E-Paper
Advertisement

యముడిగా మారే హోటల్ యజమాని… వడ్డీ రాక్షసుల గుండెల్లో వణుకు పుట్టించే పవర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్

యముడిగా మారే హోటల్ యజమాని… వడ్డీ రాక్షసుల గుండెల్లో వణుకు పుట్టించే పవర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller Movie on OTT : పల్లెటూరి కథల్లో ఉండే ప్రత్యేకత, మట్టి వాసన, మనుషుల అమాయకత్వం, భూమితో వాళ్లకు ఉన్న అనుబంధం, అన్యాయం జరిగితే ఒక్కసారిగా ఎగిసిపడే ఆవేదన… ఇలాంటివన్ని విలేజ్ డ్రామాలంటే ఆడియన్స్ ఇష్టపడేలా చేస్తాయి. అలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మూవీ Manithan Deivamagalam ఈరోజు మన మూవీ సజెషన్. ఇందులో గ్రామీణ రాజకీయాలు, భూమి కోసం జరిగే పోరాటం, ప్రజల నమ్మకాలను కాపాడే ఒక మనిషి కథను మనసుకు హత్తుకునే విధంగా చూపించారు.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

Dennis Manjunath దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు K. Selvaraghavan ప్రధాన పాత్రలో నటించారు. విభిన్న కథలను తెరకెక్కించే డైరెక్టర్ సెల్వరాఘవన్ నటుడిగా కూడా ఆకట్టుకున్నారు. అయితే ఈసారి ఆయన పూర్తిగా సాధారణ పల్లెటూరి మనిషిగా కన్పించడం విశేషం. ఆయనకు జోడీగా Kushee Ravi నటించారు. అలాగే Kausalya, Mime Gopi, Y. G. Mahendran, Sathish ఇతర పాత్రలు పోషించారు. A. K. Priyan అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి.

Advertisement

2026 ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ప్రస్తుతం ఈ సినిమా రెండు ఓటీటీలలో అందుబాటులో ఉంది. Sun NXT, Airtel Xstream Play ఓటీటీలలో వీక్షించవచ్చు. ఇప్పటికైతే తమిళంలోనే అందుబాటులో ఉన్న ఈ మూవీ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో కూడా అందుబాటులో ఉంది. మరి మిగతా భాషల్లో ఎప్పుడొస్తుందో చూడాలి. దాదాపు 2 గంటల 5 నిమిషాల నిడివితో సాగే సినిమా ఇది.

కథలోకి వెళ్తే…

రాఘవన్ అనే వ్యక్తి పాత్ర ఈ సినిమాలో కీలకం. అతను ఒక చిన్న గ్రామంలో సాదాసీదా జీవితం గడుపుతుంటాడు. భార్య సెల్వితో కలిసి సంతోషంగా ఉంటాడు. ఎవరికీ హాని తలపెట్టని మనస్తత్వం. తన పని తాను చూసుకుంటూ లైఫ్ ను నెట్టుకొస్తాడు. నిజానికి ఆ గ్రామంలో సరైన రోడ్లు ఉండవు. అయితేనేం ఆ ఊరి ప్రజలు మాత్రం ఇవేమీ పట్టించుకోరు. పైగా తమ భూమిని ప్రేమగా కాపాడుకుంటూ, ఉన్నదాంట్లోనే ప్రశాంతంగా బతుకుతారు. కానీ అదే గ్రామంపై ఒక రాజకీయ అండ ఉన్న వడ్డీ వ్యాపారి కన్ను పడుతుంది. అతను వడ్డీకి అప్పులు ఇస్తాడు. అక్కడితో ఆగకుండా అప్పులు తీర్చలేదని అమాయకుల భూములను లాక్కుంటాడు. ఇలా నెమ్మదిగా ఆ ఊరిని తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తాడు. అక్కడే కథ కీలక మలుపు తిరుగుతుంది.

Advertisement

స్టార్టింగ్ లో రాఘవన్ ఈ సమస్యలన్నింటికీ దూరంగానే ఉండాలని అనుకుంటాడు. కానీ పరిస్థితులు నెమ్మదిగా అతని కుటుంబాన్ని కూడా ప్రమాదంలో పడేస్తాయి. గ్రామంలోని పరిస్థితులు చూశాక అతనిలో తిరుగుబాటు మొదలవుతుంది. సాధారణ వ్యక్తి నాయకుడిగా ఎలా టర్న్ తీసుకున్నాడు ? గ్రామ ప్రజలను ఎలా ఏకం చేశాడు ? భూమి కోసం జరిగిన ఈ పోరాటంలో గెలిచింది ఎవరు ? అన్నదే సినిమా ప్రధాన కథాంశం.

Read Also : ప్రియురాలి చెల్లెలితో అలాంటి పాడు పని… బాయ్‌ఫ్రెండ్ కు చెమటలు పట్టించే ప్రియురాలి కథ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×