// // Crime Thriller OTT : ఇక్కడ సాంప్రదాయం చీర కట్టిందంటే చావే -->
E-Paper
Advertisement

Crime Thriller OTT : ఇక్కడ సాంప్రదాయం చీర కట్టిందంటే చావే… ఒక్కోటి మైండ్ బెండింగ్ ట్విస్ట్ మావా

Crime Thriller OTT : ఇక్కడ సాంప్రదాయం చీర కట్టిందంటే చావే… ఒక్కోటి మైండ్ బెండింగ్ ట్విస్ట్ మావా
Advertisement

Crime Thriller OTT : క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు ఇచ్చే కిక్కు అంతా ఇంతా కాదు. ఒక్కసారి కూర్చున్నామంటే ఎండ్ కార్డు పడే వరకూ కంటి రెప్ప వాల్చకుండా చేసే సిరీస్ లు ఇటీవల కాలంలో చాలానే వచ్చాయి. అందులో ఒకటే ఈరోజు మన మూవీ సజెషన్. ఈ సిరీస్ లో అందరూ అమ్మాయిలే ఉంటారు. కానీ వాళ్ళు చేసే పనులు చూస్తే దిమాక్ కరాబ్ కాక తప్పదు. మరి అంత ఆసక్తికరంగా ఉండే ఆ సిరీస్ పేరేంటి ? ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏంటి? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

2023లో విడుదలైన భిన్నమైన హిందీ వెబ్ సిరీస్ ‘సాస్ బహు ఔర్ ఫ్లెమింగో’ (Saas Bahu Aur Flamingo). ఇది సాంప్రదాయ అత్తాకోడళ్ళ డ్రామాల నిర్వచనాన్ని తారుమారు చేసిందనే చెప్పాలి. సాధారణంగా ఇంట్లో అత్తాకోడళ్ళు పడే గొడవలు, కన్నీళ్లు, భావోద్వేగాలకే పరిమితమైన కథలా కాకుండా… ఈ సిరీస్‌లో తుపాకులు, రక్తపాతం, మాదకద్రవ్యాలు, కుట్రలు, హింస వంటి అంశాలతో థ్రిల్లర్ ప్రియులకు ఐ ఫీస్ట్ లా ఉంటుంది. సోషల్ డ్రామా, క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ జానర్‌లను మిక్స్ చేసి తీసిన ఈ అద్భుతమైన సిరీస్ కు IMDbలో 7.7 రేటింగ్‌ ఉండడం విశేషం.

Advertisement

Also Read : ఇదేందయ్యా ఇదీ… కరిస్తే అక్షరాలా లక్ష… జొంబీకి బంపర్ ఆఫరిచ్చే ఫ్యామిలీ

ఈ సిరీస్ కథ థ్రిల్, యాక్షన్, ఉత్కంఠతో నిండి ఉంది. మొత్తం 8 ఎపిసోడ్‌లతో సాగే ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్ ముగిసే సమయానికి ప్రేక్షకులు తదుపరి మలుపు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. హోమి అడజానియా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ వేగంగా ఊహించని ట్విస్టులతో ముందుకు సాగుతుంది. సౌరభ్ డే, నందిని గుప్తా, అమన్ మన్నన్ రాసిన స్క్రిప్ట్ ఎక్కడా తడబడదు. డింపుల్ కపాడియా రాణి బా పాత్రలో నిర్దయగా కన్పిస్తుంది. ఇషా తల్వార్, అంగీరా ధార్ కోడళ్ల పాత్రల్లో బలంగా ఉంటూనే, అత్త అంటే భయపడతారు. రాధిక మదన్ కుమార్తె శాంత పాత్రకు ప్రత్యేక మలుపు తెస్తుంది. మిగతా నటీనటులు తమ పాత్రలకు జీవం పోశారు. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar)లో అందుబాటులో ఉంది. క్రైమ్-థ్రిల్లర్ జానర్ లో అత్యుత్తమ సిరీస్‌లలో ఒకటిగా నిలిచిన ఈ సిరీస్ ఓటీటీలో హిందీతో పాటు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషలలో అందుబాటులో ఉంది. ఇప్పటికే దీన్ని చూసిన ఆడియన్స్ ఇప్పుడు రెండవ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు.

కథలోకి వెళ్తే…

Advertisement

కథ పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న కల్పిత రాన్ ప్రదేశ్‌ లో సాగుతుంది. ఇక్కడ రాణి బా (డింపుల్ కపాడియా) అనే శక్తివంతమైన మహిళ చట్టానికి అతీతంగా వ్యవహరిస్తుంది. ఆమె కేవలం ఓ ఫ్యామిలీకి పెద్ద మనిషి మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో అత్యంత ప్రముఖ లేడీ డ్రగ్ లార్డ్ కూడా. రాణి బా తన నేర సామ్రాజ్యాన్ని ఇద్దరు కోడళ్లు, ఒక కుమార్తె సహాయంతో నిర్వహిస్తుంది. ఈ కుటుంబం బయటకు సాధారణంగా కనిపించినప్పటికీ, చాలా ప్రమాదకరం. మరి ఈ ఈ లేడీ డాన్ కు ఎదురైన సమస్యలు ఏంటి ? ఎవరైనా తమ జోలికి వస్తే ఆ అత్తాకోడళ్ళు ఏం చేస్తారు ? ఇందులో విలన్ రోల్ ఏంటి ? క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనేది సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×