E-Paper
Advertisement

బ్లాక్ మెయిల్ ఉచ్చులో వయ్యారి భామ… ఆటాడేసుకునే అపరిచితుడు… మైండ్ గల్లంతయ్యే క్లైమాక్స్

బ్లాక్ మెయిల్ ఉచ్చులో వయ్యారి భామ… ఆటాడేసుకునే అపరిచితుడు… మైండ్ గల్లంతయ్యే క్లైమాక్స్
Advertisement

Crime Thriller OTT : కొన్ని క్రైమ్ థ్రిల్లర్లు తక్కువ బడ్జెట్ తో తీసినా ఆకట్టుకుంటాయి. సూపర్ హిట్లు కాకపోయినా ఆడియన్స్ ను మాత్రం అలరిస్తుంటాయి. ఇప్పుడు అలాంటి సినిమా గురించే చెప్పుకోబోతున్నాం. ఈ హిందీ సినిమా కథ బ్లాక్‌మెయిలింగ్ చుట్టూ తిరుగుతుంది. ఒక మిడిల్ క్లాస్ ఇల్లాలి ప్రైవేట్ వీడియోస్ తో ఒక వ్యక్తి బ్లాక్ మైల్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో స్టోరీ ఆసక్తిగా నడుస్తుంది. అయితే ఈ సినిమాలో కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉండటం వల్ల దీనికి ‘A’ సర్టిఫికేట్ ఇచ్చారు. కాబట్టి ఇది కేవలం పెద్దలు మాత్రమే చూడాల్సిన సినిమా.

ఎక్కడ చూడచ్చు అంటే 

2023లో హిందీలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘మజ్బూరియన్’ (Majbooriyan). ఈ సినిమాను మనోజ్ గిరి దర్శకత్వంలో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇందులో మహిమా గుప్తా, అభిషేక్ శర్మ వంటి నటీనటులు, మొత్తం తమ నటనతో సినిమాను నడిపించారు. ఈ సినిమాలో కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ (పెద్దలకు మాత్రమే) సర్టిఫికేట్ ఇచ్చింది, కాబట్టి ఇది కుటుంబంతో కలిసి చూసే సినిమా కాదు. ఈ సినిమా నిడివి కేవలం 1 గంట 29 నిమిషాలతో ShemarooMe, Airtel Xstream Play ఓటీటీలలో అందుబాటులో ఉంది. అయితే IMDbలో దీనికి 5.2/10 రేటింగ్ మాత్రమే లభించింది. దీనిని బట్టి ఇది ఒక మోస్తరుగా సాగే థ్రిల్లర్ అని అర్థం చేసుకోవచ్చు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

సోనాలి అనే ఒక అందమైన అమ్మాయి తన గతాన్ని, పాత అలవాట్లను పక్కన పడేసి, ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని హాయిగా సంసారం చేసుకుంటూ ఉంటుంది. ఆమె జీవితం చాలా సాఫీగా, ఏ గొడవలు లేకుండా సాగిపోతుంటుంది. కానీ తన గతం తన వెంటే వస్తుందని ఆమె అస్సలు ఊహించదు. సరిగ్గా అప్పుడే సీన్ లోకి ఒక విలన్ లాంటి బ్లాక్‌మెయిలర్ ఎంటర్ అవుతాడు. సోనాలి పాత రోజుల్లో చేసిన కొన్ని తప్పులు, ఆమెకు సంబంధించిన కొన్ని సీక్రెట్ ఫోటోలు, వీడియోలు అతని చేతికి చిక్కుతాయి. వాటిని చూపించి, ఆమెను భయపెట్టి తన దారిలోకి తెచ్చుకోవాలని చూస్తాడు. ఒక పక్క మొగుడు, మరో పక్క ఈ బ్లాక్‌మెయిలర్ గొడవతో సోనాలి నరకం చూస్తుంది. ఇక తన కాపురం కూలిపోతుందేమో అని భయపడిన సోనాలి, ఆ బ్లాక్‌ మెయిలర్ నుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. చివరికి ఆ గండం నుంచి ఆమె బయటపడిందా ? అతనికి లొంగిపోయిందా ? ఆమె రహస్యం మొగుడికి తెలిసిందా ? అనే విషయాలతో ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుంది.

Read Also : వీడియో టేపుల్లో వణికించే నిజాలు… మంత్ర తంత్రాల మధ్య మెంటల్ మాస్ సస్పెన్స్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×