E-Paper
Advertisement

3 పుర్రెలు… 40 ఏళ్ల నాటి మిస్టరీ కేసు… సీటు అంచున కూర్చోబెట్టే ఇన్వెస్టిగేషన్

3 పుర్రెలు… 40 ఏళ్ల నాటి మిస్టరీ కేసు… సీటు అంచున కూర్చోబెట్టే ఇన్వెస్టిగేషన్
Advertisement

Crime Mystery Thriller OTT : ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్ చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. వీటిని భాషతో సంబంధం లేకుండా చూస్తుంటారు కూడా. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా మామూలుగా అయితే ఉండదు. ఇది కన్నడ ఇండస్ట్రీలో వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఐయండిబిలో ఈ చిత్రానికి 7.9/10 రేటింగ్ ఉందంటే సినిమా ఏ పాటిదో అర్థం అవుతుంది. అంతేకాదు ఈ సినిమాలో ఒక ట్రాఫిక్ ఎస్సై మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అదికూడా 40 ఏళ్ల క్రితం నాటి మూడు హత్యల కేసును. క్లైమాక్స్ వరకు స్టోరీ చూపు కూడా తిప్పుకోనివ్వదు.

ప్రైమ్ వీడియో (Prime Video)లో స్ట్రీమింగ్ 

ఈ కన్నడ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా పేరు ‘కవలుదారి’ (Kavaludaari). 2019 ఈ సినిమా హేమంత్ ఎం. రావు దర్శకత్వంలో వచ్చిన ఒక అద్భుతం. పునీత్ రాజ్‌కుమార్ తన హోమ్ బ్యానర్ ‘పిఆర్‌కె ప్రొడక్షన్స్’ ద్వారా నిర్మించిన మొదటి చిత్రం ఇది. ఇందులో రిషి (శ్యామ్), అనంత్ నాగ్ (ముత్తన్న) లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా ఇద్దరికీ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. ఈ సినిమా కథ ఎంత పవర్‌ఫుల్ అంటే, దీనిని తెలుగులో ‘కపటధారి’ (సుమంత్ హీరోగా), తమిళంలో ‘కబడదారి’ (సిబి సత్యరాజ్ హీరోగా) రీమేక్ కూడా చేశారు. చరణ్ రాజ్ అందించిన సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియో (Prime Video) లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

హీరో శ్యామ్ ఒక ట్రాఫిక్ ఎస్సై. రోజూ రోడ్డు మీద నిలబడి చలాన్లు రాయడం, బండ్లు పట్టుకోవడం అతనికి అస్సలు నచ్చదు. ఏదైనా గట్టి క్రైమ్ కేసు పట్టుకోవాలని తహ తహలాడుతుంటాడు. సరిగ్గా అదే టైంలో ఒక మెట్రో కన్స్ట్రక్షన్ దగ్గర తవ్వుతుంటే మూడు పాత పుర్రెలు బయటపడతాయి. ఇది చూసిన శ్యామ్, ఇది ఏదో మామూలు విషయం కాదని, ఆ పుర్రెలు ఎవరివో.. అసలు ఏం జరిగిందో తేల్చాలని ఫిక్స్ అయి డ్యూటీ పక్కన పెట్టి దర్యాప్తు మొదలుపెడతాడు. ఇన్వెస్టిగేషన్ లో ఆ పుర్రెలు 40 ఏళ్ల కిందటి ఒక ఫ్యామిలీకి చెందినవని తెలుస్తుంది. అప్పట్లో ఆ కేసును డీల్ చేసిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ముత్తన్న దగ్గరకు వెళ్తాడు శ్యామ్. ముత్తన్న మొదట కాస్త రాద్ధాంతం చేసినా, తర్వాత శ్యామ్ పట్టుదల చూసి ఇద్దరూ కలిసి పాత ఫైళ్లు దుమ్ముదులుపుతారు.

ఇక దర్యాప్తు లోతుగా వెళ్లేకొద్దీ ఆ కేసులో ఒక పెద్ద పొలిటికల్ లీడర్ హస్తం ఉందని, ఆ రోజు జరిగిన హత్యల వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉందని వాళ్లకు అర్థమవుతుంది. ఈ వెతుకులాటలో విలన్ గాళ్లు వీళ్లను ఆపడానికి మాగ్జిమం ట్రై చేస్తారు. కానీ శ్యామ్, ముత్తన్న కలిసి ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటూ వెళ్తారు. చివరకు ఆ ముగ్గురిని చంపింది ఎవరు ? ఎందుకు చంపారు ? అప్పటి కేసులో వీళ్ళకి ఇప్పుడు శిక్ష పడుతుందా ? అసలు ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలతో ఈ సినిమా గ్రిప్పింగ్ గా సాగుతుంది.

Advertisement

Read Also : సినీ చరిత్రను తిరగ రాసిన గ్రేటెస్ట్ యాక్షన్ సినిమాలు ఇవే… వీటి ట్రైలర్ చూస్తేనే మీ మైండ్ బ్లాక్ అయిపొద్ది

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×