E-Paper
Advertisement

Crime Drama Series ott : 34 ఎపిసోడ్‌లు, 3 సీజన్‌లు…, 6.6 IMDb రేటింగ్… ఓటీటీ ప్రపంచాన్ని కుదిపేసిన క్రేజీ సిరీస్

Crime Drama Series ott : 34 ఎపిసోడ్‌లు, 3 సీజన్‌లు…, 6.6 IMDb రేటింగ్… ఓటీటీ ప్రపంచాన్ని కుదిపేసిన క్రేజీ సిరీస్
Advertisement

Crime Drama Series ott : ప్రేక్షకులు ఇప్పుడు వెండితెర మీద కంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వెబ్ సిరీస్‌ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. జోనర్ ఏదైనా, భాష ఏదైనా మంచి కంటెంట్‌ను చూడటానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సంవత్సరాలుగా ట్రెండింగ్‌లో ఉన్న ఒక క్రైమ్ సిరీస్ గురించి చెప్పుకుందాం. ఇప్పటికే మూడు సీజన్లు సూపర్ హిట్ అవ్వడంతో ఈ సిరీస్ నాల్గవ సీజన్‌కు సంబంధించి అప్డేట్ కూడా వచ్చేసింది. ఇది అభిమానులలో ఉత్సాహాన్ని పెంచింది. దీని కోసం ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సిరీస్ పేరు, ఏ వీటిలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

దీని పేరు ఏమిటంటే ?

ఇటీవల ఓటీటీలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ క్రైమ్ సిరీస్ పేరు “ఆశ్రమ్”. 2020 లో వచ్చిన ప్రకాష్ ఝా రూపొందించిన ఈ సిరీస్ అత్యంత ప్రజాదరణ పొందిన, అత్యధికంగా వ్యూస్ సాధించిన సిరీస్ గా చెప్పుకోబడింది. 2020 నుంచి ఇప్పటికీ మూడు సీజన్లు వచ్చి 6.6 IMDb రేటింగ్ తో నడిచింది. కొత్త సీజన్ కోసం సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ సిరీస్‌ నటి త్రిధా చౌదరి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నెక్స్ట్ సీజన్ షూటింగ్ జరుపుకోబోతోందని, నిర్మాతలు ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నారని స్పస్టం చేసింది. ఈ ప్రకటన తర్వాత అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత, “ఆశ్రమ్ 4” తిరిగి వార్తల్లోకి వచ్చింది. ఇక బాబీ డియోల్ నటించిన ఈ సిరీస్ సీజన్ 4 షూటింగ్ ఈ ఏడాది ప్రారంభమవుతుంది.

Advertisement

Read Also : విజయ్ సేతుపతి టాప్ మూవీస్… లిస్ట్ లో నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ కూడా… ఏ మూవీని ఎక్కడ చూడవచ్చు అంటే ?

ఇందులో నటించే అవకాశం త్రిధాకి ఎలా వచ్చింది అంటే ?

ఇక త్రిధా చౌదరి తనకు ఈ సిరీస్‌లో అవకాశం ఎలా వచ్చిందో కూడా వెల్లడించింది. తాను రచయిత్రి మాధవి భట్‌ను ఒక సూపర్ మార్కెట్‌లో కలిశానని ఆమె చెప్పింది. అప్పుడు మాధవి భట్ ఆమె పేరును ప్రకాష్ ఝాకు సిఫార్సు చేసిందని చెప్పుకొచ్చింది. ఇక జప్నం పాత్రకు ఆమె చాలా కష్టపడినట్లు చెప్పింది. అయితే ఆమె ఇప్పుడు ప్రజల్లో జప్నం గా బాగా ఫేమ్ తెచ్చుకుంది. ఆమెకు వేల సంఖ్యలో అభిమానులను కూడా తెచ్చిపెట్టింది ఈ సిరీస్.

MX ప్లేయర్ లో స్ట్రీమింగ్

Advertisement

2020లో విడుదలైన “ఏక్ బద్నామ్ ఆశ్రమం” MX ప్లేయర్ లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రైమ్ డ్రామా సిరీస్‌లలో ఒకటి. బాబీ డియోల్ బాబా నిరాల పాత్రను పోషించాడు. బయట ఒక మంచి సాధువులా, లోపల మోసపూరిత మోసగాడిగా. రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం అతనితో ఎలా సన్నిహితంగా ఉంటారో ఇది చూపిస్తుంది. మొదటి మూడు సీజన్లు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇక నాల్గవ సీజన్ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×