E-Paper
Advertisement

పోలీసులకే సవాల్ విసిరిన కేసు… గుట్టు విప్పిన లేడీ డిటెక్టివ్స్… ఐయండిబిలో 8.3 రేటింగ్

పోలీసులకే సవాల్ విసిరిన కేసు… గుట్టు విప్పిన లేడీ డిటెక్టివ్స్… ఐయండిబిలో 8.3 రేటింగ్
Advertisement

Crime Series OTT : ఓటీటీలో ఒక ఎమోషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ ఆడియన్స్ ను కట్టిపడేస్తోంది. రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ కు ఐయండిబిలో 8.3 రేటింగ్ కూడా ఉంది. ఇందులో కమర్షియల్ సినిమాల్లాగా ఫైట్లు, బిల్డప్ సీన్లు ఉండవు కానీ, కథ చాలా గ్రిప్పింగ్‌గా సాగుతుంది. ఒకవైపు బాధితురాలు పడే నరకం, మరోవైపు ఇద్దరు లేడీ పోలీసులు ఆ కేసును ఛేదించడానికి చేసే ప్రయత్నాలు చాలా రియలిస్టిక్ గా చూపిస్తారు ఇందులో. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లు అస్సలు మిస్ అవ్వకూడని సిరీస్ ఇది.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

2019లో వచ్చిన ఈ అమెరికన్ క్రైమ్ డ్రామా మినీ సిరీస్ పేరు ‘అన్‌బిలీవబుల్’ (Unbelievable). ఈ సిరీస్ 2015లో పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్న “An Unbelievable Story of Rape” అనే ఇన్వెస్టిగేటివ్ ఆర్టికల్ ఆధారంగా రూపొందింది. కేవలం ఎనిమిది ఎపిసోడ్లు మాత్రమే ఉండే ఈ మినీ సిరీస్, బాధితుల పట్ల వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. అందుకే దీనికి విమర్శకుల నుండి భారీ ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా Rotten Tomatoes వంటి సైట్లలో 98% రేటింగ్ సాధించడమే కాకుండా, ప్రతిష్టాత్మకమైన పీబోడీ అవార్డును కూడా గెలుచుకుంది ఈ సిరీస్. ఇందులో నటించిన కైట్లిన్ డెవర్, టోనీ కొల్లెట్, మెరిట్ వీవర్ తమ నటనతో ఆకట్టుకుని గోల్డెన్ గ్లోబ్, ఎమ్మె అవార్డులకు కూడా నామినేట్ అయ్యారు. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో అత్యధికంగా వ్యూస్ సాధించిన లిమిటెడ్ సిరీస్‌లలో ఇది కూడా ఒకటి.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

మారి అనే ఒక అమ్మాయి తనపై ఎవరో అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కానీ ఆ కేసును విచారించే పోలీసులు ఆమె మాటలను నమ్మకుండా, పదే పదే ప్రశ్నించి ఆమెను అయోమయానికి గురిచేస్తారు. దాంతో ఆమె ఒత్తిడి తట్టుకోలేక, అసలు ఏమీ జరగలేదని అబద్ధం చెబుతుంది. ఫలితంగా పోలీసులు ఆమెపైనే తప్పుడు ఫిర్యాదు చేసినందుకు కేసు నమోదు చేస్తారు. దీనివల్ల ఆమె సమాజంలో ఒంటరిదైపోతుంది. కొంతకాలం తర్వాత, ఇద్దరు మహిళా డిటెక్టివ్‌లు వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతున్న ఇలాంటి నేరాలను గమనిస్తారు.

ఇక ఆ నేరస్థుడు ఎటువంటి ఆధారాలు వదలకుండా చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడని వాళ్ళు గుర్తిస్తారు. బాధితుల పట్ల సానుభూతితో చూపిస్తూ, ఆ ఇద్దరు అధికారులు కలిసి చాలా ఓపికగా ఈ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిస్తారు. చివరికి వాళ్ళు ఆ నిందితుడిని పట్టుకున్నప్పుడు, అతను గతంలో మారిని కూడా బలవంతం చేశాడని ఆధారాలతో సహా నిరూపిస్తారు. దీంతో ఆమె చెప్పింది నిజమేనని లోకానికి తెలుస్తుంది. వ్యవస్థ చేసిన తప్పు వల్ల ఒక అమాయకురాలు ఎంత వేదన అనుభవించిందో, చివరకు ఆమెకు న్యాయం ఎలా దక్కిందో ఈ సిరీస్ చూపిస్తుంది.

Advertisement

Read Also : రిలేషన్షిప్ మర్డర్ తో దిమ్మతిరిగే లీగల్ క్రైమ్ స్టోరీ… క్లైమాక్స్ మాత్రం అస్సలు ఊహించలేరు బాస్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×