E-Paper
Advertisement

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన తమిళ థ్రిల్లర్… తెలుగులోనూ స్ట్రీమింగ్

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన తమిళ థ్రిల్లర్… తెలుగులోనూ స్ట్రీమింగ్
Advertisement

Crime Thriller Movie on OTT: ఓటీటీలోకి మరో తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కి వచ్చింది. ‘ప్రేమిస్తే’ హీరో భరత్ నటించిన ఈ సినిమా థియేటర్లలో అయితే యావరేజ్ ప్రాజెక్ట్‌గా మిగిలిపోయింది. అందుకే థియేటర్ రన్ ముగిసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తెలుగు ఆడియన్స్‌కు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. భరత్ ఎక్కువగా తమిళ సినిమాలు చేసినా తెలుగులో కూడా ఈ హీరోకి మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా మంచి వ్యూస్ పొందుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా పేరు ? ఎక్కడ చూడచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం పేరు ‘కాళిదాస్ 2’ (Kaalidas 2). గత నెల 3 న రిలీజ్ అయిన ఈ సినిమా 2019 లో వచ్చిన ‘కాళిదాస్’ సినిమాకు సీక్వెల్. నటుడు భరత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేసి ఓటీటీ వేదికల్లో విడుదల చేశారు. లయన్స్ గేట్ ప్లే సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు ఈ చిత్రాన్ని తెలుగు ఆడియోతో ఉచితంగా వీక్షించవచ్చు.అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఈ సినిమా ప్రస్తుతం అద్దె విధానంలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇది టెంట్ కొట్టా, సన్ నెక్స్ట్, ఆహా ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. ఇందులో భరత్ తో పాటు అజయ్ కార్తీ, భవానీ శ్రీ, అబర్నతి, ప్రకాష్ రాజ్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇందులో సీనియర్ నటి సంగీత మాధవన్ నాయర్ నటించడం. ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్‌గా మెరిసిన ఆమె, దాదాపు 25 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాతోనే మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఒక పెద్ద హైటెక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌లో న్యూ ఇయర్ వేడుకలు ఫుల్ జోష్‌తో జరుగుతుంటాయి. సరిగ్గా అదే టైమ్‌లో ఒక పెద్దాయన ఫ్యామిలీకి చెందిన నాలుగేళ్ల చిన్న పాప హఠాత్తుగా మాయమైపోతుంది. అసలే గట్టి సెక్యూరిటీ ఉండే చోట పాప ఎలా మిస్సయిందిరా అని అందరూ తలలు పట్టుకుంటారు. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాళిదాస్ (భరత్), తనతో పాటు ఉండే కొత్త ఆఫీసర్ వైష్ణవితో కలిసి వేట మొదలుపెడతాడు. అంతటితో ఆగకుండా అదే అపార్ట్‌మెంట్‌లో ఒక డాక్టర్ బిల్డింగ్ పైనుంచి దూకి చావడం, ఇంకో పిల్లోడు నీళ్లలో మునిగి చావడంతో అక్కడ ఉండే జనాలు భయంతో వణికిపోతారు.

ఈ దారుణాలన్నిటికీ ఆ అపార్ట్‌మెంట్‌లోనే తిరిగే స్టీఫెన్ (అజయ్ కార్తీ) అనే ఒక తేడాగాడు, అతని పెంపుడు కుక్కే కారణమని పోలీసులకి గట్టి డౌట్ వస్తుంది. అయితే వాడు దొరికినట్టే దొరికి తప్పించుకుంటూ పోలీసులని పిచ్చోళ్లని చేస్తుంటాడు. ఇక క్లైమాక్స్ వచ్చేసరికి అసలు ట్విస్ట్ బయటకి వస్తుంది. ఊహించని రేంజ్ ట్విస్టులు వస్తాయి. కాళిదాస్ ఈ కేసును ఎలా ఛేదించాడు? నాలుగేళ్ల పాప మిస్సింగ్ వెనుక సీక్రెట్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : దాని కోసం పరాయి వ్యక్తులకు అమ్ముడుపోయిన విద్యార్థిని… ఇది పెద్దలు మాత్రమే చూడాల్సిన సినిమా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×