E-Paper
Advertisement

16 ఏళ్ల అమ్మాయి మిస్సింగ్… ఆరు ఎపిసోడ్లతో సాగే ఉత్కంఠభరితమైన ఇన్వెస్టిగేషన్

16 ఏళ్ల అమ్మాయి మిస్సింగ్… ఆరు ఎపిసోడ్లతో సాగే ఉత్కంఠభరితమైన ఇన్వెస్టిగేషన్
Advertisement

Crime Thriller OTT : ఇప్పుడు వెబ్ సిరీస్ ల టైమ్ నడుస్తోంది. చిన్న హీరోల దగ్గరనుంచి, స్టార్ హీరోల దాకా ఈ సిరీస్ లలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక వీటిలో కూడా థ్రిల్లర్ జానర్ ను రూపొందించేందుకు మేకర్స్ మరింత ఆసక్తిని చూపిస్తున్నారు. ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం కసరత్తులు చేసి ఓటీటీలోకి వదిలి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక కంటెంట్ బాగుంటే ఆడియన్స్ కూడా వీటిని ఎక్కడికో తీసుకెళ్తున్నారు భాషను కూడా లెక్కచేయకుండా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ ఓటీటీలో రిలీజ్ అయిన తరువాత బాగా ట్రెండింగ్ లో నడిచింది. ఇది ఒక అమ్మాయి మిస్సింగ్ చుట్టూ సాగే థ్రిల్లర్. ఒక్క ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే చివరి ఎపిసోడ్ దాకా అస్సలు ఆపలేరు.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ అర్జెంటీనా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘కాట్’ (Caught). ఇది ప్రముఖ రచయిత హర్లన్ కోబెన్ రాసిన నవల ఆధారంగా లాటిన్ అమెరికాలో రూపొందించబడిన మొట్టమొదటి ప్రాజెక్ట్. ఇందులో నటించిన సోలెడాడ్ విల్లామిల్ (ఆస్కార్ గెలిచిన ‘ది సీక్రెట్ ఇన్ దేర్ ఐస్’ నటి) అల్బెర్టో అమ్మాన్ (‘నార్కోస్’ ఫేమ్) తమ నటనతో సిరీస్‌కు ప్రాణం పోశారు. మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్న ఈ లిమిటెడ్ సిరీస్, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొందింది. మిగ్యుల్ కోహన్, హెర్నాన్ గోల్డ్‌ఫ్రిడ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 2025 మార్చి 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

Advertisement

అర్జెంటీనాలోని బారిలోచే అనే అందమైన నగర నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఎమా అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, తప్పించుకు తిరుగుతున్న నేరస్థులను పట్టుకోవడంలో దిట్ట. ఆమె ఒక టీవీ షో ద్వారా ఇలాంటి వాళ్ళని వెలుగులోకి తెస్తుంటుంది. ఈ క్రమంలో మార్టినా అనే 16 ఏళ్ల అమ్మాయి అదృశ్యం కావడంతో ఆ కేసును ఛేదించాలని ఎమా నిర్ణయించుకుంటుంది. అయితే ఈ కేసులో అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ కిడ్నాప్ వెనక లియో అనే ఒక సోషల్ వర్కర్ ఉన్నాడని అనుమానం వస్తుంది. ఈ లియో ఎవరో కాదు, ఒకప్పుడు ఎమాకి మనసిచ్చిన పాత ప్రేమికుడు. బయట అందరూ అతన్ని చాలా మంచోడు, దైవసమానుడు అని నమ్ముతుంటారు.

కానీ ఎమాకి మాత్రం అతను ఏదో తప్పు చేస్తున్నాడని గట్టిగా అనిపిస్తుంది. తన పాత ప్రేమను పక్కన పెట్టి, వాడి అసలు రంగు బయటపెట్టాలని కంకణం కట్టుకుంటుంది. చివరికి ఆ అమ్మాయి ఏమైంది? నిజంగానే లియో ఆ అమ్మాయిని ఏమైనా చేశాడా? లేక దీని వెనక ఇంకెవరైనా పెద్ద తలకాయలు ఉన్నారా? ఎమా ఈ కేసును ఎలా డీల్ చేస్తుంది ? అనేదే అసలు కథ. క్లైమాక్స్‌లో వచ్చే మలుపులు మాత్రం అస్సలు ఊహించలేం.

Advertisement

Read Also : చదువు ఉన్నా విధిని జయించలేక… పల్లెటూరి ఆచారాల మధ్య చిక్కుకున్న ఒక డాక్టర్ కథ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×