E-Paper
Advertisement

Honeymoon Se Hatya OTT : బ్లూ డ్రమ్ హత్యకేసు ఆధారంగా తెరకెక్కిన ‘హనీమూన్ సే హత్య’ డాక్యుమెంటరీ రిలీజ్ డేట్

Honeymoon Se Hatya OTT : బ్లూ డ్రమ్ హత్యకేసు ఆధారంగా తెరకెక్కిన ‘హనీమూన్ సే హత్య’ డాక్యుమెంటరీ రిలీజ్ డేట్
Advertisement

Honeymoon Se Hatya OTT : దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన రియల్ స్టోరీలు సినిమాలుగా లేదంటే సిరీస్ ల రూపంలో తెరకెక్కడం ఇప్పటికే చాలాసార్లు చూశాం మనం. గత ఏడాది వచ్చిన ‘బ్లాక్ వారెంట్’ కూడా అలాంటిదే. ఈ సిరీస్ 2025లోనే బెస్ట్ సిరీస్ గా నిలిచిందంటే, వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందే సిరీస్ లకు ఎంతటి ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్ గా సంచలనంగా మారిన ఒక మర్డర్ కేసు కూడా సిరీస్ రూపంలో మన ముందుకు రాబోతోంది. దానికీ సంబంధించిన రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మరి ఈ సిరీస్ ఏంటి? ఏ ఓటీటీలో, ఎప్పుడు చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

దేశం మొత్తాన్ని కుదిపేసిన సౌరభ్ హత్య కేసు ఆధారంగా ఒక డాక్యుమెంట్ సిరీస్ ‘హనీమూన్ సే హత్య’ Honeymoon Se Hatya రాబోతోంది. ఈ సిరీస్ జనవరి 9న ZEE5లో విడుదల కానుంది. తాజాగా ఈ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు విడుదల తేదీని కూడా వల్లడించారు మేకర్స్. ఇందులో యథార్థ సంఘటనతో పాటు మహిళలు భర్తలను ఎందుకు చంపుతారు ? అనే ఇంట్రస్టింగ్ విషయాలను కూడా వెల్లడించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక పోస్టర్ లో దేశాన్ని షేక్ చేసిన డ్రమ్, అందులో ఒక మనిషి చేయి కన్పించడం ఆసక్తిని రేపుతోంది.

Advertisement

Read Also :  అమ్మాయిలకు నరకం చూపించే ఆ చోటు… ఆశ్రమంలో అవాక్కయ్యే స్టోరీలు… గూస్ బంప్స్ తెప్పించే రియల్ స్టోరీ

అసలేం జరిగిందంటే ?

డాక్యుమెంట్ సిరీస్ ‘హనీమూన్ సే హత్య’ నుంచి తాజాగా వచ్చిన అప్డేట్ తో ఆ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2025 మార్చి 4న మీరట్‌లోని శాస్త్రి నగర్‌లో జరిగిన సౌరభ్ మర్డర్ కేసు గురించే మనం మాట్లాడుతున్నాం. ముస్కాన్ అనే మహిళ ప్రేమికుడు సాహిల్‌ తో కలిసి, తన భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ ను హత్య చేసింది. అతని శరీరాన్ని ముక్కలుగా నరికి, నీలిరంగు డ్రమ్‌ లో వేసింది. ఈ హత్య కేసుపై ఒక డాక్యుమెంటరీ సిరీస్ రూపొందింది. హత్యకు పాల్పడిన ముస్కాన్, సాహిల్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. వారికి శిక్ష విధించిన కొన్ని రోజుల తర్వాత ముస్కాన్ గర్భవతి అని తెలిసింది. రీసెంట్ గా ఆమె జైలులోనే ప్రసవించిందనే విషయం వెల్లడైంది. కానీ ఇప్పుడు ఆమె – సాహిల్ కలిసి చేసిన నేరాల చిట్టా ఈ సిరీస్ ద్వారా క్లారిటీ గా వెల్లడి కానున్నాయి. ఏదైతేనేం ఈ ఘటనతో ఒక్కసారిగా మగజాతి ఆణిముత్యాలు షాక్ తిన్నారు. డ్రమ్, సిమెంట్ బస్తా అనే మాట ఎత్తితే చాలు ఆమడ దూరం పారిపోయారు. ట్రోల్స్ మాత్రమే కాదు ఈ ఘటనపై వచ్చిన రీల్స్ కూడా రచ్చ రచ్చ చేశాయి సోషల్ మీడియాలో. ఇప్పుడిప్పుడే దాని గురించి అందరూ మర్చిపోతున్న తరుణంలో డాక్యుమెంటరీ రాబోతుండడంతో మరోసారి ఈ విషయం ట్రెండ్ అవుతోంది.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×