిషాల నిడివితో ఉత్కంఠభరితంగా రన్ అవుతుంది. హిందీ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌లో మాత్రమే ఈ సిరీస్ ఇప్పుడు అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే…

Advertisement

ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రాంతాల్లో చాలా కాలంగా కొనసాగుతున్న ‘లౌండా నాచ్’ అనే జానపద కళను ఇందులో ప్రధానంగా చూపించారు. మహిళల వేషధారణలో పురుషులు నృత్యాలు చేసే కళ ఇది. దీన్ని అక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు జనాలు. అయితే ఆ డ్యాన్సులు చేసే కళాకారుల జీవితాలకు మాత్రం గౌరవం ఇవ్వరు. ఈ లైన్ ను బేస్ గా చేసుకుని, ఈ సిరీస్ స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరేక్కించారు. కథలోకి వెళ్తే… బబ్లూ మహ్తో అనే యువకుడు పెద్ద అధికారి అయ్యి, తన జీవితాన్ని మార్చుకోవాలని కలలు కంటాడు. యూపీఎస్సీ పరీక్షల కోసం రాత్రింబవళ్లు తేడా లేకుండా చదువుతూ ఉంటాడు. కానీ అతని తండ్రి లౌండా నాచ్ కళాకారుడు కావడమే అతనికి శాపం అవుతుంది. అందరూ వాళ్ళను చిన్నచూపు చూస్తారు.

ఊర్లో బాగా పలుకుబడి ఉన్న సింగ్ కుటుంబం బబ్లూ తండ్రిని దారుణంగా చంపిస్తుంది. ఇక్కడే కథ అసలు మలుపు తిరుగుతుంది. తండ్రి మర్డర్ తో బబ్లూ ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలుతుంది. ఆ నిమిషమే అతనిలోని విద్యార్థి చనిపోయి, ప్రతీకారం కోసం రగిలిపోయే మరో మనిషి పుడతాడు. తండ్రి నడిచిన అదే లౌండా నాచ్ దారిలోకి వెళ్లి పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. శత్రువుల బలహీనతలను అర్థం చేసుకుంటూ, మైండ్ గేమ్‌తో ఒక్కొక్కరిని చంపుతాడు. మరి చివరికి బబ్లూ ప్రతీకారం తీరిందా ? అసలు బబ్లూ తండ్రిని సింగ్ ఫ్యామిలీ ఎందుకు చంపింది ? అన్నది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

Advertisement

Read Also : 10 కేసులు గెలవమని కూతురికి తండ్రి సవాల్… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న లీగల్ డ్రామా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×