// // Crime thriller series OTT: వేశ్యల దుకాణంలో మెంటలెక్కించే మర్డర్లు -->
E-Paper
Advertisement

Crime thriller series OTT: వేశ్యల దుకాణంలో మెంటలెక్కించే మర్డర్లు … ఓటీటీలో టాప్ లేపుతున్న సిరీస్

Crime thriller series OTT: వేశ్యల దుకాణంలో మెంటలెక్కించే మర్డర్లు … ఓటీటీలో టాప్ లేపుతున్న  సిరీస్
Advertisement

Crime thriller series OTT: అబ్బాయిలే కాదు, అమ్మాయిలు చేసే అరాచకాలకు కూడా ఒళ్లు జలదరిస్తుంటుంది. సైకోలకు మించిన హింసను ఒక వెబ్ సిరీస్ రూపంలో తీసుకొచ్చారు. ఇది 1960ల కాలంలో మెక్సికోలో జరిగిన ఒక యధార్థ గాథ. ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి మెక్సికోలో వేశ్యా గృహంలో చేసిన దారుణాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వీళ్ళని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మహిళా సీరియల్ కిల్లర్స్ గా కూడా చెప్పుకుంటారు. చూస్తే అమ్మాయిలు కూడా ఇంత దారుణంగా ఉంటారా ? అనిపిస్తుంది. మరి ఈ సిరీస్ ని చూడాలనుకుంటే, ఓటీటీలో అందుబాటులో ఉంది. ఎక్కడ చూడచ్చు ? దీని పేరు ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

ఈ మెక్సికన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ది డెడ్ గర్ల్స్’ (The Dead Girls). ఇది 1977లో జార్జ్ ఇబార్గుయెంగోయిటియా రాసిన నవల ఆధారంగా రూపొందింది. 6 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ ను లూయిస్ ఎస్ట్రాడా డైరెక్ట్ చేశారు. 2025 సెప్టెంబర్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఆర్సెలియా రామిరేజ్, పౌలినా గైటాన్ ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అర్కాంగేలా, సెరాఫినా అనే ఇద్దరు సిస్టర్స్ ఒక వేశ్యా వాటికను నడుపుతుంటారు. మొదట్లో వ్యాపారం లాగా మొదలైన ఇది, మెల్లమెల్లగా అరాచకంగా మారుతుంది. వీళ్ళకి రాజకీయ నాయకులు కూడా తోడవ్వడంతో ఆగడాలకు అడ్డులేకుండా పోతుంది. తమ దగ్గర పని చేసే అమ్మాయిలను చిత్రహింసలు పెట్టడం, ఎవరైనా ఎదురుతిరిగితే చంపేసి పాతిపెట్టడం వంటివి చేస్తారు కూడా. పని ఇప్పిస్తామని నమ్మించి 12 నుండి 15 ఏళ్ల వయసున్న తీసుకొచ్చి, వాళ్ళని బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టేవారు. కేవలం క్రైమ్ మాత్రమే కాకుండా, ఆ కాలంలో ఉన్న అవినీతిని కూడా ఈ సిరీస్ డార్క్ కామెడీ స్టైల్‌లో చూపిస్తుంది.

చివరకు ఒక అమ్మాయి అక్కడి నుండి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆ అక్కా చెల్లెళ్ల అసలు రంగు బయటపడుతుంది. పోలీసులు ఆ ఇంటిని సోదా చేసినప్పుడు బయటపడ్డ శవాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తాయి. సుమారు 150 మంది వరకు వీళ్ళ చేతుల్లో హత్యకు గురయ్యారని అంచనా కూడా ఉంది. చివరికి వాళ్ళు జీవితాంతం జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఇది అధికార దాహం మనుషులను ఎంతటి నీచానికి దిగజారుస్తుందో చూపించే ఒక సీరియస్ క్రైమ్ థ్రిల్లర్.

Advertisement

Read Also : ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీలోకి రానున్న మోస్ట్ అవైటింగ్ మూవీస్ ఇవే… అక్యూస్డ్ నుండి ది కేరళ స్టోరీ 2 వరకు

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×