E-Paper
Advertisement

Crime Thriller OTT : తల్లీ కూతుర్లతో డెడ్లీ డెత్ గేమ్… సొంతింట్లోనే ఒళ్లు గగుర్పొడిచే సంఘటనలు… మగదిక్కు లేనింట్లో మతిపోగొట్టే క్రైమ్

Crime Thriller OTT : తల్లీ కూతుర్లతో డెడ్లీ డెత్ గేమ్… సొంతింట్లోనే ఒళ్లు గగుర్పొడిచే సంఘటనలు… మగదిక్కు లేనింట్లో మతిపోగొట్టే క్రైమ్
Advertisement

Crime Thriller OTT : కొత్త ఇల్లు అనేది ఎన్నో కోట్లమంది కల. ప్రతీ ఒక్కరూ తమకంటూ ఒక ఇల్లు ఉండాలని, అందులో ఫ్యామిలీ అంతా కలిసి సంతోషంగా, సేఫ్ గా ఉండాలని కోరుకుంటారు. కానీ ఆ ఇళ్లే ప్రాణాలు తీసేంత డేంజర్ గా మారితే? ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో రూపొందిన మూవీనే ఈ రోజు మన మూవీ సజెషన్. మరి ఆ మూవీ పేరేంటి? స్టోరీ ఏంటి? అనేది తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2002లో వచ్చిన అమెరికన్ థ్రిల్లర్ మూవీ పానిక్ రూమ్ (Panic Room). పేరులోనే భయం ఉన్న ఈ మూవీని డేవిడ్ ఫించర్ (ఫైట్ క్లబ్, సెవెన్ ఫేమ్) డైరెక్ట్ చేశాడు. హోమ్ ఇన్వేషన్ చుట్టూ తిరిగే ఇంటెన్స్ సస్పెన్స్ స్టోరీ ఇది. 1 గంట 52 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ వయలెన్స్, లాంగ్వేజ్ వల్ల పెద్దలకు మాత్రమే. క్రిటిక్స్ నుండి మంచి రివ్యూస్ అందుకున్న ఈ మూవీలో టెన్షన్ పుట్టించే సీన్లు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ మెంబర్‌షిప్ ఉంటే ఫ్రీగా చూడొచ్చు.

Advertisement

మెయిన్ లీడ్‌ గా జోడీ ఫాస్టర్ (మెగ్ ఆల్ట్‌మన్ పాత్రలో), ఫారెస్ట్ విటేకర్ (బర్న్‌హామ్), జారెడ్ లెటో (జూనియర్), డ్వైట్ యోకమ్ (రౌల్), యంగ్ క్రిస్టెన్ స్టీవర్ట్ (సారా ఆల్ట్‌మన్ – ఆమె పోషించిన బిగ్ రోల్స్‌లో ఒకటి) నటించారు. ఇందులో జోడీ ఫాస్టర్ పెర్ఫార్మెన్స్ సూపర్. ఫించర్ డైరెక్షన్‌లో టెన్షన్ బాగా క్రియేట్ చేశాడు. ‘పానిక్ రూమ్’ ఒక క్లాసిక్ థ్రిల్లర్. ఒకే లొకేషన్‌లో జరిగే స్టోరీ కానీ టెన్షన్ ఎప్పుడూ డ్రాప్ కాదు. ఫించర్ కెమెరా వర్క్, సౌండ్ డిజైన్ అద్భుతం. థ్రిల్లర్ లవర్స్‌ మస్ట్ వాచ్ మూవీ. కానీ ఇంటెన్స్ సీన్స్ ఉన్నాయి. రాత్రిపూట చూస్తే వణుకు గ్యారంటీ.

Read Also :  ఏం సినిమా గురూ… క్షణక్షణం ఉత్కంఠ… అమ్మాయిలని వాడుకుని బ్రూటల్ మర్డర్స్… సైకోకి చెమటలు పట్టించే హీరో

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

కథ మొత్తం న్యూయార్క్‌ లో జరుగుతుంది. ఇటీవల డివోర్స్ అయిన మెగ్ ఆల్ట్‌మన్ (జోడీ ఫాస్టర్), ఆమె డాటర్ సారా (క్రిస్టెన్ స్టీవర్ట్) కొత్త బ్రౌన్‌స్టోన్ హౌస్‌లోకి మారతారు. సారా డయాబెటిక్ పేషెంట్. ఆ ఇంట్లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే… స్టీల్ డోర్‌తో ఉన్న పానిక్ రూమ్ (సేఫ్ రూమ్). తల్లీకూతుర్లు ఆ ఇంట్లో అడుగు పెట్టిన మొదటి రాత్రే ముగ్గురు దొంగలు (ఫారెస్ట్ విటేకర్, జారెడ్ లెటో, డ్వైట్ యోకమ్) చొరబడతారు. ఇంటి మునుపటి ఓనర్ హిడెన్ ట్రెజర్ ను దోచుకోవడానికి వాళ్ళు అక్కడికి వెళతారు. దొంగల ఎంట్రీ గురించి తెలుసుకున్న మెగ్, సారా పానిక్ రూమ్‌ లోకి పారిపోతారు. కానీ దొంగలు కోరుకున్నది ఆ రూమ్‌లోనే ఉంటుంది. ఇక అక్కడి నుండి టామ్ అండ్ జెర్రీ గేమ్ స్టార్ట్. రూమ్‌లో ఆక్సిజన్, లిమిటెడ్ ఫుడ్, సారాకి ఇన్సులిన్ అవసరం… ఇలా ఒక్కో ట్విస్ట్స్ స్టార్ట్ అవుతుంది. చివరికి ఎలా ఎస్కేప్ అవుతారు అనేది క్లైమాక్స్. అది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×