E-Paper
Advertisement

గర్భవతుల్నే టార్గెట్ చేసి ఘోరంగా చంపే సైకో… ఒక్కో సీన్ కు వణుకు పుట్టాల్సిందే

గర్భవతుల్నే టార్గెట్ చేసి ఘోరంగా చంపే సైకో… ఒక్కో సీన్ కు వణుకు పుట్టాల్సిందే
Advertisement

Crime Thriller OTT : ‘సీమంతం’ సినిమా గురించి ఎప్పుడైనా విన్నారా ? ఈ పేరు వినగానే చాలామందికి ఇదేదో సాధారణ థ్రిల్లర్ అనిపించొచ్చు కానీ ఒక్కసారి ఈ కథలోకి అడుగుపెడితే ప్రతీ సీను క్లైమాక్స్‌లా ఉంటుంది. చీకటి వీధుల్లో చప్పుళ్లు వినిపిస్తాయి.. మౌనం మధ్యలో మర్మాలు కదులుతాయి. ఒక్కో క్లూ వెనుక మరింత భయం దాగి ఉంటుంది. నిజానికి దగ్గరయ్యే కొద్దీ గుండె వేగం పెరుగుతుంది. ఇంతకీ ఈ సినిమా కథేంటి? ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఏ ఓటీటీలో ఈ సినిమాను చూడాలి?

ఓటీటీ రిలీజ్ ఎప్పుడు ?

Advertisement

నగరాన్ని కుదిపేసే విధంగా వరుస హత్యలు జరుగుతుంటాయి. ఈ మర్డర్స్‌ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలకు సమాధానం దొరకదు. ఇలా ఓ చీకటి ప్రపంచాన్ని ఆవిష్కరించే తెలుగు క్రైమ్ థ్రిల్లర్‌ సినిమానే ‘సీమంతం’ (CMantham). సుధాకర్ పాణి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వజ్రయోగి ప్రధాన పాత్రలో కనిపిస్తారు. ఆయనతో పాటు శ్రేయ భారతి, ప్రవీణ్ దాచారం, అనిల్ లింగంపల్లి ముఖ్య పాత్రలు పోషించారు. మొదటి సీన్ నుంచే భారీ ఉత్కంఠను సృష్టించే విధంగా సినిమా సాగుతుంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని థ్రిల్‌కు గురి చేస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డార్క్ టోన్ ఈ కథకు మరింత భయానక వాతావరణాన్ని తీసుకొస్తాయి.

ఈ సినిమా 2025లో విడుదలైంది. భారీ స్థాయి బడ్జెట్ లేకపోయినా, కంటెంట్ ఆధారంగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కథలోని ట్విస్టులు, క్లైమాక్స్‌లో వచ్చే రివీల్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మేకర్స్ ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్‌పై కాకుండా, కథలోని మిస్టరీపై దృష్టి పెట్టడం ఈ చిత్రానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఏ ఓటీటీలో అందుబాటులోకి వస్తుందో ఇంకా అధికారిక సమాచారం లేదు. కానీ త్వరలోనే రిలీజ్ అవ్వడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

Also Read : కాలేజ్ అమ్మాయిలను ఘోరంగా వేటాడి చంపే సైకో… ఇది కదా రివేంజ్ అంటే

స్టోరీ ఏంటంటే?

కథ విషయానికి వస్తే, ఒక నగరంలో వరుసగా జరుగుతున్న హత్యల కేసులు ఒక డిటెక్టివ్ ముందుకు వస్తాయి. అతను వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ప్రతి క్లూ అతన్ని మరింత లోతైన రహస్యాల వైపు నడిపిస్తుంది. అతను కనుగొనే ప్రతి నిజం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ ప్రయాణంలో అతని వ్యక్తిగత జీవితం కూడా దెబ్బతింటుంది. నిద్ర ఉండదు. ఫుల్‌గా ప్రెజర్‌ ఫేస్ చేస్తుంటాడు. ఇలా చివరికి ఆ హత్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏంటి ? ఆ నేరగాడు ఎవరనే విషయం బయటపడే విధానం కథలో నెక్ట్స్‌ లెవల్‌ అని చెప్పవచ్చు. న్యాయం కోసం పోరాడే ఒక వ్యక్తి ఎంతవరకు తనను తాను కోల్పోతాడో చూపించే ఈ కథ, ప్రేక్షకుడిని చివరి వరకు ఉత్కంఠకు గురి చేస్తుంది. అందుకే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలామంది వెయిటింగ్. మరి ఓటీటీలో రాగానే ఈ సినిమాపై ఓ లుక్కేద్దామా?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×