E-Paper
Advertisement

Crime Thriller OTT : ఏడాది తరువాత ఓటీటీలోకి చైనీస్ క్రైమ్ థ్రిల్లర్… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Crime Thriller OTT : ఏడాది తరువాత ఓటీటీలోకి చైనీస్ క్రైమ్ థ్రిల్లర్… స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

Crime Thriller OTT : చైనీస్ యాక్షన్-క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. The Grey Men 2 ఇండియాలో OTTలోకి రాబోతోంది. 2024లో వచ్చిన మొదటి పార్ట్ సీక్వెల్ ఇది. మరి ఈ సీక్వెల్ ను ఎక్కడ చూడవచ్చు? స్ట్రీమింగ్ డేట్ ఏంటి? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏడాది తరువాత ఓటీటీలోకి

ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌తో పాటు హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్ ఉన్న ఈ మూవీ చైనీస్ మాఫియా వరల్డ్‌లోకి ఆడియన్స్ ను తీసుకెళ్తుంది. చైనాలో జనవరి 2025లో డైరెక్ట్ డిజిటల్ ప్రీమియర్ అయిన ఈ మూవీ థియేటర్స్ స్కిప్ చేసి వచ్చింది. ఇప్పుడు ఇండియాలో కూడా ప్యూర్ ఓటీటీ రిలీజ్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకోనుంది. ఈ సీక్వెల్ Vrott అనే ఓటేటీ ప్లాట్‌ఫామ్‌లో 2026 మార్చి 20 నుంచి అందుబాటులో ఉంటుంది. కాబట్టి మొదటి పార్ట్ ఇంకా చూడనివాళ్లు ముందు అది చూసి సీక్వెల్‌కి రెడీ అవ్వండి. థ్రిల్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ.

Advertisement

ఇక ఇందులో కాస్ట్‌లో ఆండీ ఆన్ జెంగ్ జా (అండర్‌కవర్ కాప్) పాత్రలో మెయిన్ లీడ్‌గా కన్పిస్తాడు. మొదటి పార్ట్‌లో ఆండీ ఆన్ టియాన్ గే పాత్రలో నటించాడు. సీక్వెల్‌లో కొత్త క్యారెక్టర్ జెంగ్ జా అయినప్పటికీ స్టోరీ డైరెక్ట్‌గా కనెక్ట్ అవుతుంది. ఎరిక్ ట్సాంగ్ సాంగ్ బాంగ్ (ట్రైయడ్ బాస్) పాత్రలో కనిపిస్తాడు. లెని లాన్ పానా పాత్రలో, జిరో వాంగ్ సు వాన్ పాత్రలో, బెన్ యూన్ రాన్ పాత్రలో ఉంటారు. సపోర్టింగ్ రోల్స్‌లో జాజ్ లామ్, కీత్ ఎన్‌జీ కనిపిస్తారు. డైరెక్టర్ యి హువాంగ్ దీనికి దర్శకత్వం వహించారు.

కథలోకి వెళ్తే…

స్టోరీ మొదటి పార్ట్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. అండర్‌కవర్ కాప్ ట్రైయడ్ మాఫియా గ్యాంగ్‌లోకి ఇన్‌ఫిల్ట్రేట్ అయ్యే లైన్‌లో సాగుతుంది. ట్రైయడ్ బాస్ సాంగ్ బాంగ్ తన క్రిమినల్ ఇమేజ్‌ను క్లీన్ చేసి, లైకా సిటీ మేయర్ సీట్ గెలవాలని ప్లాన్ చేస్తాడు. కరప్ట్ అధికారులతో కలిసి అందుకోసం పని చేస్తాడు. కానీ భారీ ఫండింగ్ షార్టేజ్ ఎదురవుతుంది. డబ్బు సేకరించేందుకు గ్యాంగ్ ఎక్స్‌ట్రీమ్ వయోలెంట్ క్రైమ్స్‌కు దిగుతుంది. పోలీసులు జెంగ్ జా అనే అండర్‌ కవర్ ఆఫీసర్‌ ను గ్యాంగ్‌ లోకి పంపుతారు. సాంగ్ బాంగ్ తన లక్ష్యానికి దగ్గర పడుతున్నప్పుడు హిడెన్ రివెంజ్ కోసం వెయిట్ చేస్తున్న ఇతర పార్టీలు కనిపిస్తాయి. ఇంటర్నల్ బ్యాక్‌స్టాబ్బింగ్, షిఫ్టింగ్ లాయల్టీలు, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో మూవీ గ్రిప్పింగ్‌గా సాగుతుంది. మరి గ్యాంగ్ లోకి అడుగు పెట్టిన పోలీస్ అనుకున్న పనిని సక్సెస్ ఫుల్ గా చేయగలిగాడా ? అన్నది తెరపై చూడాల్సిందే.

Advertisement

Read Also : ఒకరికి తెలీకుండా మరొకరితో… ఈ ఆటగాడి వేషాలకి ఆస్కార్ ఇవ్వాల్సిందే

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×