E-Paper
Advertisement

Crime thriller OTT: మతిపోగొట్టే మర్డర్ మిస్టరీ… అడ్డంగా బుక్కయ్యే డెలివరీ బాయ్… క్లైమాక్స్ వరకు సాగే థ్రిల్లింగ్

Crime thriller OTT: మతిపోగొట్టే మర్డర్ మిస్టరీ… అడ్డంగా బుక్కయ్యే డెలివరీ బాయ్… క్లైమాక్స్ వరకు సాగే థ్రిల్లింగ్
Advertisement

Crime thriller OTT : గుజరాతి నుంచి వచ్చిన ఒక ఆసక్తికర థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే, ఇందులో ఒక్క పాట కూడా ఉండదు. థ్రిల్లర్ సినిమాల్లో సాధారణంగా ఉండే పాటల డైవర్షన్ లేకుండా, కేవలం కథ, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతోనే ప్రేక్షకులను కట్టిపడేసేలా దర్శకుడు దీనిని రూపొందించారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం అహ్మదాబాద్ నగరంలోనే జరిగింది. అక్కడి వీధులను థ్రిల్లర్ మూడ్‌కు తగ్గట్టుగా చూపించారు. ఈ కథ ఒక డెలివరీ బాయ్ అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కున్నప్పుడు జరిగే సంఘటమల చుట్టూ తిరుగుతుంది.

ఈ సినిమాను ఎక్కడ చూడచ్చు అంటే

ఈ గుజరాతీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘క్యాష్ ఆన్ డెలివరీ’. నీరజ్ జోషి దర్శకత్వంలో మల్హర్ థాకర్, వ్యోమా నంది, దర్శన్ జరివాలా, అనంగ్ దేశాయ్ వంటి తారాగణం నటించారు. ‘ఛెల్లో దివస్’ (Chello Divas) సినిమాతో ఫేమస్ అయిన మల్హర్ థాకర్ ఇందులో సీరియస్ రోల్‌లో కనిపిస్తారు. సిద్ధార్థ్ పాత్రలో అతని నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 2 గంటల 17 నిమిషాల ఈ సినిమా, ఐఎమ్‌డిబిలో 6.6/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video, ShemarooMe ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సిద్ధార్థ్ అనే కుర్రాడు ఒక డెలివరీ బాయ్. పొద్దున లేస్తే తన బైక్ వేసుకుని ఊరంతా తిరుగుతూ పార్శిల్స్ ఇస్తుంటాడు. మాములుగా సాగిపోయే అతని లైఫ్ ఒక రోజు ఒక్కసారిగా తలకిందులైపోతుంది. ఒక ఆర్డర్ డెలివరీ చేయడానికి ఒక ఇంటికి వెళ్లినప్పుడు, అక్కడ ఒక మహిళ హత్యకు గురవుతుంది. ఆ హత్యను సిద్ధార్థ్ కళ్లారా చూసేయడంతో అసలు కథ మొదలవుతుంది. అక్కడ చనిపోయింది ఎవరో కాదు, ఒక పెద్ద పొలిటికల్ లీడర్‌కి దగ్గరి మనిషి. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లో సిద్ధార్థ్ కనిపించడంతో, పోలీసులు, రౌడీలు ఇద్దరూ అతని వెనకాలే పడతారు.

పాపం, ఏ పాపం తెలియని ఈ కుర్రాడు ఒక పెద్ద రాజకీయ కుట్రలో ఇరుక్కుపోతాడు. వాళ్ల దగ్గర నుంచి తప్పించుకోవడానికి సిద్ధార్థ్ పడే కష్టాలు, ఊపిరి బిగబట్టేలా సాగే ఛేజింగ్ సీన్లు ఈ సినిమాలో హైలైట్ గా ఉంటాయి. చివరికి ఆ హత్య వెనుక ఉన్న అసలు దొంగలు ఎవరు? వాళ్ళు సిద్ధార్థ్‌ని ఎందుకు ఇరికించాలనుకున్నారు? ఒక డెలివరీ బాయ్ తన తెలివితేటలతో ఆ పెద్ద తలకాయల ఆటను ఎలా కట్టించాడు ? అనే విషయాలను, ఈ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : దీవిలో భార్యతో ఏకాంతంగా… సైకోల టార్చర్ కి చుక్కలు… చూస్తే దిమాక్ ఖరాబ్

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×